మొఘల్ చిత్రకళ: కూర్పుల మధ్య తేడాలు

గ్రంథ చిత్రణ
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
గ్రంథ చిత్రణ
పంక్తి 32:
 
మొఘల్ రాజవంశపు జీవిత చరిత్ర గ్రంధాలు కూడా లఘుచిత్రాలతో చిత్రించబడ్డాయి. ఈ సంప్రదాయం బాబర్ నామా గ్రంధంతో ప్రారంభమైనప్పటికీ, అక్బర్ కి ముందున్న కాలంలో రాచరిక జీవితచరిత్ర గ్రంధాలకు చిత్రాలు సమకూర్చబడలేదు. తుర్కీ భాషలో వున్న బాబర్ స్వీయ చరిత్ర 'తుజ్ కీ బాబరీ'ను అతని మనవడు అక్బర్ పర్షియన్ భాషలోకి బాబర్ నామా (1589) పేరుతొ అనువదింపచేసాడు. తరువాత దానిని నాలుగు సుందరమైన సచిత్ర రాతప్రతులలో చిత్రింపచేసాడు. ఒక్కొక్క ప్రతిలో 183 లఘుచిత్రాలు ఉన్నాయి. అక్బర్ 1590 లలో తన వంశ పూర్వీకుడైన తైమూర్ జీవిత చరిత్ర 'జాఫర్ నామా' (యాజ్డి విరచితం) గ్రంధానికి సచిత్ర రచన చేయించాడు. కాని అతని అత్త గుల్ బదన్ బేగం, తన తండ్రి హుమాయున్ జీవిత చరిత్రను వ్రాసినప్పటికీ, దానికి సంబందించిన సచిత్ర రాతప్రతి పూర్తిగా లభ్యం కాలేదు. అక్బర్ జీవిత చరిత్రను అబ్దుల్ ఫైజీ 'అక్బర్ నామా' పేరుతొ పర్షియన్ భాషలో వ్రాయడం జరిగింది. 1594 లో పూర్తయిన అక్బర్ నామా సచిత్ర గ్రంథ చిత్రరచనాకృషిలో బసవన్ వంటి ప్రఖ్యాత చిత్రకారునితో సహా మొత్తం 49 మంది చిత్రకారులు పాలుపంచుకున్నారు. 116 లఘుచిత్రాలతో వున్న అక్బర్ నామా సచిత్ర రాత ప్రతి ప్రస్తుతం లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో వుంది. అదేవిధంగా జహంగీర్ స్వీయ చరిత్ర జహంగీర్ నామా (తజక్-ఎ-జహంగీరి), షాజహాన్ జీవిత చరిత్ర 'పాద్ షా నామా' గ్రంధాలకు రమణీయమైన లఘుచిత్రాలు కూర్చడం జరిగింది. పాద్ షా నామా గ్రంధం (1650)తో రాచరిక స్వీయ చరిత్ర గ్రంధాలకు ఘనంగా సచిత్ర రచనలు చేయడం ఆగిపోయింది.
 
మొఘల్ చిత్రకళా రీతిలో పర్షియన్ ప్రాచీన కావ్య సంపుటిలకు కూర్చిన లఘుచిత్రాలు సాధారణంగా రాశిలో తక్కువ (ఇరవై వరకు) అయినప్పటికి వాసిలో మాత్రం ఘనంగా వున్నాయి. అక్బర్ కాలంలో ప్రాచీన పర్షియన్ గ్రంధాలతో పాటు పర్షియన్లోకి అనువాదితమైన భారత, రామాయణ, హరివంశం లాంటి హిందూ పురాణేతిహాసాలకు, కావ్యాలకు కూడా సుందరమైన చిత్రాలు గీయడం జరిగింది. ఉదాహరణకు అక్బర్ వద్ద పర్షియన్ అనువాదిత రామాయణానికి సంబంధించి ఒక సచిత్ర గ్రంథ రాతప్రతి, రంజ్ నామా (మహాభారతానికి పర్షియన్ అనువాదం) కు సంబంధించి నాలుగు సచిత్ర గ్రంథ రాతప్రతులు వుండేవి. ఆక్బర్ శుకసప్తతి గాథలను తూతినామా పేర పర్షియన్ భాషలోకి అనువదింపచేయడమే కాకుండా దానిని రమణీయమైన చిత్రాలతో అలకరింపచేసాడు. ఈ కాలంలోనే లీలావతి, లైలా-మజ్ను వంటి అనేక గ్రంధాలు చక్కని చిత్రాలతో వెలువడ్డాయి.
 
 
{{భారతీయ చిత్రకళ}}
"https://te.wikipedia.org/wiki/మొఘల్_చిత్రకళ" నుండి వెలికితీశారు