నిడమర్తి ఉమా రాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''నిడమర్తి ఉమారాజేశ్వరరావు'''(అక్టోబర్ 17, 1923 - జూలై 25,2010) ఒక రచయిత, విమర్శకుడు, సంపాదకుడు, అనువాదకుడు, ప్రచురణకర్త. కార్మిక నాయకుడు, కమ్యూనిస్ట్ నేత [[నిడమర్తి అశ్వనీ కుమారదత్తు]] ఇతనికి అన్న.
==జీవిత విశేషాలు==
ఉమారాజేశ్వరరావు [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[నిడమర్రు]] గ్రామంలో [[1923]], [[అక్టోబర్ 17]]వ తేదీన [[నిడమర్తి లక్ష్మీనారాయణ]] వెంకమ్మ దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించాడు. అభ్యుదయ రచయిత, తొలి కమ్యూనిస్టుల్లో ఒకరైన [[నిడమర్తి అశ్వినీఅశ్వనీ కుమారదత్తు]] ఇతనికి అన్న.
 
1936- 38లలో విశాఖపట్నంలో హైస్కూల్‌ విద్యాభ్యాస కాలంలో [[చండ్ర రాజేశ్వరరావు]], తన అన్న అశ్వినీఅశ్వనీ కుమారదత్తుల ప్రభావంతో కమ్యూనిస్ట్ అభిమానిగా మారాడు. 1939లో పశ్చిమ గోదావరిజిల్లా [[ఉండి]] పట్టణ హైస్కూల్‌ లో విద్యార్థుల సమ్మెకి నాయకత్వం వహించి విజయవంతంగా నడిపి, నెలరోజులు సస్పెండ్‌ అయ్యాడు. అదే సంవత్సరం కాకినాడలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్‌ మహాసభలో కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోబడ్డాడు. 1942లో తాడేపల్లిగూడెం తాలూకాలో పార్టీ హోల్‌టైమరుగా పని ప్రారంభించిన ఉమారాజ్‌ రచనా వ్యాసంగం 1942లో ప్రజాశక్తిలో ''జోయ వీరగాథ'', ''గెరిల్లా'' ప్రచురణతో ప్రారంభమైంది. 1929లో ''అన్నా'' ప్రచురణతో ప్రారంభించిన ''ప్రోలెటేరియన్‌ సీరిస్‌''ను ఇతడు తన అన్న అశ్వినీకుమార దత్తుతో కలిసి 1943లో ''ప్రగతి ప్రచురణాలయం'' పేరిట పునరుద్ధరించి, నిర్వహించాడు. ఆంధ్రదేశంలోని తొలిసోషలిస్టు ప్రచురణాలయాల్లో యిది ఒకటి. 1943లో అశ్వినీకుమారదత్తుతోబాటు అనువదించిన ''చైనా ఎర్రసైన్యం'' మొదలుకొని ఇతడు సుమారు నూరు అనువాదాలు చేశాడు. 1947లో కడపలో సోషలిస్టు స్టడీ సర్కిల్‌ నిర్వహణలో పాల్గొన్నాడు. 1950 నుండి 1965 ఆగస్టు దాకా కర్నూలు జిల్లా బేతంచెర్లలో పరిశ్రమ నిర్వహణకాలంలో సైతం రచనా వ్యాసంగం కొనసాగించాడు. 1965 డిసెంబరు నుంచి 1967 దాకా విజయవాడలో విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకునిగా పనిచేశాడు. దేవరకొండ బాలగంగాధర తిలక్‌ కవితలు 'అమృతం కురిసిన రాత్రి'నీ, ''తిలక్‌ కథలు''నూ, ''సుప్తశిల'' వగైరా నాటికలనూ విశాలాంధ్ర ప్రచురణాలయానికి సేకరించి పెట్టాడు.
 
1967 నుండి 1977 మే దాకా విశాలాంధ్ర సాహిత్యానుబంధ సంపాదకునిగా పనిచేసి, అభ్యుదయ రచయితలకు దాన్నొక వేదికగా తీర్చిదిద్దాడు. కృష్ణాజిల్లా అరసం ప్రధాన కార్యదర్శిగా నాటక విభాగం, చిత్రకళావిభాగం ప్రారంభించి [[ధవళ సత్యం]] దర్శకత్వంలో, వీరాసారధ్యంలో ఎం.జి.రామారావు రచించిన ''ఎర్రమట్టి'' నాటక ప్రదర్శనకూ, గని వంటి గాయకులు, మోహన్‌ వంటి అభ్యుదయ చిత్రకారుల తయారీకి, ఉదయతార, ఎర్రపూలు, సమైక్యతావాణి, సుడి వగైరాలతో అరసం ప్రచురణకి నాంది పలికాడు.