తిక్కవరపు సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (3)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 38:
'''తిక్కవరపు సుబ్బరామిరెడ్డి''' ([[ఆంగ్లం]]: T. Subbarami Reddy) (జ. [[సెప్టెంబరు 17]], [[1943]]) [[భారత జాతీయ కాంగ్రెసు]]కు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త. వీరు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు. ఈయన గనుల శాఖామాత్యునిగా ఉన్నాడు. ఈయన 1996, 1998 సంవత్సరాలలో 11వ, 12వ [[లోక్‌సభ]] లకు [[విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం|విశాఖపట్నం]] నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. ఇతడు 2002 సంవత్సరం నుండి [[రాజ్యసభ]] సభ్యునిగా పనిచేస్తున్నాడు.
 
సుబ్బరామిరెడ్డి 1943, [[సెప్టెంబర్ 17]]న బాబు రెడ్డి, రుక్మిణమ్మ దంపతులకు [[నెల్లూరు]]లో జన్మించాడు.<ref>{{Cite web |url=http://164.100.47.5:8080/members/Website/Mainweb.asp?mpcode=1872 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-07-22 |archive-url=https://web.archive.org/web/20091018042839/http://164.100.47.5:8080/members/website/Mainweb.asp?mpcode=1872 |archive-date=2009-10-18 |url-status=dead }}</ref> [[హైదరాబాదు]] లోని [[నిజాం కళాశాల]] నుండి బి.కామ్ పట్టాపొందాడు. [[నాగార్జున సాగర్ ప్రాజెక్టు]] నిర్మాణంలో మట్టి ఆనకట్ట పనులకు కాంట్రక్టరుగా వ్యాపార జీవితాన్ని ప్రారంభించాడు, 1966 ఫిబ్రవరి 6న ఈయనకు ఇందిరా సుబ్బరామిరెడ్డితో వివాహమైనది.
==సినిమా నిర్మాణం==
ఇతడు తెలుగు, హిందీ, తమిళ, సంస్కృత భాషలలో కొన్ని సినిమాలను నిర్మించాడు. సంస్కృతంలో ఇతడు నిర్మించిన భగవద్గీత చలనచిత్రానికి ఉత్తమ చిత్రంగా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలనచిత్ర పురస్కారం]] లభించింది.