"పరమాణు సిద్ధాంతం" కూర్పుల మధ్య తేడాలు

కొద్దిగా విస్తరించాను. ఇంకా విస్తరించాల్సింది చాలా ఉంది.
చి (వర్గం:భౌతిక శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(కొద్దిగా విస్తరించాను. ఇంకా విస్తరించాల్సింది చాలా ఉంది.)
ట్యాగు: 2017 source edit
{{విస్తరణ}}
భౌతిక రసాయనిక శాస్త్రాల్లో '''అణు సిద్ధాంతం''' అంటే పదార్థం లక్షణాల్ని వివరించే ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని [[పదార్థము|పదార్థాలన్నీ]] విభజించడానికి వీలు లేని [[అణువు|అణువులు]] (Atoms) లేదా పరమాణువులతో కూడుకొని ఉంటాయి. ఇది పురాతన గ్రీసు దేశంలో [[తత్వము|తత్వ శాస్త్ర]] భావనగా మొదలై 19 వ శతాబ్దం మొదట్లో శాస్త్రీయ పరిశోధనల్లోకి వచ్చింది.<ref>{{Cite book|title=అణువుల శక్తి|last=రోహిణీ ప్రసాద్|first=కొడవటిగంటి|publisher=హైదరాబాద్ బుక్ ట్రస్ట్|year=2012|isbn=|location=హైదరాబాద్|pages=13}}</ref>
 
అణువుకు సమానార్థమైన ఆంగ్లపదం ''ఆటం'' (Atom) ప్రాచీన గ్రీకు పదం ''అటామస్'' అనే పదం నుంచి వచ్చింది. ఈ పదానికి అర్థం విభజించడానికి వీలు లేనిది అని అర్థం.<ref name="SEP">Berryman, Sylvia, "Ancient Atomism", ''[[Stanford Encyclopedia of Philosophy]]'' (Fall 2008 Edition), Edward N. Zalta (ed.) [http://plato.stanford.edu/archives/fall2008/entries/atomism-ancient/]</ref> 19వ శతాబ్దానికి చెందిన రసాయనిక శాస్త్రవేత్తలు కొన్ని పదార్థాలు ఇక విడగొట్టలేనంత సూక్ష్మంగా ఉన్నవాటిని ఈ పేరుతో పిలవడం ప్రారంభించారు. 20 వ శతాబ్దం మొదలయ్యే నాటికి [[విద్యుదయస్కాంతత్వం]], [[రేడియో ధార్మికత]] మొదలైన వాటిమీద పరిశోధనలు చేస్తూ అసలు విభజించడానికి వీలులేని అణువులు ఉంటాయని కనుగొన్నారు. కానీ వీటిలో కూడా ఎలక్ట్రాన్లు, న్యూట్రానులు, ప్రోటానులు అనే కణాలు కలగలిసిపోయి ఉంటాయని కూడా నిరూపించారు. ఇంకా చెప్పాలంటే అత్యధిక ఉష్టోగ్రత మరియు అత్యధిక పీడనం ఉన్న కొన్ని విపరీత పరిస్థితుల్లో (''న్యూట్రాన్ స్టార్స్'') అసలు అణువులుగా ఉండే అవకాశమే లేదని కూడా కనుగొన్నారు.
 
అణువులను కూడా విభజించగలమని తేలడంతో భౌతిక శాస్త్రవేత్తలు అణువులో ఉన్న విడగొట్టడానికి వీలుకాని కణాలను ప్రాథమిక కణాలు (elementary particles) అని పిలిచారు. ఈ కణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని [[కణ భౌతికశాస్త్రం]] అని వ్యవహరిస్తారు. ఈ విభాగంలో భాగంగా శాస్త్రజ్ఞులు అసలు పదార్థం యొక్క తత్వాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2896430" నుండి వెలికితీశారు