నిడమర్తి ఉమా రాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
1967 నుండి 1977 మే దాకా విశాలాంధ్ర సాహిత్యానుబంధ సంపాదకునిగా పనిచేసి, అభ్యుదయ రచయితలకు దాన్నొక వేదికగా తీర్చిదిద్దాడు. కృష్ణాజిల్లా అరసం ప్రధాన కార్యదర్శిగా నాటక విభాగం, చిత్రకళావిభాగం ప్రారంభించి [[ధవళ సత్యం]] దర్శకత్వంలో, వీరాసారధ్యంలో ఎం.జి.రామారావు రచించిన ''ఎర్రమట్టి'' నాటక ప్రదర్శనకూ, గని వంటి గాయకులు, మోహన్‌ వంటి అభ్యుదయ చిత్రకారుల తయారీకి, ఉదయతార, ఎర్రపూలు, సమైక్యతావాణి, సుడి వగైరాలతో అరసం ప్రచురణకి నాంది పలికాడు.
 
ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి-కోశాధికారిగా అరసం పునరుద్దరణ కృషిలో ముఖ్యపాత్ర వహించాడు. ఇతని సంపాదకత్వంలో పందకొండేళ్ళ కృషి ఫలితంగా ''స్వెత్లానా ద్జేనిత్‌'' కూర్చిన రష్యన్‌-తెలుగు నిఘంటువు వెలుగు చూసింది. భార్య శ్యామలాదేవితో కలిసి హిందీ నుండి కిషన్‌ చందర్‌ ''ఐదుగురు లోఫర్లు'', ''జంగ్లీ'' లను తెలుగులోని అనువదించాడు. ఇతడు 1992లో పులుపుల వెంకట శివయ్య సాహితీ పురస్కారం అందుకున్నాడు.