"కలంకారీ" కూర్పుల మధ్య తేడాలు

812 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(విస్తరణ)
 
ఈ కళ శ్రీకాళహస్తిలో ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేయడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఉన్న ఆధారాలను బట్టి, 13 మరియు 19వ శతాబ్దాల్లో కోరమాండల్ తీరం వెంబడి వస్త్ర వ్యాపారం బాగా జరిగేది. కాబట్టి దక్కను పీఠభూమికి చెందిన అన్ని ప్రదేశాలలోనూ ఈ కళ విలసిల్లిందని తెలుస్తుంది. పట్టణాన్ని ఆనుకుని ఎల్లప్పుడూ ప్రవహించే సువర్ణముఖీ నదిలో ఈ కళకు ముఖ్యంగా అవసరమైన స్వచ్చమైన పారే నీరు లభించటం వలన ఇది ఇక్కడ బాగా ప్రాచుర్యం పొంది ఉండవచ్చు. ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తేశ్వరాలయం పర్యాటకులను, యాత్రుకులను ఆకర్షించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఈ కళ ఎక్కువగా హిందూ సాంప్రదాయాన్నే ప్రతిబింబిస్తుంది. ఇక్కడగల కళాకారులు ఇప్పటికీ [[రామాయణము]], [[మహాభారతం]], [[శివ పురాణం]] మొదలైన వాటిని నుంచి పాత్రలను చిత్రిస్తూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
 
కోరమాండల్ తీరం వెంబడి ఉన్న ముఖ్యమైన మచిలీపట్నం ఓడరేవు ద్వారా ఈ కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలకూ వ్యాపించి ఉండవచ్చు. మచిలీపట్నం ఓడరేవుకు సౌకర్యాలు సరిగా లేక పోయినా గోల్కొండ ప్రభువులతో సంబంధాలు ఉండటవ్ వలన అది ముఖ్యమైన ఓడరేవుగా విలసిల్లింది.
ముఖ్యంగా ఈ కళంకారి లో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ విధానం లో వాడే [[రంగులు]] అన్నీ సహజ రంగులే (కూరగాయల నుంచి సేకరించినవి). ఇవి శరీరానికి ఏవిధమైన హానీ చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కొని మచిలీపట్నం (బందరు)ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకొని వెళ్ళేవారు.
==ప్రముఖ కళంకారీ కళాకారులు==
గురప్ప చెట్టి, దామోదరాచారి
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/290550" నుండి వెలికితీశారు