"పూసపాటి సంచయిత గజపతిరాజు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: లో → లో , ను → ను , స్పూర్తి → స్ఫూర్తి, సంభందిం → సంబంధిం, → (23)
చి (→‎సామాజిక సేవలు: AWB తో "మరియు" ల తొలగింపు)
చి (AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: లో → లో , ను → ను , స్పూర్తి → స్ఫూర్తి, సంభందిం → సంబంధిం, → (23))
| relatives = [[పూసపాటి అశోక్ గజపతి రాజు|అశోక్ గజపతి రాజు]]
}}
'''పూసపాటి సంచయిత గజపతిరాజు''' శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్‌పర్సన్‌<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/andhra-pradesh/sanchaita-gajapathi-raju-says-she-hinduism-1269344|title=అలాంటి మాటలను పట్టించుకోను: సంచయిత|date=2020-03-09|website=Sakshi|language=te|access-date=2020-03-09}}</ref>, మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్ట్‌కు ఛైర్మన్‌<ref>{{Cite web|url=http://www.10tv.in/check-out-aadhaar-card-ap-sanchita-gajapati-raju-ashok-gajapathi-raju-27668|title=మాన్సాస్ మంటలు : సంచయిత ఆధార్ కార్డు పరిశీలించండి - అశోక్ గజపతి రాజు|website=www.10tv.in|language=en|access-date=2020-03-09}}</ref>. వృత్తి రీత్యా ఆమె న్యాయవాది. గూగుల్ ఇంపాక్ట్ చాలెంజ్ అవార్డును గెలుచుకుంది<ref>{{Cite web|url=https://www.apherald.com/Politics/ViewArticle/469425/askthi-reputunna-ashok-vs-sanchaitha-poru|title=ఆసక్తి రేపుతున్న అశోక్ గజపతి వర్సెస్ సంచయిత గజపతి పోరు..|website=APHerald [Andhra Pradesh Herald]|language=te|access-date=2020-03-09}}</ref>. ఆమె [[భారతీయ జనతా పార్టీ]] లో క్రియాశీలక సభ్యురాలు. భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు<ref name=":0">{{Cite web|url=https://www.mirrortoday.in/sanchaitha-gajapathi-raju-vs-ahok-gajapathi-raju/|title=రాజ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించిన సంచయిత|last=admin|date=2020-03-07|website=Mirror Today Online Telugu News|language=en-US|access-date=2020-03-09}}</ref>.
 
==జీవిత విశేషాలు==
ఆమె విజయనగరంలో ఆనంద గజపతి రాజు, ఉమా గజపతి రాజు దంపతులకు రెండవ కుమార్తెగా జన్మించింది<ref name=":0" />. ఆమె తల్లి స్వంత ఊరు కేరళ లోని పాల్ఘాట్. ఆమె తాత విజయ రామ గజపతి రాజు అభ్యుదయవాది. అతను ఆడపిల్లలు చదువుకోవాలని, ప్రజాజీవితంలో క్రియాశీలకంగా ఉండాలని చెప్పేవారు. ఆమె చదువంతా ఢిల్లీలోనే కొనసాగింది. ఆమె తల్లి లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నప్పుడు ఆమె తల్లితో గ్రామాలను సందర్శించేది. ప్యాలెస్ కు పరిమితం కాకుండా ప్రజా జీవితంలోకి వచ్చి పనిచేయాలని ఆమె తల్లి చెప్పేది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్ (ఆనర్స్) చేసింది. తరువాత లా కోర్సు చేసి ఢిల్లీ బార్ కౌన్సిల్ లో చేరింది. లాయర్ గా ప్రాక్టీసు చేయడం ఆమెకు ఉపాధి కోస్ం మాత్రమే. చుట్టు ప్రక్కల గ్రామాల్లో బాలికా విద్య కోసం కృషి చేసేది<ref>{{Cite web|url=https://epaper.sakshi.com/c/48904357|title=Clipping of Sakshi Telugu Daily - Andhra Pradesh|website=epaper.sakshi.com|access-date=2020-03-09}}{{Dead link|date=మార్చి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
ఆమె తల్లి పూసపాటి ఆనంద గజపతి రాజు నుంచి విడాకులు తీసుకున్న అనంతరం రమేష్ శర్మతో పునర్వివాహం చేసుకుంది<ref>{{Cite web|url=http://www.teluguone.com/news/content/is-sanchaita-gajapati-raju-a-christian-25-95219.html|title=సింహాచల ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ నియామకం.. మిక్సహ..మిక్సస్య..మిక్సో భ్యహ|date=2020-03-09|website=Teluguone|language=english|access-date=2020-03-09}}</ref>. 2016 లో ఆమె తండ్రి ఆనంద గజపతి రాజు మరణించాడు<ref>{{Cite web|url=https://manalokam.com/news/politics/sanchaitha-sensational-comments-on-ashok-ganapathiraju.html|title=టీడీపీ సీనియర్ కి షాక్ ఇచ్చిన కూతురు...!|last=Sahithya|first=parupalli|date=2020-03-07|website=telugu news {{!}} Manalokam.com|access-date=2020-03-09}}</ref>. ఆమె తల్లి [[ఉమా గజపతి రాజు]] విశాఖపట్నం నుండి లోక్‌సభ పార్లమెంటు సభ్యురాలుగా, సామాజిక కార్యకర్తగా తన సేవలనందించింది. ఉమా గజపతిరాజు రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌తో చురుకుగా పాల్గొంది. రైలు ఆసుపత్రి అయిన ‘లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్’ నుఎక్స్‌ప్రెస్’ను ఆంధ్రాలోని గిరిజన ప్రాంతాలకు తీసుకువచ్చింది. ఆమె సవతి తండ్రి రమేష్ శర్మ ఒక ఉద్యమకారుడు, చిత్రనిర్మాత. " ద జర్నలిస్ట్ అండ్ ద జిహాదీ - ద మర్డర్ ఆఫ్ డేనియల్ పెరల్" అనే డాక్యుమెంటరీ చేసి అవార్డులు గెలుచుకున్నాడు<ref name=":1" />.
 
