అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

→‎విశేషాలు: +అంతరిక్షంలో కూర్పు
→‎విశేషాలు: +కేంద్రంలో జీవనం
పంక్తి 53:
 
== వివిధ భాగాల తయారీ ==
[[దస్త్రం:SSPF_interior.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:SSPF_interior.jpg|thumb|SSPF లో ISS మాడ్యూల్ నోడ్ 2 తయారీ, ప్రాసెసింగ్ ]]
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బహు-జాతీయ సహకార ప్రాజెక్టు కాబట్టి, కక్ష్యలో అసెంబ్లీ చేసే వివిధ భాగాలను ప్రపంచంలోని వివిధ దేశాలలో తయారు చేసారు. 1990 ల మధ్యలో, యుఎస్ భాగాలు ''డెస్టినీ'', ''యూనిటీ'', ఇంటిగ్రేటెడ్ ట్రస్ స్ట్రక్చర్, సౌర ఫలకాలను మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌, మైచౌడ్ అసెంబ్లీ ఫెసిలిటీల్లో తయారు చేసారు. ఈ మాడ్యూల్స్‌ను ఆపరేషన్స్ అండ్ చెక్అవుట్ బిల్డింగ్, స్పేస్ కేంద్రం ప్రాసెసింగ్ ఫెసిలిటీకి తుది అసెంబ్లీ, లాంచ్ కోసం ప్రాసెసింగ్ కొరకు అందజేసారు. <ref>{{వెబ్ మూలము}}</ref>
 
Line 80 ⟶ 81:
2011 జూన్ నాటికి కేంద్రంలో ఇంటెగ్రేటెడ్ ట్రస్ నిర్మాణ్ంతో పాటు 15 పీడనంతో కూడిన మాడ్యూళ్ళు ఉన్నాయి. మరో 5 మాడ్యూళ్ళను ఇంకా లాంచి చెయ్యాల్సి ఉంది. వీటిలో యూరపైయన్ రోబోటిక్ ఆర్ం తో నిర్మించే నౌకా, ప్రిచల్ మాడ్యూళ్ళు, NEM-1 and NEM-2 అనే రెండు పవర్ మాడ్యూళ్ళూ ఉన్నాయి.<ref>{{వెబ్ మూలము}}</ref> 2019 మార్చి నాటికి స్థితి ప్రకారం, రష్యా వారి ప్రాథమిక పరిశోధనా మాడ్యూలు నైకా 2020 వేసవిలో లాంచి చేసే అవకాశం ఉంది.<ref>{{Cite news|url=https://tass.ru/kosmos/6253886|title=Rogozin confirmed that the module "Science" placed the tanks from the upper stage "Frigate"|date=25 March 2019|access-date=31 March 2019|agency=TASS}}</ref>
 
కేంద్రపు స్థూల ద్రవ్యరాశి కాలక్రమంలో మారుతూంటుంది. కక్ష్యలో ఉన్న మాడ్యూళ్ల మొత్తం ద్రవ్యరాశి ప్రయోగ సమయంలో సుమారు 4,17,289 కిలోలు (2011 సెప్టెంబరు 3 నాటికి). <ref>{{వెబ్ మూలము}}</ref> ప్రయోగాలు, విడి భాగాలు, వ్యక్తిగత ప్రభావాలు, సిబ్బంది, ఆహార పదార్థాలు, దుస్తులు, చోదకాలు, నీటి సరఫరా, గ్యాస్ సరఫరా, డాక్ అయిన అంతరిక్ష నౌక, ఇతర వస్తువుల వలన కేంద్రం మొత్తం ద్రవ్యరాశి పెరుగుతుంది. ఆక్సిజన్ జనరేటర్ల ద్వారా హైడ్రోజన్ వాయువును నిరంతరం బయటికి పంపుతూ ఉంటారు. [[దస్త్రం:SSPF_interior.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:SSPF_interior.jpg|thumb|SSPF లో ISS మాడ్యూల్ నోడ్ 2 తయారీ, ప్రాసెసింగ్ ]]
 
