విశ్వదర్శనం - పాశ్చాత్య చింతన: కూర్పుల మధ్య తేడాలు

వాక్యాలను అటూ ఇటూ మార్చాను అర్థవంతమైన వివరం కోసం
ట్యాగు: 2017 source edit
చి →‎పూర్వరంగం: AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: నను గురించి → న గురించి , →
 
పంక్తి 8:
 
== పూర్వరంగం ==
విశ్వదర్శనం అనే పేరుతో రెండు పుస్తకాలు వచ్చాయి. మొదటి పుస్తకం పాశ్చాత్య తత్వ చింతన గురించి చర్చిస్తుంది. రెండవదైన ఈ పుస్తకం భారతీయ తత్వ చింతననుచింతన గురించి వివరిస్తుంది. ప్రపంచ దర్శన శాస్త్రాలను సంగ్రహంగా తెలుగు పాఠకులకు పరిచయం చేయడం ఈ రెండు పుస్తకాల ముఖ్యోద్దేశం. ఈ రెండు భాగాలు [[ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక]]లో 1980 - 1996 సంవత్సరాల మధ్య కాలంలో కొంత విరామాలతో ధారావాహికగా వెలువడ్డాయి. ఈ వ్యాసాలనే సంకలనం చేసి పుస్తకాలుగా విడుదల చేశారు. ఈ వ్యాసాలను రాయడానికి ప్రేరణ ఆంధ్రజ్యోతి వారపత్రిక మొదటి సంపాదకుడైన [[పురాణం సుబ్రహ్మణ్య శర్మ]] అని రచయిత ముందుమాటలో రాశాడు.<ref>{{Cite book|title=విశ్వదర్శనం భారతీయ చింతన|last=నండూరి|first=రామమోహనరావు|publisher=విక్టరీ పబ్లికేషన్సు|year=2015|isbn=|location=విజయవాడ|pages=7}}</ref> మొదటి భాగంగా విడుదలైన పాశ్చాత్య చింతన వ్యాసాలు పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలోనే వెలువడగా తర్వాతి సంపాదకులైన [[తోటకూర రఘు]] ఆధ్వర్యంలో రెండోభాగం (భారతీయ చింతన) వ్యాసాలు ప్రచురించబడ్డాయి.
 
రచయితకు ప్రాచ్య, పాశ్చాత్య దేశాలతో సంబంధం లేకుండా [[తత్వము|తత్వ శాస్త్ర]] అధ్యయనంపై ఆసక్తి ఉంది. 1950-51 సమయంలో ఈయన [[బెర్ట్రాండ్ రసెల్]] ఆంగ్లంలో రాసిన ''హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ'' పుస్తకం చదివి తెలుగులో అంతే సరళంగా పాశ్చాత్య తత్వ శాస్త్రాన్ని మాత్రమే కాక భారతీయ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకునే పుస్తకాలు ఉంటే బాగుంటుందని భావించి ఈ పుస్తక రచనకు పూనుకున్నాడు.<ref>{{Cite book|title=విశ్వదర్శనం పాశ్చాత్య చింతన|last=నండూరి|first=రామమోహనరావు|publisher=విక్టరీ పబ్లికేషన్స్|year=2003|isbn=|location=విజయవాడ|pages=4}}</ref> ఈ పుస్తకం మొదటగా 1988 ఆగస్టులో ప్రచురణ కాగా రెండవ ప్రచురణ 1996 డిసెంబరులోనూ, మూడవ ప్రచురణ 2003లో జరిగింది.