"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (Vmakumar, పేజీ ముఘల్ శైలి చిత్రకళ ను మొఘల్ చిత్రకళ కు తరలించారు: 'శైలి చిత్రకళ' అనే ప్రయోగం కన్నా 'చిత్రకళా శైలి' బాగుంటుంది. లేదా ఆంగ్ల వికీ ప్రకారం 'చిత్రకళ' ప్రయోగం కూడా మరింత సముచితంగా ఉంటుంది..)
చి
[[File:Фаррух Бек Бабур принимает придворных. Бабурнаме. 1589. Гал. Саклера, Вашингтон.jpg|thumb|ముఘల్ శైలిలో బాబర్ సభలోని ఒక దృశ్యము]]
 
'''మొఘల్ శైలి చిత్రకళ''' (ఆంగ్లం: [[:en:Mughal Painting|'''Mughal Painting''']]) దక్షిణాసియాలో విలసిల్లిన ఒక ప్రత్యేకమైన చిత్రకళాశైలి. దీనికి మూలం పర్షియన్ సూక్ష్మ చిత్రలేఖనం. మంగోల్ (చైనీస్) చిత్రకళా స్ఫూర్తితో వృద్ధి చెందిన పర్షియన్ చిత్రకళాశైలి, ఈ మొఘల్ చిత్రకళాశైలికి స్ఫూర్తి నిచ్చింది. భారతదేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల ఆస్థానంలో 16,17 శతాబ్దాల కాల పరిదిలో ఈ శైలి పరిఢవిల్లింది. హుమాయూన్ ప్రోత్సాహంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రకళ అక్బర్ కాలంలో ఉన్నతస్థాయికి వికసించింది. తరువాత జహంగీర్ కాలంలో శిఖర స్థాయికి చేరుకొని, ఆ తరువాత ఔరంగజేబు కాలంలో క్షీణించి అదృశ్యమైంది. మొఘల్ చిత్రకళా శైలిలో మన్సూర్, అబ్దుల్ సమద్, అబుల్ హాసన్ ఉస్తాద్, మురాద్, దశవంత్, కేశవ్, ముకుంద్ మొదలైన వారు మేటి చిత్రకారులుగా వెలుగొందడమే కాకుండా మొఘల్ దర్బారులను సైతం అలంకరించారు. ఈ చిత్రకళాశైలిపై హిందూ, బౌద్ధ, జైన మతాలు ప్రభావం చూపాయి.
 
ఈ శైలిలో రూపొందించిన చిత్రాలు సూక్ష్మశైలిలో (miniatures) ఉంటాయి. మొఘల్ చిత్రకళ దాదాపుగా సూక్ష్మ చిత్రాలకే పరిమితమైందని చెప్పవచ్చు. వీరి సూక్ష్మ చిత్రాలలో కొన్ని ఇలస్ట్రేటెడ్ చిత్రాలుగా ఉంటే, మరికొన్ని ఆల్బమ్ (muraqqa) చిత్రాలుగా వున్నాయి. మొఘల్ చిత్రకారులు ఆల్బమ్‌ల కోసం అనేక సూక్ష్మ చిత్రాలలో పుష్పాలు, మొక్కలు, పక్షులు, జంతువులను ప్రధానంగా తీసుకొని వాటిని ఎంతో వాస్తవికతతో చిత్రీకరించారు.
6,876

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2904947" నుండి వెలికితీశారు