"అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం" కూర్పుల మధ్య తేడాలు

ప్రవేశికలో సవరణలు, చేర్పులు
(ప్రవేశికలో సవరణలు, చేర్పులు)
}}
 
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం [[భూ నిమ్న కక్ష్య|భూనిమ్న కక్ష్య]]<nowiki/>లో (Low Earth Orbit) పరిభ్రమిస్తూన్న, మానవ నివాసయోగ్యమైన, మానవ నిర్మిత ఉపగ్రహం. ఈ కేంద్రాన్ని [[అమెరికా]] (నాసా), [[రష్యా]] (రోస్‌కాస్మోస్), జపాన్ (జాక్సా), ఐరోపా దేశాలు (ఇ ఎస్ ఏ), కెనడా (సి ఎస్ ఏ) లకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ కేంద్రపు స్వామిత్వం (ఓనర్‌షిప్), దాని వాడుకలు ఈ దేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలను అనుసరించి ఉంటాయి,
'''[[అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం]]'''. ఈ కేంద్రాన్ని [[అమెరికా]], [[రష్యా]], ఇతర అభివృద్ధి చెందిన దేశాలు [[అంతరిక్షం]]<nowiki/>లో పరిశోధనలు చేయడానికి నిర్మించాయి. ఈ అంతరిక్ష కేంద్రం [[భూమి]] పరిభ్రమించే లోపలి కక్ష్యతో (Low Earth Orbit) నిర్మించబడింది. ఈ అంతరిక్ష కేంద్రం భూమికి 278 నుండి 460 కి.మీ. [[ఎత్తు]]<nowiki/>లో ఉండి, సరాసరి గంటకు 27,743 కి.మీ. వేగంతో పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇది రోజుకు 16 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఈ కేంద్రంలో వ్యోమగాములు నివసిస్తున్నారు. <ref name="అంతర్జాతీయ అంతరిక్షకేంద్రం">{{cite news|title=అంతర్జాతీయ అంతరిక్షకేంద్రం|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=1437|accessdate=3 April 2018|agency=www.eenadu.net|publisher=ఈనాడు}}</ref>
 
ISS, మైక్రోగ్రావిటీ, అంతరిక్ష పర్యావరణాల పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది. దీనిలో సిబ్బంది జీవశాస్త్రం, మానవ జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, ఇతర రంగాలలో ప్రయోగాలు చేస్తారు. <ref name="ISS overview">{{వెబ్ మూలము}}</ref> <ref name="NASA Fields of Research">{{వెబ్ మూలము}}</ref> <ref name="NASA ISS Goals">{{వెబ్ మూలము}}</ref> చంద్రుడి వద్దకు, అంగారక గ్రహానికి వెళ్ళే యాత్రలకు అవసరమైన అంతరిక్ష నౌక వ్యవస్థలను, పరికరాలనూ పరీక్షించేందుకు ఈ కేంద్రం అనుకూలంగా ఉంటుంది. <ref name="ResProg">{{వెబ్ మూలము}}</ref> ISS సగటున 400 కి.,మీ. ఎత్తున ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ''[[ జ్వెజ్డా (ISS మాడ్యూల్)|జ్వెజ్డా]]'' మాడ్యూల్ లోని ఇంజిన్లను ఉపయోగించి రీబూస్ట్ విన్యాసాలు చెయ్యడం ద్వారా గానీ, అంతరిక్ష నౌకను సందర్శించే నౌకల ద్వారాగానీ ఆ [[స్టేషన్ కీపింగ్|కక్ష్యను నిర్వహిణ]] చేస్తుంది.<ref>{{వెబ్ మూలము}}</ref> ఇది సుమారు 92 నిమిషాలకు ఒకసారి కక్ష్యలో పరిభ్రమిస్తుంది.రోజుకు 15.5 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. <ref name="tracking">{{వెబ్ మూలము}}</ref>
 
