డి.వి.నరసరాజు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 41:
[[1920]] జూలై 15న [[గుంటూరు జిల్లా]], [[సత్తెనపల్లి]] మండలంలోని [[తాళ్లూరు]]లో జన్మించాడు.<ref>[http://www.hindu.com/2006/08/29/stories/2006082910990400.htm Film writer D.V. Narasa Raju dead - The Hindu Aug 29, 2006]</ref> ఇతను [[హేతువాది]]. [[నరసరావుపేట]] వాస్తవ్యుడు అయిన [[ఎం.ఎన్.రాయ్]] అనుచరుడు. సినీ కథా రచయిత.[[ఈనాడు పత్రిక]]లో కొంతకాలం పనిచేశాడు. డి.వి.నరసరాజు సినీ [[కథ]], [[సంభాషణల]] రచయితగా సుప్రసిద్ధులు. ఆయన రచించిన సినిమాలలో [[హాస్యరసం]] తొణికిసలాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించింది. ఆయన మౌలికంగా నాటక రంగం నుంచి సినిమాలలోకి వచ్చారు.
 
నరసరాజు [[గుంటూరు]]లోని హిందూ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, [[హిందూ కళాశాల]]లో ఇంటర్ తర్వాత [[మద్రాసు]] [[లయోలా కళాశాల]] నుండి [[బి.ఏ]] పూర్తి చేశాడు. సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా పేరుతెచ్చుకున్నాడు.<ref>[http://vskesavarao.files.wordpress.com/2013/03/narsaraju.jpg?w=640&h=1022 రసరాజు నరసరాజు - ఆదివారం ఆంధ్రభూమి 17 మార్చి 2013]</ref> ''ఈ ఇల్లు అమ్మబడును'', ''వాపసు'' నాటకం రాశాడు.<ref name="అటకెక్కుతున్న నాటక రచన">{{cite news |last1=ఆంధ్రభూమి |first1=సాహితి |title=అటకెక్కుతున్న నాటక రచన |url=http://andhrabhoomi.net/content/sahiti-232 |accessdate=27 March 2020 |work=andhrabhoomi.net |publisher=బి.నర్సన్ |date=3 October 2016 |archiveurl=httphttps://web.archive.org/web/20200327170044/http://andhrabhoomi.net/content/sahiti-232 |archivedate=27 Marchమార్చి 2020 |url-status=live }}</ref>
నరసరాజు [[1954]]లో [[పెద్దమనుషులు]] సినిమాతో రచయితగా సినీరంగప్రవేశం చేశాడు. ఆ సినిమా విజయవంతమవడంతో సినీ రచయితగా స్థిరపడ్డాడు. [[1951]]లో[[పాతాళభైరవి]] సినిమా వందరోజుల ఉత్సవం సందర్భంగా ప్రదర్శించబడిన నరసరాజు నాటకం "నాటకం" చూసి దర్శకుడు [[కె.వి.రెడ్డి]] ఈయన్ను సినిమా రంగానికి పరిచయం చేశాడు.<ref>[http://www.andhranatakam.com/Gadyanatakams.html Natakam at Andhra Natakam.]</ref> [[గుండమ్మ కథ]], [[భక్త ప్రహ్లాద]], [[యమగోల]], రంగులరాట్నం, మనసు మమత, [[దొంగరాముడు]] వంటి 92కు పైగా సినిమాలకు కథను, మాటలను సమకూర్చాడు. ఈయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో కారు దిద్దిన కాపురం ఒకటి. [[చెవిలో పువ్వు]] చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా పోషించాడు. ఈయన చివరి సినిమా, రాజ, భూమిక ప్రధానపాత్రధారులుగా 2006లో విడుదలైన [[మాయాబజార్]].
"https://te.wikipedia.org/wiki/డి.వి.నరసరాజు" నుండి వెలికితీశారు