చైనాలో కరోనావైరస్ మహమ్మారి 2019-2020: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం ప్రారంభం
(తేడా లేదు)

14:56, 30 మార్చి 2020 నాటి కూర్పు

కరోనా వైరస్ మొట్టమొదట చైనా లోని హుబై ప్రావిన్స్ యొక్క రాజధాని అయిన వూహాన్ పట్టణంలో అంతుచిక్కని సామూహిక న్యుమోనియాగా నమోదు అయ్యింది. 27 డిసెంబరు 2019 న వూహాన్ కు చెందిన ఆసుపత్రి ఒకటి స్థానిక వ్యాధి నిరోధక మరియు నియంత్రణ కేంద్రం (Center for Disease Control and Prevention) కు ఈ వ్యాధి గురించి తెలిపింది. ఈ న్యుమోనియాకు సంబంధించి అంతర్జాలంలో ధృవీకరించని కొన్ని పత్రాలు ప్రత్యక్షం అవడంతో 31 డిసెంబరు న CDC హూవనన్ సముద్ర ఆహారపు మార్కెట్ లో అంతుచిక్కని న్యుమోనియాగా ఒకటి ఉన్నట్లుగా ఒప్పుకొంది. విపరీతంగా వ్యాపిస్తున్న వ్యాధి యావత్ దేశాన్ని కుదిపేస్తుండటంతో 1 జనవరి న బీజింగ్ కు చెందిన National Health Commission నుండి నిపుణులు కొందరిని వూహాన్ కు పంపటం జరిగింది. 8 జనవరి న ఒక క్రొత్త కరోనా వైరస్, ఈ న్యుమోనియాకు కారణంగా తేలింది. ఈ వైరస్ యొక్క క్రమాన్ని ఓపెన్ యాక్సెస్ డాటాబేసులో త్వరలోనే ప్రచురించారు. దీని కట్టడికి చైనా దేశం అవలంబించిన జాగ్రత్తలు/సూచనలు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఇతర దేశాల ప్రభుత్వాలు కొనియాడాయి. 2003 SARS పై తాము పోరాడిన తీరు కంటే కరోనా వైరస్ పై తాము పోరాడిన తీరును ప్రపంచానికి తెలుపటం లో చైనా చాల పారదర్శకంగా వ్యవహరించింది.