"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
ఈ శైలిలో రూపొందించిన చిత్రాలు సూక్ష్మశైలిలో (miniatures) ఉంటాయి. మొఘల్ చిత్రకళ దాదాపుగా సూక్ష్మ చిత్రాలకే పరిమితమైందని చెప్పవచ్చు. వీరి సూక్ష్మ చిత్రాలలో కొన్ని ఇలస్ట్రేటెడ్ చిత్రాలుగా ఉంటే, మరికొన్ని ఆల్బమ్ (muraqqa) చిత్రాలుగా వున్నాయి. మొఘల్ చిత్రకారులు ఆల్బమ్‌ల కోసం అనేక సూక్ష్మ చిత్రాలలో పుష్పాలు, మొక్కలు, పక్షులు, జంతువులను ప్రధానంగా తీసుకొని వాటిని ఎంతో వాస్తవికతతో చిత్రీకరించారు.
 
ప్రారంభంలో ఇలస్ట్రేషన్ (illustrations) చిత్రణగా మొదలైన ఈ చిత్రకళ తరువాత కాలంలో రూపపట (Portrait) చిత్రణలోకి వికసించింది. మాతృక అయిన పర్షియన్ చిత్రకళతో పోలిస్తే మొఘల్ చిత్రకళాకారులు సూక్ష్మ చిత్రాల కంటే వాస్తవిక రూప చిత్రపటంలోనే మరింత ఆసక్తిని కనపరిచారు.
 
అక్బర్ చక్రవర్తి పోషణలో ఆగ్రాలో ఒక ఇంపీరియల్ చిత్రశాల స్థాపించబడింది. మొఘల్ చిత్ర శైలిలో అద్భుతమైన చిత్రాలను సృష్టించడంలో దర్బారుకు చెందిన మేటి చిత్రకారులతో పాటు ఈ చిత్రశాలకు చెందిన వందలాది చిత్రకారుల సామూహిక కృషి తోడ్పడింది.
 
మొఘల్ చిత్రకళలో వైవిధ్యత అత్యధికం. వీరి చిత్రాలలో వైవిధ్యభరితమైన దృశ్యాలు విరివిరిగా కనిపిస్తాయి. ముఖ్యంగా దర్బారు దృశ్యాలు, సంఘటనలతో పాటు, ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణులు, వేట దృశ్యాలు, యుద్ధ దృశ్యాలు మొదలైనవి అనేకంగా అలరిస్తాయి.
 
ప్రారంభంలో ఇలస్ట్రేషన్ (illustrations) చిత్రణగా మొదలైన ఈ చిత్రకళ తరువాత కాలంలో రూపపట (Portrait) చిత్రణలోకి వికసించింది. మాతృక అయిన పర్షియన్ చిత్రకళతో పోలిస్తే మొఘల్ చిత్రకళాకారులు సూక్ష్మ చిత్రాల కంటే వాస్తవిక రూప చిత్రపటంలోనే మరింత ఆసక్తిని కనపరిచారు. రూపచిత్రణ (portraiture) లో చక్రవర్తి, అతని రాచకుటుంబీకులు, ఉన్నతోద్యోగులను చిత్రించిన మూర్తి చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాస్తవికధోరణితో వున్న ఆ నాటి రూపపట చిత్రాలు మొఘల్ చిత్రకళలో ఒక నూతన ఒరవడిని సృష్టించాయి.
==మొఘల్ చిత్రకళ-ఆవిర్భావం==
7,316

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2904914" నుండి వెలికితీశారు