సంచయిత గజపతి రాజు 2018 సంవత్సరంలో బీజేపీలో చేరింది<ref>{{Cite web|url=https://telugu.news18.com/photogallery/politics/gallery-anand-gajapathi-raju-daughter-sanchaita-joins-bjp-50132.html|title=Pics: బీజేపీలో చేరిన సంజయిత గజపతిరాజు|date=2018-10-03|website=News18 Telugu|access-date=2020-03-09}}{{Dead link|date=మార్చి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. ప్రధానమంత్రి [[నరేంద్ర మోదీ]] [[స్వచ్ఛ భారత్]] స్పూర్తితోస్ఫూర్తితో [[విశాఖపట్నం జిల్లా]]<nowiki/>లో సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఆమె జిల్లాలో సురక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేసి, 2013లో గూగుల్ ఇంపాక్ట్ ఛాలెంజ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రూ.3కోట్ల ఫస్ట్ ప్రైజ్‌ను గెలుచుకుంది. ఆ డబ్బును కూడా సేవా కార్యక్రమాలకు వినియోగించింది<ref>{{Cite web|url=http://vastavam.net/2020/02/21/2-19-5/|title=జాక్ పాట్ కొట్టిన బిజేపీ మహిళా నేత..జగన్ బంఫర్ ఆఫర్..!! {{!}} VASTAVAM|last=admin|language=en-US|access-date=2020-03-09}}</ref>.
 
== సామాజిక సేవలు ==
ఆమె 2011 లో ఆమె ఎన్జీఓ, సోషల్ అవేర్‌నెస్ న్యూ ఆల్టర్నేటివ్స్ (SANA) ను ఏర్పాటు చేసింది. ప్రారంభమైనప్పటి నుండి ఈ సంస్థ రెండు తాగునీటి ప్రాజెక్టులను అమలు చేసింది. వాటిలో ఒకటి తూర్పు ఢిల్లీ లోని ఒక పాఠశాలలో, మరొకటి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి లోని [[చామవరం|ఎన్ చమవరం]] గ్రామంలో ఉన్నాయి. చామవరం వద్ద గ్రామస్తులను ఈ ప్రాజెక్టులో వాటాదారులుగా చేశారు. వారు వినియోగించే నీటి కోసం వినియోగదారుల నుండి నామమాత్రపు రుసుము వసూలు చేసేవారు. ఈ సంస్థ సౌరశక్తితో పనిచేసే నీటి శుద్ధి కర్మాగారాన్ని నిర్వహించడానికి స్థానికులకు శిక్షణ ఇచ్చింది. ఇది భూమి నుండి నీటిని తీసుకుని త్రాగే ప్రయోజనాల కోసం WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేస్తుంది. ప్లాంట్ యొక్క మరమ్మత్తు, నిర్వహణను జాగ్రత్తగా చూసుకునే కార్మికులకు చెల్లించడానికి గ్రామస్తుల నుండి సేకరించిన డబ్బును ఉపయోగిస్తారు<ref name=":1" />.
 
