మధుమేహం: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 94:
* మానసిక ఆందోళన, భారీ కాయం, అహారపు అలవాట్లు.
* ముందుగా తిన్నది జీర్ణంకాకముందే తిరిగి భుజించడం.ఆకలి లేకున్నా ఆహారం తీసుకోవడం.అతిగా ఆహారం తీసుకోవడం.
== మధుమేహం కరోనా ==
 
కరోనా ఇన్‌ఫెక్షన్‌ (కొవిడ్‌-19) మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, దీర్ఘకాల శ్వాసకోశ సమస్యలు గలవారికి పెను శాపంగా మారుతోంది. ఇప్పటివరకు మరణించినవారిలో 16-22% మంది మధుమేహులే. భారతదేశం కరోనాతో మరణించినవారిలో మధుమేహుల సంఖ్యే ఎక్కువ. మరో ముఖ్య విషయం- మధుమేహం గలవారికి వయసుతో సంబంధం లేకుండా కరోనా ప్రమాదంగా మారే అవకాశముండటం. భారతదేశంలో 7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా.
 
వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటివి ఒంట్లోకి ప్రవేశించాయని గుర్తించగానే రోగనిరోధక వ్యవస్థలో భాగమైన తెల్ల రక్తకణాలు, యాంటీబాడీలు చుట్టూ చేరిపోతాయి. వాటిని ఒంట్లోంచి బయటకు పంపించటానికి ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో తుమ్ములు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు బయలుదేరతాయి. ఒకరకంగా ఇవన్నీ క్రిముల నుంచి శరీరాన్ని కాపాడే ప్రయత్నాలే. ఇలాంటి రక్షణ వ్యవస్థలన్నీ మధుమేహుల్లో మందగిస్తుండటమే ప్రమాదం ఎక్కువ కావటానికి దారితీస్తోంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు ఎక్కువగా ఉంటున్నా, దీర్ఘకాలం నుంచి బాధపడుతూ గ్లూకోజు స్థాయులు మామూలుగానే ఉన్నా వీరిలో రోగనిరోధక వ్యవస్థ గాడితప్పొచ్ఛు ముఖ్యంగా తెల్ల రక్తకణాల కదలికలు తగ్గుతాయి. దీంతో క్రిములున్న చోటుకు అంత వేగంగా వెళ్లవు. క్రిములను నిర్మూలించే రసాయనాలను విడుదల చేయలేవు. ఒకవేళ విడుదల చేసినా అవి అంత సమర్థంగా పనిచెయ్యవు. మరోవైపు యాంటీబాడీలూ వెంటనే తయారుకావు. మధుమేహుల్లో రక్త ప్రసరణ దెబ్బతినటం, రక్తంలో గ్లూకోజుతో కూడిన (గ్లైకేటెడ్‌) హిమోగ్లోబిన్‌ ఉండటం మరో సమస్య. ఇది 7% కన్నా ఎక్కువగా ఉంటే ఆక్సిజన్‌ పంపిణీ వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్‌ మార్పిడి సరిగా జరగదు. మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల్లోకి, అక్కడ్నుంచి శరీరంలోని ఇతర భాగాలకు చేరవేసే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. కరోనా ప్రభావం ప్రధానంగా ఊపిరితిత్తుల దిగువ భాగంలోనే ఉంటోంది కదా. మధుమేహుల్లో ఆర్‌ఎన్‌ఏ సైతం సరిగా పనిచేయదు. దీంతో ప్రొటీన్లు విచ్ఛిన్నమై అమైనో ఆమ్లాలుగా, అవి తిరిగి ప్రొటీన్లుగా మారే ప్రక్రియ దెబ్బతింటుంది. ఇదీ రోగనిరోధక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. స్వయం చాలిత నాడీ వ్యవస్థ దెబ్బతినటం వల్ల దగ్గు, తుమ్ములు, జ్వరం వంటి రక్షణ వ్యవస్థలూ పనిచేయవు. అందువల్ల లక్షణాలేవీ పైకి కనిపించకుండానే లోపల్లోపల సమస్య తీవ్రమవుతూ వస్తుంటుంది. ఇవన్నీ మధుమేహులకు కొవిడ్‌-19 పెను శాపంగా మారేలా చేస్తున్నాయి.
 
== మానుకోవలసిన అలవాట్లు ==
"https://te.wikipedia.org/wiki/మధుమేహం" నుండి వెలికితీశారు