కేసరావళి: కూర్పుల మధ్య తేడాలు

అధనపు సమాచారం
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''కేసరావళి ''' ని [[పుష్పం]] లోని పునరుత్పత్తి భాగాలలో పురుష ప్రత్యుత్పత్తి భాగాలుగా పరిగణిస్తారు. కేసరాల సముహాన్ని కేసరావళి అంటారు. ఈ సమూహంలో కేసరాలు అనేక విధాలుగా అమరి ఉంటాయి. వాటి ఎత్తులోను వైవిధ్యాన్ని కనబరుస్తాయి. ఒక కేసరావళిలో నాలుగు కేసరాలు ఉండి, వాటిలో రెండు కేసరాలు పొడువుగను, రెండు కేసరాలు పొట్టిగాను ఉంటాయి. ఇట్లాంటి అమరికను 'ద్విదీర్ఘ కేసరావళి ' అని అంటారు. ఒక కేసరావళి సమూహంలో ఆరు కేసరాలు ఉండి, వాటిలో నాలుగు పొడువుగానూ, రెండు పొట్టిగానూ ఉంటే దానిని 'చతుర్దీర్ఘ కేసరావళి ' అని పిలుస్తారు.
కేసరావళిలో రకరకాల సంసంజనాన్ని చూడవచ్చు. ఈ సంసంజనం కేసరదండాలకు పరిమితమైతే దానిని బంధకం(Adalphy) అంటారు. ఏర్పడిన కేసరపుంజాల సంఖ్యను అనుసరించి వాటిని ఏకబంధక కేసరావళి (ఉదా: [[మందార]])గా, ద్విబంధక కేసరావళి (ఉదా: [[చిక్కుడు]]) గా, బహుబంధక కేసరావళి (ఉదా: [[బూరూగ]]) గానూ వ్యవహరిస్తారు. కొన్ని వర్గాలలో కేసరాలు ఆకర్షణ పత్రావళితో అసంజనమవుతాయి. దీనిని మకుటదళోపరిస్థిత కేసరావళి అని పిలుస్తారు. కేసరావళి [[అండకోశం]]తో సంయుక్తమైతే దానిని స్త్రీపురుషాంగయుతమైన కేసరావళిగా వ్యవహరిస్తారు. కేసరావళిలో పరాగకోశాలు మాత్రమే సంసంజనాన్ని చూపి, కేసరదండాలు విడివిడిగా ఉంటే దానిని పరాగకోశ సంయుక్త కేసరావళి (Syngensious) అని; కేసరదండాలు, పరాగకోశాలు పూర్తిగా సంయుక్తమైతే ఆ స్థితిని సంయుక్త కేసరావళి అని పిలుస్తారు.
[[File:Mature flower diagram-te.svg|thumb|left|400 px|కేసరంలోని భాగాలు]]
 
== కేసరం ==
[[File:Mature flower diagram-te.svg|thumb|400 px|కేసరంలోని భాగాలు|alt=]]కేసరము కేసరావళిలో ఒక భాగం. [[పుష్పము]]లో ఉండే పురుష భాగము. ఇది పుప్పొడి ఉత్పత్తి చేసే పుష్పం యొక్క పునరుత్పత్తి అంగం. కేసరమును ఆంగ్లంలో స్టామెన్ (stamen) అంటారు, స్టామెన్ పదం [[లాటిన్]] నుండి వచ్చింది, దీని అర్థం నిలువుపోగు దారం. ప్రతి కేసరం ప్రధానంగా మూడు భాగాలు కలిగి ఉంటుంది. 1. కేసరదండం, 2. పరాగకోశం, 3. సంయోజకం.
=== కేసరదండం ===
కేసరాలలో ఇది కాడ (filament) వంటి నిర్మాణం. ఇది పరాగకోశానికి వృంతం వలె పని చేస్తుంది. కొన్ని కేసరాలలో ఈ కేసరదండాలు పొడువుగాను, మరికొన్నిటిలో పొట్టిగానూ ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/కేసరావళి" నుండి వెలికితీశారు