చర్చ:గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త వాడుకరి / కొత్త వ్యాసము వ్రాసాను.)
 
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: తిరగ్గొట్టారు
పాతూరి నాగభుషణం గారు మొదట బోటు గ్రంధాలయ సేవలను పెదపాలెం సేవాశ్రమ వాణీ మందిరం ఆధ్వర్యంలో కృష్ణా బాంక్ కాలువ మీద పెదవడ్లపూడి - కొల్లురు మధ్య ప్రయాణం చేసే పడవ లో ఒక సంచార గ్రంధాలయాన్ని 25 అక్టోబర్ 1935 న పెద్ద ఉత్సవములా గ్రామప్రజలు, పెద్దలు, మండల అధ్యక్ష్యులు, సేవాశ్రమ సభ్యుల సమక్షములో అత్యంత చైతన్యవంతముగా ప్రారంభించారు. గ్రామీణ జీవితములోని ఈ విన్నూత్న గ్రంధాలయ సేవలను ప్రజలు ఉత్సాహముతో వినియోగించుకొనుట వలన నాగభూషణము గారు మరో ఇరవై రోజులకే అంటే 17 నవంబర్ 1935 న రెండవ బోటు గ్రంధాలయమునకు శ్రీకారం చుట్టారు. దీనిని పెదవడ్లపూడి - పిడపర్రు గ్రామాలమధ్య నడిపారు. ఈ గ్రంధాలయాలలో భారతి, కృష్ణాపత్రిక, గ్రంధాలయసర్వస్వం, ఆరోగ్యపత్రిక, ప్రకృతి వంటి సాహిత్య పత్రికలు, పుస్తకాలు ఉంచేవారు. ఈ బోటు గ్రంధాలయాల కొరకు .కొందరు దాతలు, ప్రచురణకర్తలు పత్రికలు, పుస్తకాలు, ఇచ్చేవారు. వేసవిలో మాత్రము ఈ సేవలను తాత్కాలికముగా నిలిపేవారు. రెండవ సంవత్సరం బోటు గ్రంధాలయాలు ప్రారంభం నాటికి మరి కొంతమంది కొన్ని చోట్ల బోటు గ్రంధాలయాలు ఆరంభించారు.<ref name=":0">{{Cite book|title=సరశ్వతీ పూజారి:; పాతూరి నాగభుషణం జీవిత చరిత్ర|last=నరసింహ శర్మ|first=సన్నిధానం|publisher=ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంఘం|year=2014|isbn=|location=విజయవాడ|pages=30-37}}</ref> ఇదే విధంగా తెనాలి తాలూకా సంగం జాగర్లమూడి లోని సర్వజన విద్యాప్రదాయని గ్రంధాలయం కూడా బోటు గ్రంధాలయాలను పడవ ప్రయాణీకులకొరకు ఆరంభించారు.<ref>{{Cite book|title=History of Library Movement in Andhra Pradesh (1900-1956)|last=Raju,|first=A.A.N.,|publisher=Ajantha Publications|year=1988|isbn=|location=Delhi|pages=250.}}</ref>
ఈ విన్నూత్న బోటు గ్రంధాలయ సేవలు పలు ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, గ్రంధాలయ ప్రముఖుల ప్రశంసలను పొందాయి. హిందూ, ఆంధ్రపత్రిక వంటి ప్రముఖ వార్తాపత్రికలు ఈ విషయాన్ని ప్రచురించి ప్రచారం చేశాయి. హిందూ దిన పత్రికలో ఈ వార్త చదివిన అప్పటి మద్రాస్ గ్రంధాలయ సంఘం కార్యదర్శి ఎస్.ఆర్.రంగనాధన్ గారు బోటు గ్రంధాలయాల వివరాలను తెలుసుకొని ఈ వృత్తాంతాన్ని తమ అష్టమ వార్షిక నివేదికలో ప్రకటించారు.లండన్ లోని ప్రపంచ వయోజన విద్యా సంఘం వారు కూడా ఈ బోటు గ్రంధాలయాల వివరాలు సేకరించారు.<ref name=":0" />
<references />
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2905044" నుండి వెలికితీశారు