నాగోబా జాతర: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గిరిజన తెగలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రంకు → రానికి using AWB
చి clean up, replaced: వర్గం:అదిలాబాదు జిల్లా → వర్గం:ఆదిలాబాదు జిల్లా
పంక్తి 11:
వృత్తుల ఆధారంగా 17 శాఖలుగా చీలిన మోస్త్రం వంశస్థులలోని కటోడా దివాకర్ గాయికి, ఘాడియా సంకేపాయిలర్ వాడే శాఖల వారు కేస్లాపూర్ జాతరకు 16 రోజుల ముందు పుష్యమాస పౌర్ణమికి ఒక రోజు ముందు తమ కులదైవాన్ని పుష్య అమావాస్య రోజున అభిషేకించడానికి పవిత్ర గోదావరి జలం తేవడానికి కాలినడకన బయలుదేరి వెళతారు. ఇదే వంశంలోని మిగితా శాఖల వారు వారి వెంట వెళతారు. కాని మిగితా ఏడు శాఖల వారు క్రమం తప్పకుండా వెళ్లాలన్నది నియమం. పై ఏడు శాఖలు ముందుగా నాగోబా ఆలయం చేరుకుని కలశం తీసుకొని గోదావరి నదికి బయలుదేరుతారు. వారికి ముందుగా పరధాన తెగ, వాయిద్య గోండ్రు వాయిస్తూ ఉంటే వెనక నుంచి గిరిజనులు వెళుతుంటారు. కేస్లాపూర్‌కు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న కలమడుగు మండలం సమీపాన ఉన్న గోదావరి నదిలో అస్తమడుగు వరకు అరణ్యం గుండా నడచి వెళ్లి గోదావరి జలం కలశంతో తీసుకుంటారు. ఈ అస్తమడుగులో గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత ప్రత్యక్షమయి దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్ర జలంగా గిరిజనులు భావిస్తుంటారు.
 
పుష్యమాసంలో వచ్చే పౌర్ణమినాడు మేస్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న [[గోదావరి]] జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు. దీంతో జాతర ప్రారంభమైనట్టే. ఆ జలాన్ని తీసుకురావడానికి కెస్లాపూర్‌ నుంచి గోదావరి దాకా కాలినడకన 80 కిలోమీటర్లు వెళ్తారు. కెస్లాపూర్‌ చేరుకొని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల [[మర్రి చెట్టు]] కింద విడిదిచేసి అమావాస్యరోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తరువాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. 3 సంవత్స రాలకొకసారి పూజారిని మార్చడం ఆనవాయితీ.
 
===22 పొయ్యిలు మాత్రమే పెడతారు===
జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు (దుగుడు) ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయుల వంతుల వారిగా వంటలు చేసుకుంటారు. మిగితా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు.
 
=== సిరికుండలు ===
పంక్తి 38:
[[వర్గం:గిరిజనుల పండుగలు]]
[[వర్గం:జాతరలు]]
[[వర్గం:అదిలాబాదుఆదిలాబాదు జిల్లా]]
"https://te.wikipedia.org/wiki/నాగోబా_జాతర" నుండి వెలికితీశారు