"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (మొఘల్ చిత్రకళ-ఆవిర్భావం)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
మొఘల్ చిత్రకళకు మూలం పర్షియన్ చిత్రకళ. ఈ పర్షియన్ చిత్రకళ మంగోలియన్ చిత్రకళ చేత ప్రభావితమైంది. పర్షియాలో సఫావి (Safawi) రాజవంశీయులు ఈ చిత్రకళాభిమానంతో మంగోలియన్ చిత్రకారులను తమదేశానికి ఆహ్వానించి వారిచే తమ ప్రజలకు ఈ చిత్రకళారీతిని నేర్పింప చేశారు. పర్షియా సఫావి సుల్తాన్ అయిన షా ఇస్మాయిల్ కాలంలో, బిహజాద్, మిరాక్ వంటి విఖ్యాత చిత్రకారుల కృషితో ఈ మంగోలియన్ చిత్రకళ పూర్తిస్థాయి పర్షియన్ చిత్రకళగా రూపుదిద్దుకొంది. భారతదేశంలో మొఘుల్ చక్రవర్తి హుమాయూన్ పదవీచ్యుతుడై దేశం వదిలి పర్షియాలో తలదాచుకోవాల్సి వచ్చింది. సహజంగా చిత్రకళాభిమాని అయిన హుమాయూన్ పర్షియాలో ఆశ్రయం పొందుతున్నప్పుడు, అక్కడి ఆస్థాన చిత్రకారులైన బిహజాద్ వంటి మేటి చిత్రకారుల పరిచయంతో ఈ పర్షియన్ చిత్ర శైలి పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడు. క్రీ.శ. 1555 లో తిరిగి భారతదేశానికి వచ్చిన తరువాత తనతోపాటు మీరు సయ్యద్ ఆలీ, క్వాజా అబ్దుస్ సమద్ అనే విఖ్యాత చిత్రకారులను తీసుకొనివచ్చాడు. ముఖ్యంగా క్వాజా అబ్దుస్ సమద్ రాకతో భారతదేశంలో మొఘల్ చిత్రకళ ప్రారంభం అయినట్లుగా చెప్పవచ్చు. 1562 నాటికి సుల్తాన్ దర్బారులో కొలువుతీరిన పర్షియన్ చిత్రకారులు భారతీయ చిత్రకారులకు తమ నూతన చిత్రకళారీతులను నేర్పించడం ప్రారంభించారు. దానితో భారతదేశంలో మొఘల్ చిత్రకళ వేళ్లూనుకోవడం ప్రారంభించింది.
ఈ విధంగా మంగోలియన్ చిత్రకళ పర్షియాలో పర్షియన్-మంగోలియన్ పద్దతిగా ఏర్పడింది. 1560 వరకు భారతదేశంలో ఈ పద్దతి అమలులో ఉండేది 1562 నాటికి ఇది అప్పటికే భారతదేశంలో వాడుకలో వున్న స్థానిక విజయనగరం, బీజాపూర్, అహ్మద్ నగర్, రాజపుత్ర చిత్రకళా పద్దతులతో కలసి భారత-పర్షియా-మంగోలియా సమ్మేళన రీతిగా రూపొందింది. దీనినే మొఘల్ చిత్రకళా రీతి అని వ్యవహరిస్తారు. 1562 లో చిత్రించిన "అక్బర్ దర్బార్ లో తాన్ సేన్ ప్రవేశించిన దృశ్యం" చిత్రపటంలో ఈ మొఘల్ చిత్రకళా రీతి మొట్టమొదటగా కనిపిస్తుందని విమర్శకులు పేర్కొంటారు.
 
 
ఈ చిత్రకళాశైలిపై హిందూ, బౌద్ధ, జైన మతాలు ప్రభావం చూపాయి.
7,315

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2904870" నుండి వెలికితీశారు