2019–21 కరోనావైరస్ మహమ్మారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 74:
జనవరి 26న కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం ప్రయాణికులకు ఆరోగ్యపరమైన ప్రకటనలు జారీచేయడం సహా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు మరికొన్ని చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి,<ref name="20200126cgtn" /> స్ప్రింగ్ ఫెస్టివల్ సెలవులను పొడిగించారు.<ref name="AutoDW-72" /> దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు.<ref name="bjnews678863" /><ref name="people33743688" /><ref name="xinhuanet138732282" /> పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించి, ఇతర అంశాల్లోనూ [[హాంగ్‌కాంగ్]], [[మకావు|మకావ్]] ప్రాంతాలు వివిధ జాగ్రత్తలు ఏర్పరిచాయి.<ref name="AutoDW-74" /> చైనాలోని వివిధ ప్రాంతాల్లో ఇంటి నుంచే పనిచేయాలని ఉత్తర్వులు జారీచేశారు.<ref name="CaixinJan26QianTong" /> హుబయ్ ప్రావిన్సులోనూ, దాని బయట కూడా ప్రయాణాలపై పరిమితులు విధించారు.<ref name="CaixinJan26QianTong2" /><ref name="20200124bloomberg" /> ప్రజారవాణా సౌకర్యాల్లో మార్పులు చేశారు.<ref name="chinadaily310128217273397" /> చైనావ్యాప్తంగా మ్యూజియంలు తాత్కాలికంగా మూసివేశారు.<ref name="CaixinJan26QianTong3" /><ref name=":12" /><ref name="AutoDW-76" /> వివిధ నగరాల్లో ప్రజల రాకపోకలపై నియంత్రణలు విధించారు. 76 కోట్ల మంది (చైనా జనాభాలో సగానికి పైగా) ఏదో ఒక రూపంలో బయట తిరగడంపై నియంత్రణలు ఎదుర్కొన్నారు.<ref name="6nex7" />
 
మార్చిలో కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న దశలో చైనా అధికారులు ఇతర దేశాల నుంచి ఇది తిరిగి చైనాకు దిగుమతి కావడాన్ని నివారించడానికి గట్టి చర్యలు చేపట్టారు. ఉదాహరణకు, [[బీజింగ్]] నగరానికి వచ్చే అందరు అంతర్జాతీయ ప్రయాణికులు 14-రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ విధించారు.<ref name="eFQeZ" /> మార్చి 23 నాటికి చైనా ప్రధాన భూభాగంలో దేశీయంగా 5 రోజుల వ్యవధిలో ఒకే ఒక కేసు వ్యాప్తి చెందే స్థాయికి నియంత్రించారు. ఈ సందర్భంలో కూడా [[గ్వాంగ్జౌ|గ్వాంగ్జౌకు]] [[ఇస్తాంబుల్|ఇస్తాంబుల్‌]] నుంచి తిరిగి వచ్చిన ప్రయాణికుడి వల్ల ఆ ఒక్క కేసూ నమోదైంది.<ref name="jDprF" /><ref name="ny2N9" /> 2020 మార్చి 24న దేశీయంగా కేసుల వ్యాప్తిని అరికట్టామని, చైనాలో కరోనావైరస్ 2019 వ్యాప్తి నియంత్రణలోకి వచ్చిందని [[చైనా ప్రీమియర్]] [[లీ కెక్వియాంగ్]] ప్రకటించాడు.<ref name="6AaWr" /> అదే రోజున లాక్‌డౌన్‌ విధించిన రెండు నెలల అనంతరం వుహాన్ మినహా మిగిలిన హుబయ్ ప్రావిన్సు అంతా ప్రయాణాలపై నియంత్రణలు సడలించారు.<ref>{{cite news|url=https://www.nytimes.com/2020/03/24/world/asia/china-coronavirus-lockdown-hubei.html|title=China to Ease Coronavirus Lockdown on Hubei 2 Months After Imposing It|last1=Wang|first1=Vivian|date=24 March 2020|work=The New York Times|last2=Wee|first2=Sui-Lee}}</ref>
==చూడండి==
* [[భారతదేశలొ 2020 కరోనావైరస్ వ్యాప్తి]]