త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
వంశ పారంపర్యముగా వచ్చిన 'తరంగ గానం'ను చిన్నవయసులోనే నేర్చుకన్నాడు. 9వ ఏట తెనాలి రామవిలాస సభలో బాలనటుడిగా చేరి అనేక నాటకాల్లో నటించాడు. ఈయన కొన్ని గ్రామోఫోను రికార్డుల్లో కూడా పాడాడు. 1926లో గుంటూరులో బాలమిత్ర సభను ప్రారంభించి, బాలనటులతో ఒక బృందాన్ని తయారుచేసిన దంటు వెంకటకృష్ణయ్య ఆహ్వానం మేరకు రామకృష్ణ శాస్త్రి ఆ సమాజంలోకి చేరి '[[రోషనార (నాటకం)|రోషనార]]'లో [[ఛత్రపతి శివాజీ|శివాజీ]], 'కృష్ణలీలలు' లో [[యశోద]], 'రామదాసు' లో [[రామదాసు]] పాత్రలు పోషించాడు. [[పువ్వుల సూరిబాబు]], కళ్యాణి, నాగలింగం వంటి నటులు కూడా ఆ సంస్థలో ఉన్నారు.
 
నాటక సమాజాలు మూతపడిపోయినకాలంలో [[స్థానం నరసింహారావు]], [[సి.యస్.ఆర్. ఆంజనేయులు]] లతో కలసి ఊరురా తిరిగి '[[శ్రీకృష్ణ తులాభారం (నాటకం)|తులాభారం]]' నాటకంలో [[నారదుడు]]గా నటించి మెప్పించాడు. సినిమారంగంలో ఉంటూనే కలియుగ ఆంజనేయ బిరుదాంకితుడైన బేతా వెంకటరావు '[[రామాంజనేయ యుద్ధం (నాటకం)|రామాంజనేయ యుద్ధం]] నాటకంలో నారదుని పాత్రలో అనేక
ప్రదర్శనలిచ్చాడు. ఇతర నాటక సమాజాలు ప్రదర్శించిన నాటకాలలో బిల్వమంగలుడు, శివయోగి, రామదాసు, కబీరు, నారదుడు పాత్రలలో నటించాడు.
 
== సినిమారంగం ==