వేరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 29:
[[కాంతి]], [[నీరు]], [[ఖనిజ లవణాలు]], [[గాలి]] వంటి వాతావరణ కారకాలు తగినంతగా లేకపోతే మొక్కలు జీవించలేవు. మనుగడ కోసం జరిగే పోరాటంలో మొక్కలు వివిధ ఆవాసాల్లో జీవించవలసి ఉంటుంది. ఇటువంటి కొన్ని పరిసరాల్లో మొక్కలు జీవించాలంటే వాటిలోని వివిధ అంగాలు వాటి సామాన్య విధులతో పాటుగా కొన్ని ప్రత్యేక విధులు కూడా నిర్వర్తించవలసి ఉంటుంది. ఇట్లా ప్రత్యేక విధులు నిర్వర్తించుటకు వేరు ఏర్పరుచుకున్న వివిధ వైవిధ్య నిర్మాణాత్మకమైన శాశ్వత మార్పులను 'వేరు రూపాంతరాలు' అంటారు.
 
[[File:Aerial root.jpg|thumb|ఊడవేళ్ళు]]
=== దుంప వేళ్ళు ===
{{main|దుంప}}
Line 36 ⟶ 37:
=== ఊడ వేళ్ళు ===
కొన్ని వృక్షాలలో మొదలు నుండి శాఖలు బయలుదేరి చాలా దూరం వరకు విస్తరిస్తాయి. ఇట్లాంటి శాఖలు నిలబడటానికి కొంత యాంత్రిక శక్తి అవసరం. శాఖలు వంగిపోకుండా వాటికి ఆధారంగా కొన్ని అబ్బురపు వేళ్ళు ఉద్భవించి భూమిలోకి చేరుతాయి. ఇవి స్తంభాలవలె నిలబడి విస్తరించిన శాఖలకు అధనపు ఆధారాన్ని ఇస్తాయి. ఇట్లాంటి వాయుగత వేళ్ళనే ఊడవేళ్ళు అంటారు. ఉదా: [[మెరేసి]] కుటుంబానికి చెందిన [[మర్రి]], [[జువ్వి]] వంటి వృక్షాలలో ఈ వేళ్ళను చూడవచ్చు.
[[File:Prop roots of Maize plant.jpg|thumb|మొక్కజొన్నలో ఊతవేళ్ళు]]
 
=== ఊత వేళ్ళు ===
కొన్ని మొక్కలలో కాండం ఏటవాలుగా వృద్ధి చెందుతుంది. ఇట్లాంటి కాండానికి ఆధారం ఇవ్వడానికి కాండం నుండి కొన్ని అబ్బురపు వేళ్ళు వృద్ధి చెంది భూమిలోకి చేరుతాయి. ఉదా: [[మొగలి]]
Line 42 ⟶ 43:
=== ఎగబ్రాకే వేళ్ళు ===
కాండం బలహీనంగా ఉన్న మొక్కలలో ఈ వేళ్ళు ఉంటాయి. మొక్కలు వృద్ధి చెందటానికి, అన్ని పత్రాలకు సూర్యరశ్మి తాకడానికి ఇలాంటి మొక్కలు ఏదో ఒకటి ఆధారం చేసుకొని పైకి ఎగబాకుతాయి. మొక్కలు ఎగబాకటానికి అనువుగా కాండం నుండి ఉద్భవించే వేళ్ళనే ఎగబ్రాకే వేళ్ళు అంటారు. ఉదా: [[తమలపాకు]]
[[File:Pistiabotanical.jpg|thumb|పిస్టియాలో సంతులనం జరిపే వేళ్ళు]]
 
=== సంతులనం జరిపే వేళ్ళు ===
ఈ వేళ్ళను కొన్ని నీటి మొక్కలలో చూడవచ్చు. ఈ నీటి మొక్కలలో కణుపు భాగాల నుండి కొన్ని అబ్బురపు వేళ్ళు గుంపులుగా ఏర్పడతాయి. ఈ వేళ్ళు మొక్కను నీటిలో నిశ్చలంగా ఉంచటానికి,నీటి గాలి కెరటాల వలన మొక్క తలకిందులైనా తిరిగి యథాస్థితికి తీసుకరావటానికి ఈ వేళ్ళు ఉపయోగపడతాయి. ఉదా: [[పిస్టియా]]
[[File:Mangroves in Kannur, India.jpg|thumb|ఉప్పునీటి మొక్కలలో శ్వాసవేళ్ళు]]
 
=== శ్వాస వేళ్ళు ===
ఉప్పు నీటి మొక్కలు గాలి చొరబడని బురదనీటి ప్రాంతాలలో పెరుగుతాయి. వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ పెరుగుటకు మొక్కకు ఆక్సిజన్ ఎంతో అవసరం. లేని పక్షంలో మొక్కలు గిడసబారిపోతాయి. అందుకే ఉప్పునీటి మొక్కలు గాలిని తీసుకోవడానికి వీలుగా ఉండే వేరు వ్యవస్థను ఏర్పటు చేసుకుంటాయి. ఈ వేళ్ళనే ''న్యూమాటోఫోరులు '' అంటారు. ఇవి భూమ్యాకర్షణశక్తికి వ్యతిరేకంగా పెరిగి వాయుగతంగా వృద్ధి చెందుతాయి. వీటిపై అనేక శ్వాసరంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా గాలిని గ్రహించి మొక్కలు శ్వాసక్రియను జరుపుకుంటాయి. ఈ విధంగా శ్వాసక్రియకు సహకరించే వేళ్ళనే శ్వాసవేళ్ళు అంటారు. ఉదా: [[అవిసినియా]], [[రైజోఫొరా]]
"https://te.wikipedia.org/wiki/వేరు" నుండి వెలికితీశారు