వెల్మజాల: కూర్పుల మధ్య తేడాలు

చి జిల్లా మారినందున లంకె సవరించాను
చి clean up, replaced: గ్రామము → గ్రామం, మండలము → మండలం, typos fixed: → , , → , (2)
పంక్తి 1:
'''వెల్మజాల''', [[తెలంగాణ]] రాష్ట్రం,[[యాదాద్రి - భువనగిరి జిల్లా]] , [[గుండాల మండలం (యాదాద్రి-భువనగిరి జిల్లా)|గుండాల]] మండలంలోని గ్రామం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>{{Infobox Settlement/sandbox|
‎|name = వెల్మజాల
|native_name =
పంక్తి 91:
|footnotes =
}}
ఇది మండల కేంద్రమైన గుండాల నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[జనగామ జిల్లా|జనగామ]] నుండి 21 కి. మీ. దూరంలోనూ ఉంది.ఈ గ్రామముగ్రామం మండలములోనేమండలంలోనే అతిపెద్ద గ్రామం
 
== గణాంకలు ==
పంక్తి 101:
నల్లగొండజిల్లా [[గుండాల (జనగామ)|గుండాలమండలంలోని]] వెల్మజాల ఒకప్పటి జైనబసదులగ్రామం. రాష్ట్రకూటుల పాలనలో వున్న గొప్పనగరం. ప్రస్తుత గ్రామానికి ఈశాన్యానవున్న పాటిగడ్డలో జైనబసదులు, ఒక ఆలయపు పునాదులు కనిపిస్తున్నాయి. నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణశిథిలాలు కనిపిస్తున్నాయి. ఇటుకలు, కుండపెంకులు, పునాది రాళ్ళు, గోడలఆనవాళ్ళు పాటిగడ్డ అంతటా అగుపిస్తున్నాయి. ఇక్కడే రాష్ట్రకూటుల రెండవ శాసనం లభించింది. మొదటిశాసనం అమ్మదేవత పోచమ్మ (దుర్గగుడి) ముందు దొరికింది. అక్కడే జైననిశీధులు (జైనపాదాలు) ఉన్నాయి. అందులో వెల్మజాలలోని జైనబసదికి అకాలవర్షుడు, రెండవ కృష్ణునికాలంలో క్రీ.శ.907 ఏప్రిల్ 1న రాజోద్యోగి రావిచంద్రయ్య చేసిన 100 మర్తురుల భూమి, ఒకతోట దానవివరాలున్నాయి. ఇదే నల్గొండజిల్లా శాసనసంపుటిలో తొలిశాసనం. రెండవశాసనాన్ని ఇంకా పరిష్కరించ లేదు కానీ లిపినిబట్టి ఇది 10వ శతాబ్దానిదని చెప్పవచ్చు. అదికూడా రాష్ట్రకూటులదే. అందులో జినాలయ ప్రస్తావన ఉంది. కనుక ఇది కూడా జైనబసదికి ఎవరో చేసిన దానశాసనమైవుంటుంది. దీన్నిబట్టి ఈవూరు సుదీర్ఘకాలం రాష్ట్రకూటులపాలనలో వున్నదని చెప్పడానికి వీలవుతుంది. వూరికి వాయవ్యాన ఆరడుగులఎత్తున్న ఒక శిథిల[[శివాలయం]] ఉంది. అది చిన్నరాతిబోడుమీద ఉంది. చతురస్రాకారపు పానవట్టంమీద చిన్నలింగం ఉంది. దేవాలయద్వారానికి రెండువైపుల శైవద్వారపాలకుల శిల్పాలున్నాయి. గుడిముందర ఒక వీరగల్లుంది. వీరనారి బాణం సంధించి, విల్లెక్కుపెట్టి ఉంది. చక్కని శిల్పం మరొక వీరగల్లు మొదటిశాసనమున్న [[పోచమ్మ]]గుడి ముందర ఉంది. ఇది ఆత్మాహుతి చేసుకుంటున్న భక్తుని వీరగల్లు. వీటిని చంపుడుగుళ్ళు అని చరిత్రకారులు అంటారు. చెరువులో విరిగిన నల్లరాతివిగ్రహం ఉంది. దానికి తలలేదు. ఆసనస్థితిలో వున్న ఈ శిల్పం దండరెట్టలకు నాగాభరణాలున్నాయి. బహుశః ఈ విగ్రహం [[శైవశిల్పం]] కావచ్చుననిపిస్తున్నది.ఈ గ్రామంలో నన్నయ కాలం కంటే 100 సంవత్సరాల పూర్వపు శాసనం బయటపడింది.
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి [[గుండాల|గుండాలలో]] ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల జనగామలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నార్కట్ పల్లిలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు జనగామలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం జనగామలోను, వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు [[నల్గొండ]] లోనూ ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
పంక్తి 120:
వెల్మజాలలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
 
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
 
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/వెల్మజాల" నుండి వెలికితీశారు