[[దస్త్రం:SSPF_interior.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:SSPF_interior.jpg|thumb|SSPF లో ISS మాడ్యూల్ నోడ్ 2 తయారీ, ప్రాసెసింగ్ ]]
== అంతరిక్ష కేంద్రంలో జీవనం ==
[[దస్త్రం:SSPF_interior.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:SSPF_interior.jpg|thumb|SSPF లో ISS మాడ్యూల్ నోడ్ 2 తయారీ, ప్రాసెసింగ్ ]]
 
=== సిబ్బంది కార్యకలాపాలు ===
[[దస్త్రం:S122e007776_orig.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:S122e007776_orig.jpg|thumb|యుఎస్ ల్యాబ్‌లో రోబోటిక్ పరికరాలపై పనిచేస్తున్న [[ STS-122|ఎస్‌టిఎస్ -122]] మిషన్ నిపుణులు ]]
06:00 గంటలకు మేల్కోవడంతో సిబ్బందికి రోజు మొదలవుతుంది. ముందుగా నిద్ర తర్వాత చేసే కార్యకలాపాలు, ఉదయపు స్టేషన్ తనిఖీలు చేస్తారు. అప్పుడు సిబ్బంది అల్పాహారం తింటారు. మిషన్ కంట్రోల్‌తో రోజువారీ ప్రణాళిక సమావేశంలో పాల్గొని, అది ముగిసాక, 08:10 గంటలకు పని ప్రారంభిస్తారు. 13:05 వరకు పని చేస్తారు. ఒక గంట భోజన విరామం తరువాత, మధ్యాహ్నం మరిన్ని వ్యాయామాలు, ఇతర పనులూ చేస్తారు. 19:30 గంటలకు నిద్రకు ముందు చేసే పనులు మొదలౌతాయి. వీటిలో భోజనం, సిబ్బంది సమావేశంతో ఉన్నాయి. 21:30 గంటలకు నిద్ర మొదలౌతుంది. సాధారణంగా, సిబ్బంది వారపు రోజుల్లో రోజుకు పది గంటలు, శనివారాలలో ఐదు గంటలూ పనిచేస్తారు. మిగిలిన సమయం విశ్రాంతికి, వారి స్వంత పనులకు, లేదా పేరుకుపోయిన పని చేయడానికీ వాడుకుంటారు.. <ref>{{వెబ్ మూలము|url=http://www.nasa.gov/pdf/287386main_110508_tl.pdf|title=ISS Crew Timeline|date=5 November 2008|accessdate=5 November 2008|publisher=NASA}}</ref>
 
ISS లో [[సార్వత్రిక సమన్వయ సమయం|కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్]] (UTC) వాడుతారు. స్టేషన్ రోజుకు 16 సూర్యోదయాలు 16 సూర్యాస్తమయాలను చూస్తుంది. సిబ్బందికి చీకటి అనుభూతి కలిగించడానికి రాత్రి సమయంలో కిటికీలను కప్పేస్తారు. స్పేస్ షటిల్ మిషన్లు కేంద్రాన్ని సందర్శించేటప్పుడు, ISS సిబ్బంది ఎక్కువగా షటిల్ యొక్క మిషన్ ఎలాప్డ్ టైమ్ (MET) ను అనుసరిస్తారు, ఇది స్పేస్ షటిల్ యాత్ర మొదలైన సమయంపై ఆధారపడి ఉండే అనువైన టైమ్ జోన్. <ref>{{వెబ్ మూలము|title=NASA – Time in Space, A Space in Time|url=https://www.nasa.gov/mission_pages/station/research/news/time_in_space.html|accessdate=5 May 2015}}</ref> <ref>{{వెబ్ మూలము|title=A Slice of Time Pie|url=http://blogs.nasa.gov/cm/blog/ISS%20Science%20Blog/posts/post_1340820317951.html|accessdate=5 May 2015}}</ref> <ref>{{వెబ్ మూలము|title=Human Space Flight (HSF) – Crew Answers|url=http://spaceflight.nasa.gov/feedback/expert/answer/crew/sts-113/index_2.html|accessdate=5 May 2015}}</ref>
 
