వట్టెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 94:
ఇది మండల కేంద్రమైన బిజినపల్లి నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[వనపర్తి]] నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది.
 
=== పూర్వ చరిత్ర====
పూర్వం ఈ ప్రాంతానికి కదంబవాడి అని పేరు. దానికి నిదర్శనంగా ఇక్కడ కదంబ వృక్షాలీనాడు ఈ ప్రదేశంలో కనబడుతాయి. ఈ ప్రాంతాన్ని పూర్వం పశ్చిమ చాళుక్య సామంతులైన ఎరువ చోళులు పాలించారు. ఆ చోళులు కొణిదెన వారిలో ఓ శాఖ. కొణిదెన వారిలో మూల పురుషుడు కరికాలుడు. అతని కుమారుడు మహిమానుడు; అతనికి కరికాలుడు, తొండమానుడు, దశవర్మ అని ముగ్గురు కుమారులుండేవారు. వారిలో కరికాలునిశాఖ కొణిదెనలో నిలిచి పోయింది. మూడోవాడైన దశవర్మ శాఖ గంగాపుర ప్రాంతం వచ్చిందని కొత్త భావయ్య చౌదరి మతం. అలాగే శాసనాల్లోని ప్రశస్తిని మూలపురుషుని పేరుని బట్టి చూస్తే రెండో వాడైన తొండమానుని శాఖ కోడూరికి వచ్చారని తెలుస్తున్నది. కృష్ణానది కన్నడ శాసనాల్లో ఏర అని వ్యవహారముంది. తెలంగాణలో ఆనదిని ఏరనే పిలుస్తారు. చోళులు రేనాటి నుండి విస్తరించిన తరువాత కొందరు కృష్ణా తీరాన క్రమించి, ఏటి దరియైన ఆరాజ్యానికి ఏరువ అని నామకరణం చేసారు. ఏరువను పాలించారు కనుక వారిని ఏరువ చోళులు అయ్యారు.చోళులు తమిళులు. వారిది సింహలాంచనం. రేనాటికి వచ్చిన పిమ్మట వారు నల్లమలలోని ప్రధాన జీవం వ్యాఘ్రాన్ని తమ లాంచనంగా తెస్సుకోగా వారి నుండి వెరైన ఏరవ చోళులు గోవత్సాలను తమ లాంచనంగా స్వీకరించారు. ఈ విధంగా వారు తమిళచోళుల నుండి రేనాటి చోళులు వేరైనట్లు రేనాటి చోళుల నుండి ఏరవ చోళులు వేరైయ్యారు.పాలమూరు ప్రాంతానికి వచ్చిన చోళులు మొదట కోడూరిని తమ రాజధానిగా చేసుకున్నారు. ఆనాడు వారి ఆధీనంలో 300 గ్రామాలుండేవి. కనుక వారి రాజ్యానికి కోడూరి మున్నూటి అని పేరుండేది. అటుపై చోళులు కోడూరి నుండి కందూరికి వచ్చిన పిమ్మట వారినాశ్రయించిన రాజబంధువులందరు ఆ సమీపంలో తమ రాజుల పేర చోళపురం అనే గ్రామాన్ని స్థాపించు కున్నారు. అదీనాడు షోలీపురం. ఈ వట్టెం గ్రామం ఈ 300 గ్రామాలలో ముఖ్యమైనది.ఈ గ్రామానికి మొదట లింగాపురమని పేరు.ఈ గ్రామం పూర్వం శ్రోత్రియాగ్రహారం. దీన్ని చింతలపల్లివారు, గంగాపురం వారు, ఖండవల్లి వారు అనే మూడు కుటుంబాలకు కలిపి రెడ్డిరాజులు అగ్రహారంగా ఉండేది. వీరికి ముందు నుంచే చోళుల కాలం నుంచే చాలా మంది కవి పండితులు నివశించేవారు. వారిలో ముఖ్యులు అప్పయ కవి. అటుపై చింతలపల్లి ఎల్లనార్యుడు.
 
== గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/వట్టెం" నుండి వెలికితీశారు