"కలంకారీ" కూర్పుల మధ్య తేడాలు

457 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(విస్తరణ)
కోరమాండల్ తీరం వెంబడి ఉన్న ముఖ్యమైన మచిలీపట్నం ఓడరేవు ద్వారా ఈ కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలకూ వ్యాపించి ఉండవచ్చు. మచిలీపట్నం ఓడరేవుకు సౌకర్యాలు సరిగా లేక పోయినా గోల్కొండ ప్రభువులతో సంబంధాలు ఉండటవ్ వలన అది ముఖ్యమైన ఓడరేవుగా విలసిల్లింది.గోల్కొండ ప్రభువైన కుతుబ్ షాహీ కళంకారీ ఉత్పత్తులను ఎక్కువగా కోరే పర్షియన్ వర్తకులతో వ్యాపార సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవాడు.
 
కలంకారీ ఉత్పత్తులు మార్కెట్ అవసరాలను బట్టి వివిధ రూపాలలో తయారవుతుంటాయి. వీటిలో ముఖ్యమైనవి ప్రార్థనా వస్త్రాలు, దుప్పట్లు, దిండు గలీబులు,ప్రవేశ ద్వార వస్త్రాలు జంతు రూపాలు,వివిధ పుష్పాల తో కూడిన డిజైన్లు మొదలైనవి మధ్య ఆసియా మార్కెట్ కోసం తయారు చేస్తే, కుట్టుపనిని పోలి ఉండే జీవమున్న చెట్లు లాంటి డిజైన్లు యూరొపియన్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తారు.ఇంకా దుస్తులకు అవసరమైన అంచులు, మరియు గోడలకు వేలాడదీయగలిగే చిత్ర పటాలు ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ధరించే వస్త్రాలకు అవసరమయ్యే డిజైన్లు తూర్పు ఆసియాకు ఎగుమతి అవుతుంటాయి.
 
సుగంధ ద్రవ్యాల వ్యాపారస్థులు [[వస్తుమార్పిడి పద్దతి]] ప్రకారం తమ వ్యాపారం కోసం భారతీయ వస్త్రాలను ముఖ్యంగా కళంకారీ వస్త్రాలను వాడేవారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/290761" నుండి వెలికితీశారు