2019–21 కరోనావైరస్ మహమ్మారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
అయితే, తర్వాత చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రమైన ప్రచారోద్యమం ప్రారంభించింది, దీన్ని తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి గ్జి జిన్‌పింగ్ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేసిన "ప్రజా యుద్ధం"గా అభివర్ణించాడు.<ref name="people's war" /> తర్వాత "మానవ చరిత్రలో అతిపెద్ద క్వారంటైన్‌"గా<ref name="Dd2zc" /> పేర్కొన్న ప్రయత్నం ప్రారంభించారు. జనవరి 23న వుహాన్ నగరంలోకి, నగరం నుంచి బయటకు ఎవరినీ రానీయకుండా నియంత్రణలు అమలుచేస్తూ లాక్‌డౌన్ ప్రారంభించారు,<ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/international-51219393|title=కరోనా వైరస్‌: చైనాలో మరో నగరానికి రాకపోకలు నిలిపివేత|date=2020-01-23|work=BBC News తెలుగు|access-date=2020-04-04|language=te}}</ref> దీన్ని హుబయ్ ప్రావిన్సులో 15 ఇతర నగరాలకు విస్తరించారు, మొత్తంగా ఈ లాక్‌డౌన్ 5.7 కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది.<ref name="bZ2hk" /> నగరంలో ప్రైవేటు వాహనాల వాడకం నిషేధించారు.<ref name="abc11902006" /> అనేక ప్రాంతాల్లో జనవరి 25న జరగాల్సి ఉన్న చైనీస్ కొత్త సంవత్సర వేడుకలు రద్దయ్యాయి.<ref name="AutoDW-71" /> చైనా తాత్కాలిక ఆసుపత్రి, హువాషెన్‌షాన్ ఆసుపత్రిని పది రోజుల వ్యవధిలో నిర్మించింది, మొత్తంగా మరో 14 తాత్కాలిక ఆసుపత్రులను చైనా నిర్మించింది.<ref name="0JDLl" /> ఆ తర్వాత లీషెన్‌షాన్ ఆసుపత్రిని క్వారంటైన్‌ రోగుల కోసం నిర్మించింది.<ref>{{Citation|title=Leishenshan Hospital|date=2020-04-02|url=https://en.wikipedia.org/w/index.php?title=Leishenshan_Hospital&oldid=948698147|work=Wikipedia|language=en|access-date=2020-04-03}}</ref><ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/international-51352515|title=కరోనావైరస్ బాధితుల కోసం 8 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన చైనా.. ఇదెలా సాధ్యమైంది?|date=2020-02-03|work=BBC News తెలుగు|access-date=2020-04-04|language=te}}</ref>
 
జనవరి 26న కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం ప్రయాణికులకు ఆరోగ్యపరమైన ప్రకటనలు జారీచేయడం సహా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు మరికొన్ని చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి,<ref name="20200126cgtn" /> స్ప్రింగ్ ఫెస్టివల్ సెలవులను పొడిగించారు.<ref name="AutoDW-72" /> దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు.<ref name="bjnews678863" /><ref name="people33743688" /><ref name="xinhuanet138732282" /> పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించి, ఇతర అంశాల్లోనూ హాంగ్‌కాంగ్, మకావ్ ప్రాంతాలు వివిధ జాగ్రత్తలు ఏర్పరిచాయి.<ref name="AutoDW-74" /> చైనాలోని వివిధ ప్రాంతాల్లో ఇంటి నుంచే పనిచేయాలని ఉత్తర్వులు జారీచేశారు. హుబయ్ ప్రావిన్సులోనూ, దాని బయట కూడా ప్రయాణాలపై పరిమితులు విధించారు. ప్రజారవాణా సౌకర్యాల్లో మార్పులు చేశారు. చైనావ్యాప్తంగా మ్యూజియంలు తాత్కాలికంగా మూసివేశారు. వివిధ నగరాల్లో ప్రజల రాకపోకలపై నియంత్రణలు విధించారు. 76 కోట్ల మంది (చైనా జనాభాలో సగానికి పైగా) ఏదో ఒక రూపంలో బయట తిరగడంపై నియంత్రణలు ఎదుర్కొన్నారు.
 
<br />