మొఘల్ చిత్రకళ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
జంతువులు, మొక్కల చిత్రణ
పంక్తి 35:
మొఘల్ చిత్రకళా రీతిలో ప్రాచీన పర్షియన్ కావ్య సంపుటిలకు కూర్చిన లఘుచిత్రాలు సాధారణంగా రాశిలో తక్కువ (ఇరవై వరకు) అయినప్పటికి వాసిలో మాత్రం ఘనంగా వున్నాయి. అక్బర్ కాలంలో ప్రాచీన పర్షియన్ గ్రంధాలతో పాటు పర్షియన్లోకి అనువాదితమైన భారత, రామాయణ, హరివంశం లాంటి హిందూ పురాణేతిహాసాలకు, కావ్యాలకు కూడా సుందరమైన చిత్రాలు గీయడం జరిగింది. ఉదాహరణకు అక్బర్ వద్ద పర్షియన్ అనువాదిత రామాయణానికి సంబంధించి ఒక సచిత్ర గ్రంథ రాతప్రతి, రంజ్ నామా (మహాభారతానికి పర్షియన్ అనువాదం) కు సంబంధించి నాలుగు సచిత్ర గ్రంథ రాతప్రతులు వుండేవి. ఆక్బర్ శుకసప్తతి గాథలను తూతినామా పేర పర్షియన్ భాషలోకి అనువదింపచేయడమే కాకుండా దానిని రమణీయమైన చిత్రాలతో అలకరింపచేసాడు. ఈ కాలంలోనే లీలావతి, లైలా-మజ్ను వంటి అనేక గ్రంధాలు చక్కని చిత్రాలతో వెలువడ్డాయి.
 
===దర్బారీజంతువులు, మొక్కల చిత్రణ===
మొఘల్ చిత్రకళలో ఎక్కువగా ప్రాచుర్యంలో వున్న అంశం మొక్కలు, జంతువుల చిత్రణ. వీటిని మొఘల్ చిత్రకారులు అత్యంత ప్రతిభావంతంగా జీవకళ ఉట్టిపడేటట్లు వాస్తవికతతో చిత్రించారు. బాబర్ స్వీయ చరిత్ర 'బాబర్ నామా' లో పుష్పాల, మొక్కలు, జంతువులకు సంబంధించిన అనేక వర్ణనలు వున్నాయి. అక్బర్ కాలంలో ఈ గ్రంధానికి, దానిలోని వర్ణనల కనుగుణంగా అందమైన చిత్రాలు జతపరచబడ్డాయి. పక్షులు, జంతువుల చిత్రాలు గీయడంలో ఉస్తాద్ మన్సూర్ మంచి ప్రావీణ్యం కనపరిచాడు. మొఘల్ చిత్రకళా చరిత్రకారుడైన మిలో సి. బీచ్ ప్రకారం మొఘల్ చిత్రకళలో సహజత్వం ఉట్టిపడుతుండేది. మొఘల్ చిత్రకారులు చిత్రించిన తొలినాటి జంతు చిత్రాలను పరిశీలిస్తే, వారు తాము ఎన్నుకొన్న చిత్రవస్తువు (theme) ను కొత్తగా, వినూత్నంగా పరిశీలించడం కన్నా, ఆ వస్తువు లోనే వైవిధ్యత ఎక్కువగా ప్రదర్శించారని తెలుస్తుంది. మొఘల్ చిత్రకారులు చిత్రించిన జంతువుల బొమ్మలపై, చైనా దేశంలో కాగితంపై తయారైన సాదా సీదా జంతు చిత్రాల ప్రభావం కొంతమేరకు ఉందని గుర్తించడం జరిగింది.
 
 
===రూపపట చిత్రణ===
"https://te.wikipedia.org/wiki/మొఘల్_చిత్రకళ" నుండి వెలికితీశారు