న్యూఢిల్లీలో, తూర్పు ఢిల్లీ లోని సూరజ్‌మల్ విహార్‌లోని రాజ్‌కియా ప్రతిభా వికాస్ విద్యాలయ (ఆర్‌పివివి) వద్ద ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటును నిర్వహించడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కూడిన కమిటీని పాఠశాల ఏర్పాటు చేసింది. గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించడం గురించి విద్యార్థులకు తెలుస్తుంది. ఈ ప్లాంట్ నుండి 5 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని ఇంటికి తీసుకెళ్లడానికి పిల్లలను అనుమతిస్తారు. ఈ ప్రాజెక్ట్ పాఠశాలలో పిల్లల హాజరును మెరుగుపరిచింది. వీరు ఎక్కువగా సమీప మురికివాడల నుండి వచ్చేవారు. ఈ రంగంలో సుమారు మూడేళ్లుగా పనిచేసిన ఆమె, గ్రామీణ ప్రాంతాలకు తాగునీటితో పాటు పారిశుధ్య సౌకర్యాలు అవసరమని గ్రహించింది. రాబోయే సంవత్సరాలలో తాగునీటి ప్లాంట్ల నుండి ఉత్పత్తి అయ్యే వ్యర్థ జలాన్ని బయో టాయిలెట్లలో వాడటం ద్వారా గ్రామాల్లోని ప్రాజెక్టులు నిర్వహించబడతాయి. వ్యవస్థ నుండి ఉత్పత్తి చేయబడిన బయో గ్యాస్ మరుగుదొడ్లకు లైట్లు అందించడానికి ఉపయోగించబడుతుంది<ref name=":1" />.
 
ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత గ్రామాలకు పరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యాన్ని తీసుకురావాలనే ఆమె దృష్టికి అత్యధిక సంఖ్యలో ఆన్‌లైన్ ఓట్లను పోల్ చేయడం ద్వారా గూగుల్ గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్ ఇండియా అవార్డును గెలుచుకుంది<ref>{{Cite web|url=https://impactchallenge.withgoogle.com/india2013/charities/sana|title=Google.org Impact Challenge India 2013|website=Google.org Impact Challenge India 2013|language=en|access-date=2020-03-10}}</ref>. 3 కోట్ల రూపాయల అవార్డు డబ్బుతో ఆమె ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని 10 తీరప్రాంత గ్రామాల్లో తాగునీటి ప్లాంట్లు, బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేసింది. 2016 నాటికి 54 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించడం, 10 గ్రామాలలో 20 మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం ఆమె లక్ష్యం<ref name=":1">{{Cite web|url=http://www.theweekendleader.com/Heroism/1761/people-s-award.html|title=People's award|website=www.theweekendleader.com|language=en|access-date=2020-03-09}}</ref>.
 