కేంద్రం లోని ప్రతి సభ్యునికి క్వార్టర్స్‌ ఉంటాయి. ''జ్వెజ్డాలో'' రెండు 'స్లీప్ స్టేషన్లు', ''హార్మొనీలో'' మరో నాలుగూ ఉన్నాయి. <ref>{{వెబ్ మూలము|url=https://www.youtube.com/watch?v=Q4dG9vSyUFQ|title=At Home with Commander Scott Kelly (Video)}}</ref> <ref>{{వెబ్ మూలము|url=https://ntrs.nasa.gov/archive/nasa/casi.ntrs.nasa.gov/20080013462_2008012884.pdf|title=International Space Station USOS Crew Quarters Development}}</ref> USOS లోని క్వార్టర్స్ ప్రైవేట్‌గా ఉంటాయి. సుమారు వ్యక్తి-పరిమాణంలో సౌండ్‌ప్రూఫ్ బూత్‌లు ఇవి. ROS సిబ్బంది క్వార్టర్స్‌లో చిన్న కిటికీ ఉంటుంది, కాని వీటిలో వెంటిలేషన్, సౌండ్ ప్రూఫింగ్‌లు తక్కువగా ఉంటాయి. ఒక వ్యక్తి ఒక క్వార్టర్‌లో టెథర్డ్ స్లీపింగ్ బ్యాగ్‌లో పడుకోవచ్చు, సంగీతం వినవచ్చు, ల్యాప్‌టాప్ వాడవచ్చు. వ్యక్తిగత వస్తువులను పెద్ద డ్రాయర్‌లో లేదా మాడ్యూల్ గోడలకు తగిలించిన నెట్స్‌లో పెట్టుకోవచ్చు. చదువుకోడానికి దీపం, షెల్ఫ్, డెస్క్‌టాప్‌లు కూడా మాడ్యూల్లో ఉంటాయి. <ref name="ESALife">{{వెబ్ మూలము|url=http://www.esa.int/esaHS/ESAH1V0VMOC_astronauts_0.html|title=Daily life}}</ref> <ref name="NASACrewEquip">{{వెబ్ మూలము|url=http://www.nasa.gov/mission_pages/station/behindscenes/126_payload.html|title=Station Prepares for Expanding Crew}}</ref> <ref name="CSALife">{{వెబ్ మూలము|url=http://www.asc-csa.gc.ca/pdf/educator-liv_wor_iss.pdf|title=Living and Working on the International Space Station}}</ref> సందర్శించే సిబ్బందికి స్లీప్ మాడ్యూల్ ఉండదు. గోడపై అందుబాటులో ఉన్న స్థలానికి స్లీపింగ్ బ్యాగ్‌ను పెట్టుకుంటారు. స్టేషన్‌లో స్వేచ్ఛగా తేలుతూ నిద్రించడం సాధ్యమే గానీ, సున్నితమైన పరికరాలను ఢీకొట్టే అవకాశం ఉన్నందున సాధారణంగా అలా చెయ్యరు. <ref name="SRLife">{{వెబ్ మూలము|url=http://www.space.com/missionlaunches/090827-sts127-space-sleeping.html|title=Sleeping in Space is Easy, But There's No Shower}}</ref> సిబ్బంది వసతికి వెంటిలేషన్ బాగా ఉండాలి; లేకపోతే, వ్యోమగాములు నిద్ర లేచేసరికి, తాము నిశ్వసించిన కార్బన్ డయాక్సైడే తమ తల చుట్టూ ఒక బుడగ లాగా ఏర్పడి ఆక్సిజన్ అందనీయకుండా చెయ్యవచ్చు. <ref name="ESALife" /> వివిధ స్టేషన్ కార్యకలాపాల సమయం లోను, సిబ్బంది విశ్రాంతి సమయాల్లోనూ, ISS లోని లైట్లు మసకబరచవచ్చు, ఆపెయ్యవచ్చు, రంగుల ఉష్ణోగ్రతలను సర్దుబాటు చేయనూ వచ్చు. <ref>{{Cite AV media}}</ref>
 
