"తెలంగాణ నదులు, ఉపనదులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (clean up, typos fixed: → (6))
[[File:Dummugudem Barrage on Godavari Khammam District.jpg|thumb|250px|గోదావరి నదిపై [[ఖమ్మం జిల్లా]]లో సర్ [[ఆర్థర్ కాటన్]] నిర్మించిన దుమ్ముగూడెం బ్యారేజీ]]
[[ఫైలు:Musi right2.jpg||thumb|250px|చాదర్‌ఘాట్ వద్ద మూసీనది]]
[[బొమ్మ:Alampur 16.JPG||thumb|250px|<center>ఆలంపూర్ వద్ద తుంగభద్ర నది</center>|alt=]]
[[File:Munneru-bridge.jpg|thumb|250px|ఖమ్మం పట్టణంలో మున్నేరుపై రెండు వంతెనలు]]
 
# [[తుంగభద్ర]]: కృష్ణానదికి గల ఉపనదులలో ఒకటైన తుంగభద్ర నది కర్నాటకలోని వరాహ కొండల్లో తుంగ, భద్ర అనే రెండు నదుల కలయిక వలన జన్మిస్తుంది. మహబూబ్‌నగర్‌లోని [[ఆలంపూర్]] వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్‌లోని [[కర్నూలు జిల్లా]]లో [[సంగమేశ్వరం]] వద్ద కృష్ణా నదితో కలుస్తుంది. దీనికి కుముద్వతి, వరద, వేదవతి ఉపనదులు ఉన్నాయి.
# [[మంజీరా నది]]: గోదావరినదికి గల ఉపనదులలో ఒకటైన మంజీరా నది మహారాష్ట్రలోని ‘బాలాఘాట్’ పర్వతాల్లో జన్మించి, అక్కడ నుంచి ఆగ్నేయ దిశగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ద్వారా ప్రవహించి, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి పోచంపాడు వద్ద గోదావరి నదిలో కలుస్తోంది. దీని పొడవు 644 కి.మీ. ఈ నదిపై నిజామాబాద్ జిల్లాలోని [[అచ్చంపేట్ (నిజాంసాగర్‌)|అచ్చంపేట]] సమీపంలో [[నిజాంసాగర్ ప్రాజెక్టు]], [[మెదక్ జిల్లా]]లోని [[సంగారెడ్డి]] పట్టణ సమీపంలో [[సింగూర్ డ్యాం]] నిర్మించడం జరిగింది.
# [[మూసీ నది]]: కృష్ణానదికి గల ఉపనదులలో ఒకటైన మూసీ నది [[రంగారెడ్డి జిల్లా]] శివారెడ్డి పేటశివారెడ్డిపేట వద్ద [[అనంతగిరి]] కొండల్లో జన్మించి, హైదరాబాద్‌ నుండి ప్రవహించి నల్లగొండ జిల్లాలోని [[వాడపల్లి (దామరచర్ల మండలం)|వాడపల్లి]] వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీనిని గండిపేట చెరువు అని కూడా అంటారు. 1920లో ఈ నది పైన [[ఉస్మాన్ సాగర్ (చెరువు)|ఉస్మాన్‌సాగర్ డ్యామ్‌]]ను నిర్మించబడింది. ఈసా, ఆలేరు అనేవి దీనికి ఉపనదులు.
# [[డిండి నది]]: కృష్ణానదికి గల ఉపనదులలో ఒకటైన డిండి నది మహబూబ్‌నగర్‌లో [[షాబాద్‌]] గుట్టలో జన్మించి [[దేవరకొండ]] [[ఏలేశ్వరం]] వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీని పొడవు 153 కి.మీ.
