"ఇసుక" కూర్పుల మధ్య తేడాలు

121 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
[[File:Libya 4608 Idehan Ubari Dunes Luca Galuzzi 2007.jpg|right|thumb|లిబియాలో ఇసుక దిబ్బలు.]]
'''ఇసుక''' అనేది విచ్ఛిన్నమైన [[రాతి]] మరియు, ఖనిజ కణాలతో ఏర్పడిన మిశ్రమం. ఇది ప్రకృతిలో లభించే విలువైన పదార్థం. ఇది పరిమాణం ద్వారా నిర్వచించబడింది, [[కంకర]] కంటే చిన్నగా, మెరుగ్గా మరియు, ఒండ్రు మన్ను కంటే గరుకుగా ఉంటుంది. కాంక్రీటు తయారీకి అనువైన ఇసుకకు అధిక డిమాండ్ ఉంది. [[ఎడారి]] ఇసుక సమృద్ధిగా ఉన్నప్పటికీ, కాంక్రీటుకు తగినది కాదు. ప్రతి సంవత్సరం 50 బిలియన్ టన్నుల [[బీచ్]] ఇసుక మరియు, శిలాజ ఇసుక నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఇసుక [[అడ్డుకొలత|వ్యాసం]] 0.3 నుండి 2 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది.
 
అమెరికాలో 0.06 నుండి 2 మి.మీ. మరియు ఐరోపాలో 0.02 నుండి 2 మి.మీ. కణాలను ఇసుక అంటారు. ఇసుకలో 0.02 నుండి 2 మి.మీ. పరిధిలో చిన్న మరియు, పెద్ద అన్ని రకాల రేణువులు ఉంటాయి. ఇంజనీరింగ్‌లో చక్కటి ఇసుక చాలా ముఖ్యం. చక్కటి ఇసుక యొక్క మాడ్యులస్ 1.0 నుండి 2.5 మధ్య ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని మందపాటి ఇసుక అంటారు. భూవిజ్ఞాన శాస్త్రవేత్తల నిర్వచనం ప్రకారం, ఇసుక రేణువులు 0.0625 మిల్లీమీటర్లు నుండి 2 మిల్లీమీటర్ల వరకు వ్యాసాలను కలిగి ఉంటాయి. తదుపరి పెద్ద కణాలను కంకర రాళ్ళు అంటారు. కంకర యొక్క వ్యాసం 2 మిమీ నుండి 64 మిమీ వరకు ఉంటుంది.
 
నదులలో నీటీ ప్రవాహం కారణంగా రాళ్ళు కొట్టుకొనిపోతూ రాపిడికి గురై రాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి ఇసుకగా ఏర్పడుతుంది, అందుకే నదులలో, బీచ్ లలో ఇసుక ఎక్కువగా ఉంటుంది. ఇసుక గాలితో పాటు లేచి ఒక చోటకు ఎక్కువ చేరి ఇసుక దిబ్బలుగా తయారవుతాయి, వీటీని [[ఎడారి|ఎడారులు]] అంటారు.
 
[[సిమెంట్]] మరియు, ఇసుకను నీటితో కలిపి తడపటం వలన అది గట్టిగా బండ లాగా తయారవుతుంది. అందుకనే నిర్మాణ రంగంలో ఇసుక చాలా ప్రముఖమైనది. నిర్మాణంలో సిమెంట్ కంటే ఇసుకను ఎక్కువ నిష్పత్తిలో ఉపయోగిస్తారు.
 
==ఉపయోగాలు==
నదులలో ఇసుక నిల్వలు తగ్గితే భూగర్భ జలాలు అడుగంటుతాయి.
 
పుచ్చకాయ మరియు, వేరుశెనగ వంటి పంటలకు ఇసుక మిశ్రమ భూమి కూడా ఉపయోగపడుతుంది మరియు, అవసరం.
 
నీటి వరదలు నిరోధించడానికి ఇసుక సంచుల వాడకం విస్తృతంగా ఉంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2909154" నుండి వెలికితీశారు