ఈ కేంద్రాన్ని రెండు విభాగాలుగా విభజించారు. రష్యా నిర్వహించే [[ రష్యన్ కక్ష్య విభాగం|రష్యన్ ఆర్బిటల్ సెగ్మెంట్]] (ROS), అనేక దేశాలు పంచుకునే యునైటెడ్ స్టేట్స్ ఆర్బిటల్ సెగ్మెంట్ (USOS). ISS యొక్క నిరంతర కార్యకలాపాలను 2024 వరకూ పొడిగించే ప్రతిపాదనను రోస్‌కాస్మోస్ ఆమోదించింది. <ref name="sn20150225">{{Cite news|url=http://spacenews.com/russia-and-its-modules-to-part-ways-with-iss-in-2024/|title=Russia — and Its Modules — To Part Ways with ISS in 2024|last=de Selding|first=Peter B.|date=25 February 2015|work=Space News|access-date=26 February 2015}}</ref> కానీ, రష్యన్ విభాగంలోని అంశాలను [[ కక్ష్య పైలట్ అసెంబ్లీ మరియు ప్రయోగ సముదాయం|OPSEK]] అనే కొత్త రష్యన్ అంతరిక్ష కేంద్రం నిర్మించడానికి ఉపయోగించాలని రోస్‌కాస్మోస్ గతంలో ప్రతిపాదించింది. <ref name="moscow20141117">{{Cite news|url=http://www.themoscowtimes.com/business/article/russia-may-be-planning-national-space-station-to-replace-iss/511299.html|title=Russia May Be Planning National Space Station to Replace ISS|last=Bodner|first=Matthew|date=17 November 2014|work=The Moscow Times|access-date=3 March 2015}}</ref> 2018 డిసెంబరు నాటి స్థితి ప్రకారం, ఈ కేంద్రం 2030 వరకు పనిచేస్తుంది. <ref name="auto">{{వెబ్ మూలము}}</ref>
 
మొట్టమొదటి ISS భాగాన్ని 1998 లో స్థాపించారు, మొదటి దీర్ఘకాలిక నివాసితులు 2000 నవంబరు 2 న వెళ్ళారు. <ref>{{Cite news|url=https://www.esa.int/Our_Activities/Human_Spaceflight/International_Space_Station/First_crew_starts_living_and_working_on_the_International_Space_Station|title=First crew starts living and working on the International Space Station|date=31 October 2000|work=European Space Agency}}</ref> ఆనాటి నుండి నిరంతరంగా ఇక్కడ వ్యోమగాములు నివసిస్తూనే ఉన్నారు. <ref>{{వెబ్ మూలము}}</ref> గతంలో రష్యన్ అంతరిక్ష కేంద్రం మిర్ పేరిట ఉన్న 9 సంవత్సరాల, 357 రోజుల నిరంతర నివాస రికార్డును ఐఎస్‌ఎస్ బద్దలు కొట్టింది. తాజా మేజర్ ప్రెజరైజ్డ్ మాడ్యూల్‌ను 2011 లో అమర్చారు. 2016 లో ప్రయోగాత్మకంగా గాలి ఊదితే ఉబ్బే మాడ్యూలును జోడించారు. కేంద్రం అభివృద్ధి, అసెంబ్లీ కొనసాగుతోంది. 2020 తో మొదలుపెట్టి అనేక కొత్త రష్యన్ అంశాలను చేర్చటానికి షెడ్యూలు తయారు చేసారు. ISS భూ నిమ్న కక్ష్యలో తిరిగె మానవ నిర్మిత వస్తువుల్లో అతి పెద్దది.దీన్ని భూమి నుండి కంటితో చూడవచ్చు. <ref>{{వెబ్ మూలము}}{{Dead link|date=June 2017|bot=InternetArchiveBot}}</ref> <ref>{{వెబ్ మూలము}}</ref> ISS లో పీడనంతో కూడిన నివాస మాడ్యూళ్ళు, నిర్మాణ ట్రస్సులు, సౌర ఫలకాలు, రేడియేటర్లు, డాకింగ్ పోర్టులు, ప్రయోగ వేదికలు, రోబోటిక్ చేతులూ ఉన్నాయి. ముఖ్యమైన ISS మాడ్యూళ్ళను రష్యన్ ప్రోటాన్ రాకెట్లు, [[ సోయుజ్ (రాకెట్ కుటుంబం)|సోయుజ్]] రాకెట్లు, అమెరికా స్పేస్ షటిళ్ళ ద్వారా అంతరిక్షం లోకి పంపించారు. <ref name="ISSBook">{{Cite book|url={{Google books|VsTdriusftgC|page=|keywords=|text=|plainurl=yes}}|title=The International Space Station: Building for the Future|last=Catchpole|first=John E.|date=17 June 2008|publisher=Springer-Praxis|isbn=978-0-387-78144-0}}</ref>
 
