శ్రీనివాస మంగాపురం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: భాషాదోషాల సవరణ, typos fixed: బాగ → బాగా using AWB
చి clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ హిందూ దేవాలయాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు
పంక్తి 1:
[[బొమ్మ:Sreenivasa mangapuram temple.jpg|thumb|right|కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం]]
'''[[శ్రీనివాస మంగాపురం]]''' [[తిరుపతి]]కి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి [[నారాయణవనం]]లో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు [[పద్మావతి]] అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు.
 
[[శ్రీనివాస మంగాపురం]] [[తిరుపతి]], [[మదనపల్లి]] రోడ్డులో [[తిరుపతి]]కి దగ్గరలో ఉంది. గతంలో ఈ [[ఆలయం]] పురావస్తు శాఖ వారి ఆదీనంలో వుండి నిత్య పూజా కార్యక్రమాలకు దూరంగా వుండేది. పురావస్థు శాఖ వారి బోర్డు ఈ నాటికి ఆలయ ప్రాంగణంలో చూడ వచ్చు. ఆ తర్వాత సకల పూజా కార్యక్రమాలు జరుగు తున్నవి. ఇక్కడి [[శ్రీ వేంకటేశ్వరుడు|శ్రీ వేంకటేశ్వరు]]<nowiki/>ని ఆలయం చాల పెద్దది. విశాల మైనది. ఇక్కడి శ్రీ వారి ప్రధాన మూర్తి తిరుమలలో వున్న దాని కంటే పెద్దది. తిరుమలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసు కోవచ్చు.
 
గతంలో మంగాపురంలో రైల్వే స్టేషను కూడా వుండేది. [[భక్తులు]] ఇక్కడ దిగి ముందు స్వామివారిని దర్శించుకొని తిరుమలకు వెళ్లేవారు. శ్రీ వారి మెట్టు ఇక్కడికి దగ్గరే. అక్కడి నుండే [[తిరుమల]] కొండ పైకి మెట్లదారి ఉంది. ఇది చాల దగ్గిర దారి. తిరుపతి అలిపిరి నుండే వుండే మెట్ల దారి కంటే ఇది చాల దగ్గర. సుమారు ఒక గంట లోపలే తిరుమల కొండ పైకి చేరవచ్చు. చాల మంది ఇక్కడి నుండి తిరుమల కొండపైకి ఎక్కి స్వామి వారిని దర్శించుకొని ఆతర్వాత తిరుపతి వైపు మెట్ల దారి గుండ కిందికి దిగేవారు. కాని [[అలిపిరి]] వద్ద నున్న మెట్లదారి గుండా పైకి ఎక్కి నూరు మెట్ల దారి గుండా దిగే వారు ఎవరు ఉండరు. తిరుపతి చూడ నవసరం లేదనుకొనే వారు మాత్రం గతంలో ఈ దారినే ఎక్కువగా వాడే వారు. అప్పట్లో శ్రీనివాస మంగాపురం శ్రీనివాసుని దర్శించుకునే భక్తులు చాల తక్కువ. ఇక్కడ భక్తుల రద్దీ తిరుమలతో పోలిస్తే చాల తక్కువ గాన తనివి తీర శ్రీనివాసుని దర్శించు కోవచ్చు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది.
పంక్తి 36:
[[వర్గం:పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా దర్శనీయ స్థలాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ హిందూఆంధ్రప్రదేశ్ దేవాలయాలు]]
"https://te.wikipedia.org/wiki/శ్రీనివాస_మంగాపురం" నుండి వెలికితీశారు