"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
[[File:Фаррух Бек Бабур принимает придворных. Бабурнаме. 1589. Гал. Саклера, Вашингтон.jpg|thumb|ముఘల్ శైలిలో బాబర్ సభలోని ఒక దృశ్యము]]
 
'''మొఘల్ చిత్రకళ''' (ఆంగ్లం: [[:en:Mughal Painting|'''Mughal Painting''']]) దక్షిణాసియాలో విలసిల్లిన ఒక ప్రత్యేకమైన చిత్రకళాశైలి. దీనికి మూలం పర్షియన్ సూక్ష్మ చిత్రలేఖనంలఘుచిత్రలేఖనం. మంగోల్ (చైనీస్) చిత్రకళా స్ఫూర్తితో వృద్ధి చెందిన పర్షియన్ చిత్రకళాశైలి, ఈ మొఘల్ చిత్రకళాశైలికి స్ఫూర్తి నిచ్చింది. భారతదేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల ఆస్థానంలో 16,17 శతాబ్దాల కాల పరిదిలో ఈ శైలి పరిఢవిల్లింది. హుమాయూన్ ప్రోత్సాహంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రకళ అక్బర్ కాలంలో ఉన్నతస్థాయికి వికసించింది. తరువాత జహంగీర్ కాలంలో శిఖర స్థాయికి చేరుకొని, ఆ తరువాత ఔరంగజేబు కాలంలో క్షీణించి అదృశ్యమైంది. మొఘల్ చిత్రకళా శైలిలో మన్సూర్, అబ్దుల్ సమద్, అబుల్ హాసన్ ఉస్తాద్, మురాద్, దశవంత్, కేశవ్, ముకుంద్ మొదలైన వారు మేటి చిత్రకారులుగా వెలుగొందడమే కాకుండా మొఘల్ దర్బారులను సైతం అలంకరించారు. ఈ చిత్రకళాశైలిపై హిందూ, బౌద్ధ, జైన మతాలు ప్రభావం చూపాయి.
 
ఈ శైలిలో రూపొందించిన చిత్రాలు సూక్ష్మశైలిలోలఘుచిత్రాలుగా (miniatures) ఉంటాయి. సాధారణంగా అంగుళాల కొలతల్లో ఉంటాయి. మొఘల్ చిత్రకళ దాదాపుగా సూక్ష్మ చిత్రాలకేలఘుచిత్రాలకే పరిమితమైందని చెప్పవచ్చు. వీరి సూక్ష్మ చిత్రాలలోలఘుచిత్రాలలో కొన్ని ఇలస్ట్రేటెడ్ చిత్రాలుగా ఉంటే, మరికొన్ని ఆల్బమ్ (muraqqa) చిత్రాలుగా వున్నాయి. మొఘల్ చిత్రకారులు ఆల్బమ్‌ల కోసం అనేక సూక్ష్మ చిత్రాలలోలఘుచిత్రాలలో పుష్పాలు, మొక్కలు, పక్షులు, జంతువులను ప్రధానంగా తీసుకొని వాటిని ఎంతో వాస్తవికతతో చిత్రీకరించారు.
 
అక్బర్ చక్రవర్తి పోషణలో ఆగ్రాలో ఒక ఇంపీరియల్ చిత్రశాల స్థాపించబడింది. మొఘల్ చిత్ర శైలిలో అద్భుతమైన చిత్రాలను సృష్టించడంలో దర్బారుకు చెందిన మేటి చిత్రకారులతో పాటు ఈ చిత్రశాలకు చెందిన వందలాది చిత్రకారుల సామూహిక కృషి తోడ్పడింది.
మొఘల్ చిత్రకళలో వైవిధ్యత అత్యధికం. వీరి చిత్రాలలో వైవిధ్యభరితమైన దృశ్యాలు విరివిరిగా కనిపిస్తాయి. ముఖ్యంగా దర్బారు దృశ్యాలు, సంఘటనలతో పాటు, ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణులు, వేట దృశ్యాలు, యుద్ధ దృశ్యాలు మొదలైనవి అనేకంగా అలరిస్తాయి.
 
ప్రారంభంలో ఇలస్ట్రేషన్ (illustrations) చిత్రణగా మొదలైన ఈ చిత్రకళ తరువాత కాలంలో రూపపట (Portrait) చిత్రణలోకి వికసించింది. మాతృక అయిన పర్షియన్ చిత్రకళతో పోలిస్తే మొఘల్ చిత్రకళాకారులు సూక్ష్మ చిత్రాలలఘుచిత్రాల కంటే వాస్తవిక రూప చిత్రపటంలోనేచిత్రపటాల్లొనే మరింత ఆసక్తిని కనపరిచారు. రూపచిత్రణ (portraiture) లో చక్రవర్తి, అతని రాచకుటుంబీకులు, ఉన్నతోద్యోగులను చిత్రించిన మూర్తి చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాస్తవికధోరణితో వున్న ఆ నాటి రూపపట చిత్రాలు మొఘల్ చిత్రకళలో ఒక నూతన ఒరవడిని సృష్టించాయి.
 
ఔరంగజేబు కాలంలో రాజాదరణను కోల్పోయిన అనేక చిత్రకారులు ఇతర రాజ్యాలకు తరలిపోయారు. తదనంతరకాలంలో మొఘల్ చిత్రకళా శైలి ఇతర హిందూ, ముస్లిం ప్రాంతీయ రాజ్యాలకు, ఆ తరువాత సిక్కు ప్రాంతీయ రాజ్యాలకు వ్యాపించింది. ఆయా సంస్థానాలలో అనేక ప్రాంతీయ శైలులను అభివృద్ధి చేసింది. ఈ సమయంలోనే ఉత్తర భారతదేశంలో ఈ కళ హిందూ పురాణేతిహాస గాథా చిత్రణతో ఎక్కువగా ముడిపడింది. అయితే ప్రాంతీయ చిత్రకళారీతులు రాశి పరంగా ఎక్కువైనప్పటికీ వాసి పరంగా తక్కువ సొగసు తోనే అభివ్యక్తమయ్యాయి. వీటిని తరచుగా "మొఘల్ తదనంతర", "ఉప-మొఘల్" లేదా "ప్రాంతీయ మొఘల్" చిత్రకళగా అభివర్ణిస్తారు.
6,865

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2905147" నుండి వెలికితీశారు