సోవియట్, ఆ తరువాత రష్యన్ ''సాలియుట్'', ''అల్మాజ్'', ''మీర్'' స్టేషన్లతో పాటు అమెరికా వారి ''స్కైలాబ్'' వగైరాల తరువాత, సిబ్బంది నివసించే అంతరిక్ష కేంద్రాల్లో ISS తొమ్మిదవది. కేంద్రానికి అవసరమైన సరఫరాలను రష్యన్ [[ సోయుజ్ (అంతరిక్ష నౌక)|సోయుజ్]], [[ పురోగతి (అంతరిక్ష నౌక)|ప్రోగ్రెస్]], యుఎస్ [[ స్పేస్‌ఎక్స్ డ్రాగన్|డ్రాగన్]], [[ సిగ్నస్ (అంతరిక్ష నౌక)|సిగ్నస్]], జపనీస్ H-II బదిలీ వాహనం, <ref name="ISSRG">{{Cite book|title=Reference Guide to the International Space Station|last=Gary Kitmacher|publisher=[[Apogee Books]]|year=2006|isbn=978-1-894959-34-6|location=Canada|pages=71–80|issn=1496-6921}}</ref> గతంలో యూరోపియన్ ఆటోమేటెడ్ ట్రాన్స్ఫర్ వెహికల్ ద్వారా అందిస్తారు. డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా వెనక్కి భూమికి తీసుకురావాల్సిన వస్తువులను (ఉదా:మరింత విశ్లేషణ అవసరమైన శాస్త్రీయ ప్రయోగాలు) తీసుకు రావచ్చు. సోయుజ్ రిటర్న్ క్యాప్సూలుకు వ్యోమగాములు కాకుండా ఇతరత్రా సమాను తేగలిగే సామర్థ్యం తక్కువ.
 
19 వివిధ దేశాల నుండి వ్యోమగాములు, అంతరిక్ష పర్యాటకులు ISS ను సందర్శించారు. 2019 సెప్టెంబరు నాఅటికి 19 దేశాలకు చెందిన 239 మంది వ్యోమగాములు అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు. వారిలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ సార్లు వెళ్ళివచ్చారు. అమెరికా 151 మందిని పంపగా, రష్యా 47 మందిని, జపాను తొమ్మిది మందిని,కెనడా ఎనిమిది మందిని, ఇటలీ ఐదుగురిని, ఫ్రాన్సు నలుగురినీ, జర్మనీ ముగ్గురిని, బెల్జియం, బ్రెజిల్, డెన్మార్క్, కజాఖ్స్తాన్, మలేషియా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌లు ఒక్కొక్కరినీ పంపాయి. <ref>[https://www.nasa.gov/feature/visitors-to-the-station-by-country/ Visitors to the Station by Country] NASA, 25 September 2019.</ref>
 
==విశేషాలు==
ఈ కేంద్రాన్ని అంతరిక్షంలో పరిశోధనల కొరకు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]], [[రష్యా]], ఇతర అభివృద్ధి చెందిన దేశాలు నిర్మించాయి. ఈ కేంద్రాన్ని [[1998]]లో ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొట్టమొదటి బృందం ప్రయోగాన్ని నవంబరు 2, [[2000]] న ప్రారంభించింది. ఈ కేంద్రం 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో, అయిదు పడకగదులతో ఉంటుంది. (దీని బరువు నాలుగు లక్షల యాభై మూడు వేల ఐదు వందల తొంభై రెండు కిలోలు ఉంటుంది. ఒక కెసి-135 నాలుగు ఇంజన్ల జెట్‌ [[వాహనం]]<nowiki/>లో వ్యోమగాములు గంట నుంచి 2 గంటల వ్యవధి వరకు గాలిలో వేలాడే స్థితిలో నే ఉంటారు. ఇక్కడి వ్యోమగాములు [[మాంసం]], [[పండ్లు]], వేరుశనగలు, [[వెన్న]], [[గింజలు]], [[కాఫీ]], [[టీ]], నారింజరసం, నిమ్మరసం వంటి ద్రవాహారాలు తీసుకుంటారు. ఇందులో [[జీవశాస్త్రం]], శారీరధర్మశాస్త్రం, [[భౌతికశాస్త్రం]], ఖగోళశాస్త్రం వంటి అనేక విభాగాల్లోనే గాక వాతావరణానికి (Meteriology) సంబంధించి కూడా పలు పరిశోధనలు చేబడతారు. <ref name="అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం">{{cite news|title=అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం|url=http://m.navatelangana.com/article/budugu/634123|accessdate=3 April 2018|agency=m.navatelangana.com|publisher=నవతెలంగాణ}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2908676" నుండి వెలికితీశారు