# [[ప్రాణహిత నది]]: గోదావరినదికి గల ఉపనదులలో ఒకటైన ప్రాణహిత నది [[మధ్యప్రదేశ్‌]]లోని సాత్పురా పర్వతాలలో పెన్‌గంగా, వైన్‌గంగా, వార్ధా నదుల కలయిక వలన ఏర్పడి, మహారాష్ట్ర, [[ఛత్తీస్‌గఢ్]] ద్వారా ప్రయాణించి, ఆదిలాబాద్ సరిహద్దు ద్వారా ప్రవహిస్తూ కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించి, మహదేవ్‌పూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదితో కలుస్తోంది. ఈ నదిపై ప్రాణహిత చేవెళ్ళ ఎత్తి పోతలపథకం నిర్మించబడింది.
# [[కిన్నెరసాని]]: గోదావరినదికి గల ఉపనదులలో ఒకటైన కిన్నెరసాని నది [[వరంగల్ జిల్లా]]లో [[మేడారం (ధర్మారం)|మేడారం]]-[[తాడ్వాయి (వరంగల్ జిల్లా మండలం)|తాడ్వాయి]] కొండసానువుల్లో జన్మించి ఆగ్నేయ దిశగా ఖమ్మం జిల్లా ద్వారా ప్రవహిస్తూ [[భద్రాచలం]]కు సమీపాన గల [[బూర్గంపాడు]], [[వేలేరు]] గ్రామాల మధ్య గోదావరితో కలుస్తోంది. సుమారు 96 కి.మీ. పొడవున్న కిన్నెరసాని ఉపనది ‘ముర్రేడు’.
# [[మున్నేరు]]: కృష్ణానదికి గలకృష్ణానది ఉపనదులలో ఒకటైన మున్నేరు నది వరంగల్‌ జిల్లా [[పాకాల]] చెరువు నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం జిల్లాల ద్వారా ప్రవహించి అంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా [[నందిగామ]] తాలూకాలోని ఏలూరు గ్రామం వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. సమారుసుమారు 198 కి.మీ. పొడవున్న ఈ నదికి వైరా, కట్లేరు దీని ముఖ్యమైన ఉపనదులుగా ఉన్నాయి.
# [[పాలేరు నది]]: కృష్ణానదికి గల ఉపనదులలో ఒకటైన పాలేరు నది వరంగల్‌ జిల్లా దక్షిణ భాగంలోని బాణాపురం ప్రాంతంలో పుట్టి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌ కృష్ణాజిల్లాలోని [[జగ్గయ్యపేట]] వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. సుమారు 145 కి.మీ. పొడవున్న ఈ నదిపై నిజాంల కాలంలో ఖమ్మం జిల్లాలోని ‘పాలేరు’ పట్టణ సమీపంలో రిజర్వాయర్ నిర్మించబడింది.
# [[భీమా నది]]: కృష్ణానదికి గల ఉపనదులలో ఒకటైన భీమానదిభీమా నది [[మహారాష్ట్ర]] లోని పశ్చిమ కనుమలలో పుట్టి ఆగ్నేయ దిక్కుగా మహారాష్ట్ర, [[కర్ణాటక]], [[తెలంగాణ]] రాష్ట్రాల గుండా 725 కిలోమీటర్ల దూరము ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది.
# [[పెన్ గంగ]]: గోదావరినదికి గల ఉపనదులలో ఒకటైన పెన్ గంగ నది [[అదిలాబాదు]] గుండా ప్రవహిస్తున్నదిప్రవహిస్తుంది.
# [[వైరా నది]]: ఇది ఖమ్మం జిల్లాలో ప్రవహించే చిన్న నది.
# [[తాలిపేరు నది]]: గోదావరినదికి గల ఉపనదులలో ఒకటైన తాలిపేరు నది [[ఖమ్మం జిల్లా]]లో [[చర్ల]] మండలంలో జన్మించి, ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నదిలో కలుస్తుంది. దీనిపై [[తాలిపేరు ప్రాజెక్టు]] నిర్మించబడింది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
{{Commons category|Rivers of Telangana}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2909588" నుండి వెలికితీశారు