== మన్ సాస్, సింహాచలం దేవస్థానం ట్రస్టుల చైర్మన్ ==
గజపతి వంశానికి చెందిన పి. వి. జి. రాజు 1958లో స్థాపించిన మన్ సాస్ ట్రస్టు, సింహాచలం ట్రస్టు వారసత్వంగా గజపతి వంశానికి చెందిన మగపిల్లలకు సంక్రమిస్తుంది. అతని మరణానంతరం అతని పెద్ద కుమారుడు [[పూసపాటి ఆనంద గజపతి రాజు|ఆనంద గజపతి రాజు]] ఈ రెండు బోర్డులకు చైర్మన్ గా నియమితుడాయ్యాడు. అతని మరణానంతరం అతని సోదరుడు [[తెలుగుదేశం పార్టీ]] నాయకుడు [[పూసపాటి అశోక్ గజపతి రాజు|అశోక్ గజపతి రాజు]] ఆ రెండు పదవులను స్వీకరించాడు. వేలాది ఎకరాల భూములు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న ఈ రెండు బోర్డులను అతను నిర్వహించేవాడు<ref>{{Cite web|url=https://telanganatoday.com/sanchaita-raju-new-simhachalam-temple-trust-chief|title=Sanchaita Raju new Simhachalam temple trust chief|last=AuthorTelanganaToday|website=Telangana Today|language=en-US|access-date=2020-03-10}}</ref>. అతని స్థానంలో సంచయిత గజపతి రాజుకు ఈ రెండు బోర్డులకు చైర్మన్ గా చేస్తూ [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ]] ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది<ref>{{Cite web|url=https://www.eenadu.net/districts/mainnews/visakhapatnam/11/220040846|title=సంచయిత సంచలనం|website=www.eenadu.net|language=te|access-date=2020-03-10}}</ref><ref>{{Cite web|url=https://telugu.samayam.com/andhra-pradesh/news/controversy-on-simhachalam-and-mansas-trust-issues-and-sanchaita-appointment/articleshow/74523434.cms|title=ఏపీలో 'సంచయిత' రాజకీయం.. జగన్ నిర్ణయం మరోసారి వివాదాస్పదం!|website=Samayam Telugu|language=te|access-date=2020-03-09}}</ref>. అయితే మాన్సాస్ ట్రస్ట్ పరిణామాలపై తెలుగుదేశం మాజీ పార్లమెంటు సభ్యుడు అశోక్ గజపతి రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. ఆమె హిందువు కాదని, క్రిస్టియన్ అంటూ, చీకటి జీవోలతో ఛైర్మన్ పదవి దక్కించుకుందంటూ ఆరోపణలు చేసాడు.<ref>{{Cite web|url=http://www.dharuvu.com/2020/03/07/tdp-ex-mp-ashok-gajapatiraju-cheap-politics-on-mansas-trust-chairman-appointment/|title=మాన్సాస్ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ నియామకంపై అశోక్ గజపతిరాజు ఆరోపణలు.. కంట తడిపెట్టిన సంచయిత…!|website=Dharuvu|language=en-US|access-date=2020-03-09}}</ref> తాను హిందువునని, తన మతం గురించి బాబాయ్ మాట్లాడితే బాధేస్తోందని సంచయిత చెప్పింది<ref>{{Cite web|url=https://telugu.oneindia.com/news/andhra-pradesh/mansas-trust-controversy-sanchaita-counter-to-ashok-gajapati-raju-264673.html|title=మాన్సాస్ ట్రస్ట్ వివాదం: అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలకు సంచయిత కౌంటర్|last=Srinivas|first=Dr Veena|date=2020-03-07|website=https://telugu.oneindia.com|language=te|access-date=2020-03-09}}</ref>.
 
==సింహాచల దేవస్థాన ధర్మకర్త పదవి, వివాదాలు, వ్యతిరేక ప్రచారాలు==
ఈమె పెంపుడు తండ్రితో దిగిన పలు క్రిష్టియన్ కార్యక్రమాలకు సంభందించినసంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి<ref>{{Cite web|url= http://www.10tv.in/check-out-aadhaar-card-ap-sanchita-gajapati-raju-ashok-gajapathi-raju-27668 </ref>.వీటి ఆధారంగా ఆమె హిందువు కాదని ఈ పదవిని ఆమెకు ఇవ్వరాదని కొందరు నెటిజన్లు వాదిస్తున్నారు<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/ashok-gajapathi-raju-tdp-2020030805042072</ref>.
 
సింహాచలం దేవ స్థానం అనువంశిక ధర్మకర్తల మండలి చైర్మన్ గాను, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గాను వైసీపీ ప్రభుత్వం నియమించిన ఆమెను పార్టీ నుంచి తొలగించాలని కోరుతూ అంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల మధుకర్ అధిష్టానానికి లేఖ రాసాడు. పార్టీ సూచనలు లేకుండా, పార్టీకి చెప్పకుండా, ఆమె ఆ పదవిలో చేరినట్లు ఆరోపించాడు. జనతా యువమోర్చా (బీజేవైఎం) నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా ఉన్న ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలని కోరాడు<ref>{{Cite web|url=https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/mar/07/bjp-issues-show-cause-notice-to-sanchaita-gajapati-raju-2113517.html|title=BJP issues show-cause notice to Sanchaita Gajapati Raju|website=The New Indian Express|access-date=2020-03-10}}</ref><ref>{{Cite web|url=https://www.amaravativoice.com/avnews/news/sanchayita-gajapati-bjp-shock|title=సంచయిత గజపతిరాజుకు షాక్ ఇచ్చిన బీజేపీ...|last=User|first=Super|website=www.amaravativoice.com|language=en-gb|access-date=2020-03-09}}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2893463" నుండి వెలికితీశారు