2019–21 కరోనావైరస్ మహమ్మారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
 
=== చైనా ===
కోవిడ్-19 వ్యాధికి సంబంధించి మనకి తెలిసిన తొలి నిర్ధారిత కేసు 2019 డిసెంబర్ 1న వుహాన్‌లో బయటపడింది;<ref name="AutoDW-67" /> ఇదే నగరంలో 17 నవంబరున ఇంకా తొలినాటి కేసు ఉన్నట్టు ఒక నిర్ధారణ లేని రిపోర్టు సూచిస్తోంది.<ref name="original_report2" /> డాక్టర్ ఝాంగ్ జిక్సియాన్ తెలియని కారణంతో వస్తున్న [[న్యుమోనియా]] కేసుల సమూహాన్ని డిసెంబరు 26న గమనించింది, దీనితో ఆమె ఆసుపత్రి డిసెంబరు 27న ఈ విషయాన్ని వుహాన్ ప్రావిన్సుకు చెందిన వ్యాధుల వ్యాప్తి నియంత్రణ, నివారణ కేంద్రానికి నివేదించింది.<ref name="cWygt" /> వుహాన్ మున్సిపల్ ఆరోగ్య కమీషన్ డిసెంబరు 31న పబ్లిక్ నోటీసు విడుదల చేసింది.<ref name="AutoDW-68" /> ఈ విషయం మీద ప్రపంచ ఆరోగ్య సంస్థకు అదే రోజు సమాచారం అందించారు.<ref name="AutoDW-692" /> ఈ నోటిఫికేషన్లు వెలువడ్డాకా అవుట్‌బ్రేక్‌ గురించి "పుకార్లు ప్రచారం" చేయవద్దంటూ వుహాన్ నగరంలోని వైద్యులను పోలీసులు హెచ్చరించారు.<ref name="RwfQW" /> మొదట్లో చైనీస్ జాతీయ ఆరోగ్య కమీషన్ మనిషి నుంచి మనిషికి ఇది వ్యాప్తిస్తుంది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఏవీ లేవని పేర్కొంది.<ref name="5ZTkz" />
 
2020 జనవరిలోనూ చైనా అధికారులు ఇది మనిషి నుంచి మనిషికి సోకడం లేదనీ, వన్యప్రాణుల మార్కెట్లో జంతువుల నుంచి మనుషులకు సోకిందని వాదించింది. జనవరి 19 నాటికి 50 కేసులు మాత్రమే నమోదైనట్టు చైనా పేర్కొంది. అయితే అప్పటికే జపాన్, థాయ్‌లాండ్ దేశాల్లో చెరో రెండు కేసులు నమోదై ఉండడంతో ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 1,700 పైచిలుకు ఉండవచ్చనీ, ఇంత తీవ్రంగా విస్తరిస్తోందంటే మనిషి నుంచి మనిషికి వ్యాపించే సామర్థ్యం వైరస్‌కి ఉండి ఉండాలని ప్రపంచవ్యాప్తంగా వైరాలజీ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు.<ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/international-51162746|title=చైనా కరోనా వైరస్: 'ఇప్పటికే వందలాది మందికి సోకింది... ఇతర దేశాలకు విస్తరిస్తోంది'|last=గళగర్|first=జేమ్స్|date=2020-01-19|work=BBC News తెలుగు|access-date=2020-04-04|language=te}}</ref>
 
అయితే, తర్వాత చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రమైన ప్రచారోద్యమం ప్రారంభించింది, దీన్ని తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి [[గ్జి జిన్‌పింగ్]] వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేసిన "ప్రజా యుద్ధం"గా అభివర్ణించాడు.<ref name="people's war" /> తర్వాత "మానవ చరిత్రలో అతిపెద్ద క్వారంటైన్‌"గా<ref name="Dd2zc" /> పేర్కొన్న ప్రయత్నం ప్రారంభించారు. జనవరి 23న వుహాన్ నగరంలోకి, నగరం నుంచి బయటకు ఎవరినీ రానీయకుండా నియంత్రణలు అమలుచేస్తూ లాక్‌డౌన్ ప్రారంభించారు,<ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/international-51219393|title=కరోనా వైరస్‌: చైనాలో మరో నగరానికి రాకపోకలు నిలిపివేత|date=2020-01-23|work=BBC News తెలుగు|access-date=2020-04-04|language=te}}</ref> దీన్ని హుబయ్ ప్రావిన్సులో 15 ఇతర నగరాలకు విస్తరించారు, మొత్తంగా ఈ లాక్‌డౌన్ 5.7 కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది.<ref name="bZ2hk" /> నగరంలో ప్రైవేటు వాహనాల వాడకం నిషేధించారు.<ref name="abc11902006" /> అనేక ప్రాంతాల్లో జనవరి 25న జరగాల్సి ఉన్న చైనీస్ కొత్త సంవత్సర వేడుకలు రద్దయ్యాయి.<ref name="AutoDW-71" /> చైనా తాత్కాలిక ఆసుపత్రి, హువాషెన్‌షాన్ ఆసుపత్రిని పది రోజుల వ్యవధిలో నిర్మించింది, మొత్తంగా మరో 14 తాత్కాలిక ఆసుపత్రులను చైనా నిర్మించింది.<ref name="0JDLl" /> ఆ తర్వాత లీషెన్‌షాన్ ఆసుపత్రిని క్వారంటైన్‌ రోగుల కోసం నిర్మించింది.<ref>{{Citation|title=Leishenshan Hospital|date=2020-04-02|url=https://en.wikipedia.org/w/index.php?title=Leishenshan_Hospital&oldid=948698147|work=Wikipedia|language=en|access-date=2020-04-03}}</ref><ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/international-51352515|title=కరోనావైరస్ బాధితుల కోసం 8 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన చైనా.. ఇదెలా సాధ్యమైంది?|date=2020-02-03|work=BBC News తెలుగు|access-date=2020-04-04|language=te}}</ref>
 
