వేంగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==చరిత్రలో వివిధ దశలు==
పూర్వ కాలంలో కాలి నడక మార్గాలు, ఓడ రేవులు జనుల ప్రయాణాలకు, వివిధ సంస్కృతుల మేళనానికి ముఖ్యమైన వేదికలు. యాత్రికులు, పండితులు, వ్యాపారులు, కళాకారులు ఈ మార్గాలలో ప్రయాణిస్తూ భిన్న సంప్రదాయాల ఏకీకరణకు కారకులయ్యారు. వీటివల్లనే చరిత్రలో అధిక భాగం అనేక రాజ్యాలుగా ఉన్నా గాని భారతదేశం అనే బలమైన భావన అంకురించడం సాధ్యమయ్యింది. ఆంధ్ర తీరంలో (శాతవాహనుల కాలం నుండి) ఎన్నో ఓడరేవులుండేవి[[ఓడ]] రేవులు ఉండేవి. వీటి ద్వారా దేశ, విదేశ వాణిజ్యం జరిగేది. ఈ మార్గాలలో ఆంధ్ర దేశం ముఖ్యమైన కూడలిగా ఉండేది. ఐదు ప్రధాన మార్గాలు "వేంగి" అనే చోట కలిసేవి. అందువల్లనే ఆంధ్ర రాజ్యమంటే వేంగి రాజ్యమని కూడా ఒకోమారు ప్రస్తావించబడేది. వీటిలో [[ఈశాన్యం|పూర్వోత్తర]] మార్గం కళింగ రాజ్యాలకు వెళ్ళేది. [[దక్షిణం|దక్షిణ]] మార్గం ద్రవిడ ప్రాంతాలకు, [[నైఋతి]] మార్గం [[కర్ణాటక]] దిశలోను, [[ఉత్తరం|ఉత్తర]] మార్గం కోసల దేశానికి, [[వాయువ్యం|పశ్చిమోత్తర]] మార్గం [[మహారాష్ట్ర]] ప్రాంతానికి దారి తీసేది. ఇవి ప్రధానంగా బౌద్ధ భిక్షువులు ప్రయాణించి బుద్ధుడుపదేశించిన[[బుద్ధుడు]] ఉపదేశించిన సందేశాన్ని వినిపించిన మార్గాలు. ఇప్పుడు బయల్పడిన ప్రధాన బౌద్ధారామ శిధిలాలు దాదాపు అన్నీ ఈ మార్గాలలో ఉన్నాయి. (నాగర్జున[[నాగార్జున కొండ]], [[అమరావతి]] లేదా [[ధరణికోట]], ఘంటసాల వంటివి). వీటిలో కొన్ని అశోకునికంటే[[అశోకుడు|అశోకుని]] కంటే ముందు కాలానివి.<ref>http://www.indiaprofile.com/religion-culture/buddhisminandhra.htm ఇది ఒక టూరిజమ్ వెబ్ సైటులో ఉన్నది. వారు ఈ విషయానికి ఆధారాలు తెలుపలేదు.</ref>
 
 
[[చిలుకూరు వీరభద్రరావు]], [[కొమర్రాజు వేంకటలక్ష్మణరావు]], డి.సి.సర్కార్, Dr.Hultzsch, Dr.Fleet, Col.Todd, [[మల్లంపల్లి సోమశేఖర శర్మ]], డా.గోపాలాచారి వంటి ప్రముఖ చరిత్రకారులు వేంగి రాజ్యం చరిత్రను అధ్యయనం చేశారు. [[కొల్లేరు]], [[దెందులూరు]], [[ఏలూరు]] శాసనాలు వేంగి చరిత్ర ప్రాంభ దశను అధ్యయనం చేయడానికి ప్రధాన ఆధారాలు. అయితే వీటిలో ప్రస్తావించిన "వేంగి" అనేది రాజ్యం పేరో, లేక నగరం పేరో స్పష్టంగా తెలియడంలేదు. <ref name="Gopalachari">Early_History_Of_The_Andhra_Country by K. Gopalachari, published by University_Of_Madras, (Research work in 1941)</ref>.
 
పంక్తి 23:
 
* బృహత్పలాయనులు - ఇక్ష్వాకుల తరువాతి కాలం (క్రీ.శ.300) - వేంగినగరం లేదా ఏలూరు లేదా దెందులూరు వారి రాజధాని కావచ్చును.
* శాలంకాయనులు - క్రీ.శ. 300 - 420 మధ్యకాలం - వేంగినగరం వారి రాజధాని. వీరిలో హస్తివర్మ సముద్రగుప్తుని సమకాలికుడు.1వ మహేంద్రవర్మ అశ్వమేధయాగం చేశాడని అంటారు. శాలంకాయనులు పాటించిన చిత్రరధస్వామి ([[సూర్యుడు]]) భక్తికి చెందిన ఆలయము యొక్క శిధిలాలు పెదవేగిలో బయల్పడ్డాయి.<ref>D. R. Bhandarkar Volume By Devadatta Ramakrishna Bhandarkar, Bimala Churn Law పేజీ.216 [http://books.google.com/books?id=TGMrAAAAMAAJ&q=pedavegi&dq=pedavegi&ie=ISO-8859-1&pgis=1]</ref><ref>Sculptural Heritage of Andhradesa By Mohan Lal Nigam పేజీ.35 [http://books.google.com/books?id=Qd41AAAAIAAJ&q=pedavegi&dq=pedavegi&ie=ISO-8859-1&pgis=1]</ref>
 
* విష్ణుకుండినులు - క్రీ.శ. 375 - 555 - వీరి రాజధాని "శ్రీపర్వత ప్రాంతం"లో ఉండేది. తరువాత వేంగి సమీపంలోని "దెందులూరు"
* పల్లవులు - క్రీ.శ. 440 - 616 - వీరి రాజధాని వినుకొండ. వీరి రాజ్యంలో వేంగి కూడా ఒక ముఖ్య నగరం.
* తూర్పు చాళుక్యులు - క్రీ.శ. 616 నుండి 1160 వరకు. పల్లవులనుండి వేంగి నగరాన్ని జయించి కుబ్జవిష్ణువర్ధనుడు (బాదామిలోని తన అన్న అనుమతితో స్వతంత్ర రాజ్యంగా) రాజ్యాన్ని స్థాపించాడు. తూర్పు చాళుక్యుల కాలం తెలుగుభాష[[తెలుగు]] భాష పరిణామంలో ముఖ్య సమయం. వీరు తెలుగును అధికార భాషగా స్వీకరించి దాని ప్రగతికి పునాదులు వేశారు. వేంగి రాజ్యంలో రాజమహేంద్రవరం ఒక మణిగా వర్ణించబడింది. క్రమంగా (కొన్ని యుద్ధాలలో వేంగి ప్రాంతాన్ని కోల్పోవడం వలన) తూర్పు చాళుక్యుల చివరి రాజులు తమ రాజధానిని రాజమహేంద్రవరానికి మార్చారు.
 
==శిధిలావశేషాలు==
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు