ముకురాల రామారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 80:
'''ముకురాల రామారెడ్డి''' మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. [[1976]]లో ఆకాశవాణి, ఢిల్లీ వారిచే 'జాతీయకవి 'గా గుర్తింపబడి, సన్మానం అందుకున్నాడు. పద్యాలు, కవితలు, పాటలు, కథలు వ్యాసాలు వంటి అనేక సాహిత్య ప్రక్రియలలో తనదైన ముద్రవేసిన సాహితీపరుడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[పాలమూరు జిల్లా]], [[కల్వకుర్తి]] మండలం [[ముకురల్|ముకురాల]] గ్రామంలో [[1929]] [[జనవరి 1]]వ తేదీన మంద రామలక్ష్ముమ్మ, బాలకృష్ణారెడ్డి దంపతులకు జన్మించాడు<ref name="జిల్లా సాహిత్య చరిత్ర">{{cite book |last1=గుడిపల్లి నిరంజన్ |title=నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్యచరిత్ర |date=మే 2019 |publisher=తెలంగాణ సాహిత్య అకాడమీ |location=హైదరాబాదు |pages=48-49 |edition=1 |url=http://tsa.telangana.gov.in/nagarkurnool-jilla-sahitya-charithra/ |accessdate=29 March 2020}}</ref>.గంగాపురం హనుమచ్చర్మ ఇతని గురువు. గ్రామంలోని కానిగి పాఠశాలలో ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. క్రమక్రమంగా పరీక్షలు ప్రైవేటుగా రాస్తూ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్రలో, తెలుగులో ఎం.ఏ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై, పి.హెచ్‌.డి. చేసి డాక్టరేటు పొందాడు. ప్రాథమిక పాఠశాలలో ఎలిమెంటరీ ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా, డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకునిగా, తెలుగు అకాడమిలో ఉప సంచాలకునిగా 17 సం||ల సుదీర్ఘకాలం పదవీ బాధ్యతలు ఆదర్శప్రాయంగా నిర్వహించి పదవీ విరమణ చేశాడు. 1947-48లో నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు. గ్రంథాలయోద్యంలో కూడా పాల్గొన్నాడు. తెలుగులో ప్రాచీన కవుల సృజనాత్మక ప్రతిభ అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందాడు. తెలుగు అకాడెమీ ఉపసంచాలకులుగా పనిచేశాడు. దుందుభి అనే మాసపత్రికకు సంపాదకత్వం వహించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, తెలంగాణా రచయితల సంఘం, విజ్ఞానవర్ధని పరిషత్ మొదలైన సంస్థలలో చురుకుగా పాల్గొన్నాడు.ఇతడు [[2003]], [[ఫిబ్రవరి 24]]న [[కల్వకుర్తి]]లోని స్వగృహంలో అనారోగ్యంతో మరణించాడు. ఇతనికి భార్య ఈశ్వరమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు<ref name="తెలంగాణ">{{cite journal |last1=జి.యాదగిరి |title=‘ఆత్మ విశ్వాస ప్రతీక కవి ముకురాల’ |journal=తెలంగాణ మాసపత్రిక |date=6 October 2017 |url=http://magazine.telangana.gov.in/%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%80%E0%B0%95-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%AE/ |accessdate=29 March 2020}}</ref>.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ముకురాల_రామారెడ్డి" నుండి వెలికితీశారు