వేరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 49:
ఉప్పు నీటి మొక్కలు గాలి చొరబడని బురదనీటి ప్రాంతాలలో పెరుగుతాయి. వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ పెరుగుటకు మొక్కకు ఆక్సిజన్ ఎంతో అవసరం. లేని పక్షంలో మొక్కలు గిడసబారిపోతాయి. అందుకే ఉప్పునీటి మొక్కలు గాలిని తీసుకోవడానికి వీలుగా ఉండే వేరు వ్యవస్థను ఏర్పటు చేసుకుంటాయి. ఈ వేళ్ళనే ''న్యూమాటోఫోరులు '' అంటారు. ఇవి భూమ్యాకర్షణశక్తికి వ్యతిరేకంగా పెరిగి వాయుగతంగా వృద్ధి చెందుతాయి. వీటిపై అనేక శ్వాసరంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా గాలిని గ్రహించి మొక్కలు శ్వాసక్రియను జరుపుకుంటాయి. ఈ విధంగా శ్వాసక్రియకు సహకరించే వేళ్ళనే శ్వాసవేళ్ళు అంటారు. ఉదా: [[అవిసినియా]], [[రైజోఫొరా]]
 
=== వెలమిన్వెలమన్ వేళ్ళు ===
కొన్ని మొక్కలు భూమిపై కాకుండా ఇతర మొక్కల శాఖలపై ఆవాసం ఏర్పరుచుకొని స్వతంత్రంగా పెరుగుతాయి. వీటిని ''వృక్షోపజీవులు '' అంటారు. ఇవి నేలకు చాలా దూరం(ఎత్తు)లో ఉండటం వలన నీటిని గ్రహించడానికి అవరోధం ఏర్పడుతుంది. ఆ సమస్యను అధిగమించడానికి ఈ మొక్కలు ఏర్పాటుచేసుకున్న ప్రత్యేకమైన వేళ్ళనే ''వెలమన్ వేళ్ళు ''అంటారు. ఈ వేళ్ళు స్వేచ్చగా గాలిలో వేలాడుతూ గాలిలోని తేమను, వర్షపు నీటిని గ్రహించి మొక్కకు అందిస్తాయి. ఈ పని చేయడానికి ఈ వేళ్ళలో ''వెలమన్ '' అనే నిర్జీవ కణజాలం ఉంటుంది. అందుకే ఈ వేళ్ళకు ఆ పేరు పెట్టారు. ఉదా: [[వాండా]]
 
=== కిరణజన్య సంయోగక్రియ జరిపే వేళ్ళు ===
=== సహజీవనపు వేళ్ళు ===
"https://te.wikipedia.org/wiki/వేరు" నుండి వెలికితీశారు