తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎[[భృగు మహర్షి]]: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 72:
 
==కూడలి జాతరకు గుర్తింపు==
ప్రతి సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా ఐదురోజుల పాటు ఇక్కడ కూడలి జాతరగా జరుగుతుంది. ఈ జాతరకు సుమారు ఐదు లక్షలకు పైగా భక్తులు హాజరవుతారు. ఈ జాతర ద్వారా సుమారు రూ.ఆరు లక్ష ల వరకు ఆదాయం లభిస్తుంది. ఇంతటి ప్రసి ద్ధి చెందిన కూడలి జాతరను అప్పటి కలెక్టర్‌ గిరిధర్‌ జిల్లా జాతరగా ప్రకటించారు. అయినప్పటికీ ఈ దేవాలయాన్ని 6సీ గ్రేడ్‌ కిందనే గుర్తిస్తున్నారని, ఈ దేవాలయాన్ని 6బీ గ్రేడ్‌ కింద గుర్తించాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పుడున్న అర్చకులతో పాటు మరొకరిని కూడా ప్రభుత్వ వారి జీతభత్యాలతోెజీతభత్యాలతోే నియమించాల్సిన అవసరం వుందనేది ప్రధానమైన డిమాండు.
 
వర్షాలు సమృద్ధిగా కురిసిన రోజులలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు నీటి కొరత ఉండేది కాదు. కొన్ని సంవత్సరాలుగా నెలకొంటున్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా త్రివేణి సంగమాన చుక్కనీరు నిలవని దుస్థితి. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఎన్‌ఎస్‌పి కాల్వ నీటిని మునే్నరులోకి వదిలినప్పటికీ భక్తులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా ఉన్నతాధికారులు, సంబంధిత శాఖాధికారులు సంగమేశ్వరాలయ త్రివేణి సంగమాన చెక్‌డ్యామ్ నిర్మించి నీటిని నిల్వ చేయాలని భక్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా స్నానఘట్టం ఇప్పుడు పూర్తిగా రాళ్ళు తేలి ఉంది. దానిని శుభ్రపరచి నేలభాగాన్ని చదును చేయించి గుచ్చుకునే రాళ్లను తొలగించినట్లయితే శుభ్రమైన చాలినన్ని నీళ్ళతో స్నానాలు చేయడానికి అనువుగా ఉంటుంది. స్నానఘట్టం కూడా ఆకర్షణీయంగా వున్నట్లయితే మరింత పర్యాటక ఆదాయం సంవత్సరం పొడవునా వచ్చే అవకాశం వుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.