జనవరి 26న కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం ప్రయాణికులకు ఆరోగ్యపరమైన ప్రకటనలు జారీచేయడం సహా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు మరికొన్ని చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి,<ref name="20200126cgtn" /> స్ప్రింగ్ ఫెస్టివల్ సెలవులను పొడిగించారు.<ref name="AutoDW-72" /> దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు.<ref name="bjnews678863" /><ref name="people33743688" /><ref name="xinhuanet138732282" /> పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించి, ఇతర అంశాల్లోనూ [[హాంగ్‌కాంగ్]], [[మకావు|మకావ్]] ప్రాంతాలు వివిధ జాగ్రత్తలు ఏర్పరిచాయి.<ref name="AutoDW-74" /> చైనాలోని వివిధ ప్రాంతాల్లో ఇంటి నుంచే పనిచేయాలని ఉత్తర్వులు జారీచేశారు.<ref name="CaixinJan26QianTong" /> హుబయ్ ప్రావిన్సులోనూ, దాని బయట కూడా ప్రయాణాలపై పరిమితులు విధించారు.<ref name="CaixinJan26QianTong2" /><ref name="20200124bloomberg" /> ప్రజారవాణా సౌకర్యాల్లో మార్పులు చేశారు.<ref name="chinadaily310128217273397" /> చైనావ్యాప్తంగా మ్యూజియంలు తాత్కాలికంగా మూసివేశారు.<ref name="CaixinJan26QianTong3" /><ref name=":12" /><ref name="AutoDW-76" /> వివిధ నగరాల్లో ప్రజల రాకపోకలపై నియంత్రణలు విధించారు. 76 కోట్ల మంది (చైనా జనాభాలో సగానికి పైగా) ఏదో ఒక రూపంలో బయట తిరగడంపై నియంత్రణలు ఎదుర్కొన్నారు.<ref name="6nex7" />
 
మార్చిలో కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న దశలో చైనా అధికారులు ఇతర దేశాల నుంచి ఇది తిరిగి చైనాకు దిగుమతి కావడాన్ని నివారించడానికి గట్టి చర్యలు చేపట్టారు. ఉదాహరణకు, [[బీజింగ్]] నగరానికి వచ్చే అందరు అంతర్జాతీయ ప్రయాణికులు 14-రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ విధించారు.<ref name="eFQeZ" /> మార్చి 23 నాటికి చైనా ప్రధాన భూభాగంలో దేశీయంగా 5 రోజుల వ్యవధిలో ఒకే ఒక కేసు వ్యాప్తి చెందే స్థాయికి నియంత్రించారు. ఈ సందర్భంలో కూడా [[గ్వాంగ్జౌ|గ్వాంగ్జౌకు]] [[ఇస్తాంబుల్|ఇస్తాంబుల్‌]] నుంచి తిరిగి వచ్చిన ప్రయాణికుడి వల్ల ఆ ఒక్క కేసూ నమోదైంది.<ref name="jDprF" /><ref name="ny2N9" /> 2020 మార్చి 24న దేశీయంగా కేసుల వ్యాప్తిని అరికట్టామని, చైనాలో కరోనావైరస్ 2019 వ్యాప్తి నియంత్రణలోకి వచ్చిందని [[చైనా ప్రీమియర్]] [[లీ కెక్వియాంగ్]] ప్రకటించాడు.<ref name="6AaWr" />
==చూడండి==
* [[భారతదేశలొ 2020 కరోనావైరస్ వ్యాప్తి]]