నిడమర్తి ఉమా రాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 9:
ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి-కోశాధికారిగా అరసం పునరుద్దరణ కృషిలో ముఖ్యపాత్ర వహించాడు. ఇతని సంపాదకత్వంలో పందకొండేళ్ళ కృషి ఫలితంగా ''స్వెత్లానా ద్జేనిత్‌'' కూర్చిన రష్యన్‌-తెలుగు నిఘంటువు వెలుగు చూసింది. భార్య శ్యామలాదేవితో కలిసి హిందీ నుండి కిషన్‌ చందర్‌ ''ఐదుగురు లోఫర్లు'', ''జంగ్లీ'' లను తెలుగులోని అనువదించాడు. ఇతడు 1992లో పులుపుల వెంకట శివయ్య సాహితీ పురస్కారం అందుకున్నాడు.
 
మాస్కోలో ఉద్యోగ విరమణానంతరం బెంగళూరులో స్థిరపడి అక్కడ అరసం శాఖను ప్రారంభించాడు. 1997 నుండి 2008 వరకు బెంగళూరులో అరసం తరఫున 103 కార్యక్రమాలను నిర్వహించాడు. బెంగళూరు శాఖ తరఫున కథాతరంగాలు, కవితాతరంగాలు సంకలనాలను తన సంపాదకత్వంలో వెలువరించాడు.