"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
ప్రారంభంలో ఇలస్ట్రేషన్ (illustrations) చిత్రణగా మొదలైన ఈ చిత్రకళ తరువాత కాలంలో రూపపట (Portrait) చిత్రణలోకి వికసించింది. మాతృక అయిన పర్షియన్ చిత్రకళతో పోలిస్తే మొఘల్ చిత్రకళాకారులు సూక్ష్మ చిత్రాల కంటే వాస్తవిక రూప చిత్రపటంలోనే మరింత ఆసక్తిని కనపరిచారు.
 
అక్బర్ చక్రవర్తి పోషణలో ఆగ్రాలో ఒక ఇంపీరియల్ చిత్రశాల స్థాపించబడింది. మొఘల్ చిత్ర శైలిలో అద్భుతమైన చిత్రాలను సృష్టించడంలో దర్బారుకు చెందిన మేటి చిత్రకారులతో పాటు ఈ చిత్రశాలకు చెందిన వందలాది చిత్రకారుల సామూహిక కృషి తోడ్పడింది.
మొఘల్ చిత్రకళా శైలిలో పర్షియన్ క్లాసిక్ గ్రంధాలతో పాటు భారతీయ గ్రంధాలకు కూడా చిత్రరచన కొనసాగింది. వీటిలో పేర్కొనతగ్గది. "హంజనామా" అనే పర్షియన్ బృహత్గ్రంధం. అమీర్ హంజా అనే పారశీక వీరుని ప్రేమగాధావృత్తంతో కూడి వున్న ఈ గ్రంథంలోని దృశ్యాలకు సంబంధించి సుమారు 1400 కు పైగా చిత్రాలను 100 మందికి పైగా భారతీయ చిత్రకారులు సమిష్టికృషితో ఒక పెద్ద నూలువస్త్రంపై చిత్రించడం జరిగింది. ఇదే కోవలో బాబర్ నామా, అక్బర్ నామా, జహంగీర్ నామా, పాద్ షా నామా వంటి రాచరిక 'స్వీయ చరిత్ర' గ్రంధాల లోని దృశ్యాలకు చిత్ర రచన సాగింది. అదేవిధంగా భారత, రామాయణ, హరివంశం, శుకసప్తతి గాధలు వంటి కావ్యాలను పర్షియన్ భాషలో అనువదించి వాటికి సైతం రమణీయమైన చిత్రాలను గీయడం జరిగింది.
==మొఘల్ చిత్రకళ-ఆవిర్భావం==
మొఘల్ చిత్రకళకు మూలం పర్షియన్ చిత్రకళ. ఈ పర్షియన్ చిత్రకళ మంగోలియన్ చిత్రకళ చేత ప్రభావితమైంది. పర్షియాలో సఫావి (Safawi) రాజవంశీయులు ఈ చిత్రకళాభిమానంతో మంగోలియన్ చిత్రకారులను తమదేశానికి ఆహ్వానించి వారిచే తమ ప్రజలకు ఈ చిత్రకళారీతిని నేర్పింప చేశారు. పర్షియా సఫావి సుల్తాన్ అయిన షా ఇస్మాయిల్ కాలంలో, బిహజాద్, మిరాక్ వంటి విఖ్యాత చిత్రకారుల కృషితో ఈ మంగోలియన్ చిత్రకళ పూర్తిస్థాయి పర్షియన్ చిత్రకళగా రూపుదిద్దుకొంది. భారతదేశంలో మొఘుల్ చక్రవర్తి హుమాయూన్ పదవీచ్యుతుడై దేశం వదిలి పర్షియాలో తలదాచుకోవాల్సి వచ్చింది. సహజంగా చిత్రకళాభిమాని అయిన హుమాయూన్ పర్షియాలో ఆశ్రయం పొందుతున్నప్పుడు, అక్కడి ఆస్థాన చిత్రకారులైన బిహజాద్ వంటి మేటి చిత్రకారుల పరిచయంతో ఈ పర్షియన్ చిత్ర శైలి పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడు. క్రీ.శ. 1555 లో తిరిగి భారతదేశానికి వచ్చిన తరువాత తనతోపాటు మీరు సయ్యద్ ఆలీ, క్వాజా అబ్దుస్ సమద్ అనే విఖ్యాత చిత్రకారులను తీసుకొనివచ్చాడు. ముఖ్యంగా క్వాజా అబ్దుస్ సమద్ రాకతో భారతదేశంలో మొఘల్ చిత్రకళ ప్రారంభం అయినట్లుగా చెప్పవచ్చు. 1562 నాటికి సుల్తాన్ దర్బారులో కొలువుతీరిన పర్షియన్ చిత్రకారులు భారతీయ చిత్రకారులకు తమ నూతన చిత్రకళారీతులను నేర్పించడం ప్రారంభించారు. దానితో భారతదేశంలో మొఘల్ చిత్రకళ వేళ్లూనుకోవడం ప్రారంభించింది.
7,316

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2904908" నుండి వెలికితీశారు