=== ఆహారం ===
[[దస్త్రం:Meal_STS127.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Meal_STS127.jpg|alt=Nine astronauts seated around a table covered in open cans of food strapped down to the table. In the background a selection of equipment is visible, as well as the salmon-coloured walls of the Unity node.|thumb|ఎస్టీఎస్ -127, ఎక్స్‌పెడిషన్ 20 సిబ్బంది ''యూనిటీ'' లోపల భోజనం చేస్తున్నారు. ]]
USOS లో ఉన్న ఆహారం చాలా వరకు ప్లాస్టిక్ సంచులలో వాక్యూం సీలు చేసి ఉంటుంది; డబ్బాలు చాలా అరుదు -అవి బరువుగా ఉంటాయి, రవాణా చేయడానికి చాలా ఖర్చౌతుంది. నిలవ ఉన్న ఆహారం సిబ్బందికి పెద్దగా నచ్చదు. మైక్రోగ్రావిటీలో దాని రుచి తగ్గుతుంది. <ref name="ESALife2">{{వెబ్ మూలము|url=http://www.esa.int/esaHS/ESAH1V0VMOC_astronauts_0.html|title=Daily life}}</ref> కాబట్టి సాధారణ వంటలో కంటే ఎక్కువ మసాలా దినుసులు వేసి, సహా ఆహారాన్ని మరింత రుచికరంగా చేసే ప్రయత్నాలు చేస్తారు. భూమి నుండి తాజా పండ్లు, కూరగాయలను తీసుకువచ్చే నౌకల కోసం ఎదురుచూస్తూంటారు. ఆహారాలు ముక్కలు సృష్టించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు, మరియు స్టేషన్ పరికరాలను కలుషితం చేయకుండా ఉండటానికి ద్రవ సంభారాలను ఘనంగా ఇష్టపడతారు. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత ఆహార ప్యాకేజీలు ఉంటాయి. వాటిని కేంద్రంలోని గాలీలో వేడి చేసుకుంటారు. ఈ గాల్లో రెండు ఫుడ్ వార్మర్లు ఉన్నాయి. నవంబర్ 2008 లో రిఫ్రిజిరేటర్ పెట్టారు. వేడిచేసిన, వేడి చేయని నీటిని అందించే డిస్పెన్సరు ఉంది. <ref name="NASACrewEquip2">{{వెబ్ మూలము|url=http://www.nasa.gov/mission_pages/station/behindscenes/126_payload.html|title=Station Prepares for Expanding Crew}}</ref> పానీయాలు డీహైడ్రేటెడ్ పొడి రూపంలో ఇస్తారు. ఈ పొడిని నీటిలో కలుపుకుని తాగుతారు <ref name="NASACrewEquip2" /> <ref name="CSALife2">{{వెబ్ మూలము|url=http://www.asc-csa.gc.ca/pdf/educator-liv_wor_iss.pdf|title=Living and Working on the International Space Station}}</ref> పానీయాలు, సూప్‌లను ప్లాస్టిక్‌ సంచుల నుండి స్ట్రాలతో తాగుతారు. అయితే ఘనాహారాన్ని కత్తి, ఫోర్కులతో తింటారు. ఈ కత్తులు, ఫోర్కులూ తేలుకుంటూ పోకుండా వీతిని అయస్కాంతాలతో ఒక ట్రేకు జతచేసి ఉంచుతారు. ఆహరపు ముక్కల వంటి వాటిని తేలుకుంటూ పోనివ్వకూడదు. లేదంటే ఇవి స్టేషన్ యొక్క ఎయిర్ ఫిల్టర్లకు, ఇతర పరికరాలకు అడ్డం పడే అవకాశం ఉంది. <ref name="CSALife2" />
 
==విశేషాలు==