చాగంటి కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి 49.207.61.127 (చర్చ) చేసిన మార్పులను Yarra RamaraoAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 35:
}}
 
'''శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు''' ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఆయన తూర్పు గోదావరి జిల్లా [[కాకినాడ]] వాస్తవ్యులు. ఈయన తండ్రి శ్రీ చాగంటి సుందర శివరావు గారు, తల్లి శ్రీమతి సుశీలమ్మ గారు. [[1959]] [[జూలై 14]]వ తేదిన ఈయన జన్మించారు. కోటేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి గారు. వీరికి ఇద్దరు పిల్లలు; ఆయన ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన [[మనసు]]<nowiki/>లను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది [[బిరుదు]]<nowiki/>లను అందుకున్నారు.
 
మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని,, 40 రోజుల పాటు శ్రీ [[లలితా సహస్ర నామ స్తోత్రము]]ను అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది [[తెలుగు]] వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు. ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు కానీ నెమ్మదిగా వాటినుంచి బయటపడ్డారు.
పంక్తి 54:
 
== ప్రవచనాలు==
శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణము, ఇవి బాల కాండ నుండి పట్టాభి షేకము వరకు చెప్పబడ్డాయి. [[శివ పురాణము]]<nowiki/>లోని భక్తుల కథలు, [[మార్కండేయుడూ|మార్కండేయ]] చరిత్ర, [[నంది]] కథ, జ్యోతిర్లింగ వర్ణన, లింగావిర్భావము[[రమణ మహర్షి|, రమణ మహర్షి]] జీవితము మొదలైన అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. [[విరాట పర్వము]] అనే ప్రవచనంలో [[భారతము]] లోని అజ్ఞాత వాస పర్వము వివరించబడింది. భాగవతము అనే ప్రవచనంలో భాగవతుల కథలు, [[కృష్ణావతారం]] యొక్క పూర్తి కథ చోటు చేసుకుంది. భాగవత ప్రవచనాలలో ప్రథమముగా శ్రీకృష్ణ నిర్యాణం, [[పాండవులు|పాండవుల]] మహాప్రస్థాన కథ చోటు చేసుకున్నాయి. [[సౌందర్య లహరి]] ఉపన్యాసాలు [[ఆదిశంకరాచార్య]] విరచిత [[సౌందర్యలహరి]]కి వివరణ ఉంది. శిరిడీ సాయి బాబా కథ చోటు చేసుకుంది. ఇంకా [[రుక్మిణీ కల్యాణం (సినిమా)|రుక్మిణీ కల్యాణం]], [[కనకధారా స్తోత్రం|కనకథారాస్తోత్రం]], గోమాత విశిష్టత, [[భజగోవిందం]], గురుచరిత్ర, [[కపిలతీర్థం|కపిల తీర్థం]], శ్రీరాముని విశిష్టత, తిరుమల విశిష్టత, హనుమజ్జయంతి, హనుమద్వైభవం, సుందరకాండ, భక్తి, సామాజిక కర్తవ్యం, శంకరాచార్య జీవితం, శంకర షట్పది, సుబ్రహ్మణ్య జననం మొదలైన ప్రవచనాలు చేసారు కోటేశ్వర రావు. ఆయన తన వాక్పటిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నారు..
 
===ప్రవచనాల జాబితా ===