అసెంబ్లీ రౌడీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా (5), → (2) using AWB
పంక్తి 14:
శివాజీ (మోహన్ బాబు) డిగ్రీ పూర్తి చేసుకుని అల్లరి చిల్లరగా తిరిగే యువకుడు. అతని తండ్రి (జగ్గయ్య) అదే ఊర్లో ఒక ఉపాధ్యాయుడు. ఆయనకు కొడుకు అలా ఊరికే ఉండటం నచ్చదు. పూజ (దివ్యభారతి) అదే ఊర్లో పనిచేసే మరో ఉపాధ్యాయుడి (గొల్లపూడి మారుతీ రావు) కూతురు. శివాజీ ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు.
 
ఊర్లో దాదాగిరీ చెలాయించే బాషా అనే రౌడీ ఒక హత్య చేస్తుండగా శివాజీ చూస్తాడు. శివాజీ ఆ రౌడీ ని ఎదుర్కోవడానికి పోతుండగా తల్లి వారించి ఇంటికి తీసుకొస్తుంది. ఈ విషయం తెలిసినా తండ్రి కుటుంబం బాగోగులు చూడని నువ్వు దేశాన్ని ఉద్దరించడానికి బయలు దేరావా, నీ కష్టం తో ఏనాడైనా మాకు కట్టుకునే ఒక జత బట్టలు తీసుకరాగలవా, ముందు పనివెతుక్కో అంటూ తిట్టిపోస్తాడు.మరో రోజు ఆ గొడవలో తన తల్లి తలకు గాయం అవుతుంది. దాంతో శివాజీ అతనికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబుతాడు. బాషా శివాజీ మీద కక్షతో అతన్ని ఓ నేరం మీద జైలుకి పంపిస్తాడు. శివాజీ తల్లిదండ్రులు అతన్ని కేసునుంచి బయట పడేయటానికి ఊర్లో వాళ్ళనెవరైనా సాక్ష్యం చెప్పమని అడుగుతారు. కానీ బాషాకు భయపడి ఎవరూ ముందుకు రారు. శివాజీ జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఇంతలోనే ఎన్నికలు వస్తాయి. ఒక లాయరు ఎన్నికల్లో గెలవడం ద్వారా శివాజీ ప్రజల సాక్ష్యం కోరవచ్చునని సలహా ఇస్తాడు. శివాజీని జైల్లో నుంచే ఎమ్మెల్యే పదవికి పోటీకి నిలబెట్టి అతని తల్లిదండ్రులు అతని తరపున ప్రచారం చేస్తారు. ఆ ఎన్నికల్లో శివాజీ గెలిచి ఎమ్మెల్యే అవుతాడు. అది భరించలేని బాషా అతని తల్లిదండ్రులని చంపేస్తాడు. శివాజీ ఆ రౌడీలను మట్టుబెట్టి కత్తిపోట్లతో తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చేరతాడు. చివర్లో అతను కోలుకుని ప్రజలందరికీ అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో కథ ముగుస్తుంది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/అసెంబ్లీ_రౌడీ" నుండి వెలికితీశారు