తెలుగు శాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
తరువాత అమరావతిలోని నాగబు అనే పదము (క్రీ.శ. 1వ శతాబ్ది), విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ [[సంస్కృత]] శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" (క్రీ.శ. 6వ శతాబ్ది) మనకు కనిపిస్తున్న మొదటి [[తెలుగు]] పదాలు. [[నాగార్జునకొండ]] వ్రాతలలో కూడా తెలుగు పదాలు కనిపిస్తాయి. ఇవన్నీ ప్రాకృత శాసనాలు లేదా సంస్కృత శాసనాలు. కనుక తెనుగు అప్పటికి జనసామాన్యంలో ధారాళమైన భాషగా ఉన్నదనడానికి ఆధారాలు లేవు. ఆరవ శతాబ్ది తరువాత బ్రాహ్మీలిపినే కొద్ది మార్పులతో తెలుగువారు, కన్నడంవారు వాడుకొన్నారు. అందుచేత దీనిని "తెలుగు-కన్నడ లిపి" అని పరిశోధకులు అంటారు.<ref name="parabrahma"/>
== అనేక ఆధారాలు ==
 
6,7 శతాబ్దాలలో పల్లవ చాళుక్య సంఘర్షణల నేపథ్యంలో రాయలసీమ ప్రాంతం రాజకీయంగా చైతన్యవంతమయ్యింది. ఈ దశలో [[రేనాటి చోడులు]] సప్తసహస్ర గ్రామ సమన్వితమైన రేనాడు (కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు) పాలించారు. తెలుగు భాష పరిణామంలో ఇది ఒక ముఖ్యఘట్టం.<ref name="bsl">ఆంధ్రుల చరిత్ర - రచన: ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2003)</ref> వారి శాసనాలు చాలావరకు తెలుగులో ఉన్నాయి. వాటిలో [[ధనంజయుని కలమళ్ళ శాసనం]] (వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా) మనకు లభిస్తున్న మొదటి పూర్తి తెలుగు శాసనంగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది క్రీ.శ. 575 కాలందని అంచనా. అంతకుముందు శాసనాలలో చెదురు మదురుగా తెలుగు పదాలున్నాయి గాని సంపూర్ణమైన వాక్యాలు లేవు.<ref name="parabrahma"/>
"https://te.wikipedia.org/wiki/తెలుగు_శాసనాలు" నుండి వెలికితీశారు