మల్లాది రామకృష్ణశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

→‎జీవిత విశేషాలు: తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయులు మల్లాది రామకృష్ణ శాస్త్రి.
పంక్తి 36:
'''మల్లాది రామకృష్ణ శాస్త్రి''' (1905- 1965) ప్రముఖ తెలుగు రచయిత.<ref> రామకృష్ణశాస్త్రి, మల్లాది, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీలు: 515-6.</ref>
==జీవిత విశేషాలు==
వచన రచనకు మేస్త్రీ - మల్లాది రామకృష్ణ శాస్త్రి. ఆయన [[1905]], [[జూన్ 17]]న [[కృష్ణా జిల్లా]], [[చిట్టిగూడూరు]] గ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో కనకవల్లి, నరసింహశాస్త్రి దంపతులకు జన్మించారు. [[మచిలీపట్నం]]లో బి.ఎ. వరకు చదివారు. తరువాత [[మద్రాసు]]లో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. నలభైకి పైగా భాషలమీద ఆయా భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత కలిగిన, అనేక శాస్త్రాలపై పట్టుకలిగిన విద్వన్మణి శాస్త్రిగారు (దాదాపు వందకి పైగా భాషల్లో వీరు పండితులని కొందరు చెబుతూ ఉంటారు). యడవల్లి సుబ్బావధాన్లుగారి దగ్గర వేదవిద్యను, నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి దగ్గర మహాభాష్యాన్ని, శిష్ట్లా నరసింహశాస్త్రి గారి దగ్గర బ్రహ్మసూత్రాలను అభ్యసించారు. నాట్యకళలో, చిత్రలేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది. మొదట మచిలీపట్నంలోనే స్థిర నివాసం. తర్వాత కొంతకాలంపాటు గుంటూరులో కాపురం. 15వ ఏట [[పురాణం సూరిశాస్త్రి|పురాణం సూరిశాస్త్రి గారి]] కుమార్తె వెంకటరమణతో [[వివాహం]] జరిగింది. ఈ దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రామకృష్ణశాస్త్రిగారు కొంతకాలంపాటు గుంటూరులో పాములపాటి వెంకట కృష్ణయ్యచౌదరి నడిపే [[దేశాభిమాని]] పత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశారు. చిన్నతనంనుంచే వీరు రాసిన వ్యాసాలు, కథలు పలు పత్రికల్లో అచ్చయ్యాయి. శాస్త్రిగారు రాసిన పలు నాటకాలు, నవలలు వారికి చిరకీర్తిని ఆర్జించిపెట్టాయి. కృష్ణాతీరం అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి గడించింది. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్దర్శకులు [[గూడవల్లి రామబ్రహ్మం]] ‘[[పల్నాటి యుద్ధం (1947 సినిమా)|పల్నాటియుద్ధం]]’ సినిమా రచనకు సంబంధించి సలహాలకోసం శాస్త్రిగారిని మద్రాసుకు ఆహ్వానించారు. అలా [[1945]], [[మార్చి 24]]న మద్రాసులో అడుగుపెట్టిన రామకృష్ణ శాస్త్రిగారు తర్వాతి కాలంలో తెలుగు చలన చిత్ర సీమకు సరికొత్త భాషాపరమైన సొబగుల్ని మాటలు, పాటల ద్వారా పరిచయం చేసి కొత్త ఒరవడికి నాందీ పలికారు. మద్రాసులో చాలాకాలంపాటు [[సముద్రాల రాఘవాచార్య|సముద్రాల రాఘవాచార్యకూ]] మల్లాది రామకృష్ణశాస్త్రికీ చక్కటి సాన్నిహిత్యం ఉండేది. రామకృష్ణ శాస్త్రి చాలాకాలంపాటు తెలుగు సినీ పరిశ్రమలో "ఘోస్ట్ రైటర్"గా ఉన్నారు. 1952కు ముందు సినిమాల్లో చాలావాటిల్లో వీరి పేరు ఉండేదికాదని పలువురు సినీ ప్రముఖులు చెబుతారు. [[చిన్న కోడలు (1952 సినిమా)|చిన్న కోడలు]] చిత్రంతో శాస్త్రిగారు అజ్ఞాతవాసాన్ని వీడి తెరమీదికొచ్చారు. తన సొంత పేరుతో 39 చిత్రాలలో 200కు పైగా పాటలను రాశారు. మద్రాసులోని పానగల్లుపార్కులో ఓ చెట్టుకింద ఉన్న రాతిబల్లమీద కూర్చుని సాయంత్రం వేళ్లలో విద్వత్సభలను నడిపేవారు. ఈ సభల్లో అనేక శాస్త్రాలకు సంబంధించి, అనేక విషయాలకు సంబంధించి, అనేక రంగాలకు సంబంధించి, భాషకు, భావనికీభావానికీ, అభివ్యక్తికీ సంబంధించి అనర్గళంగా మాట్లాడేవారు. ఎందరో వర్థమాన కవులకు, రచయితలకు సందేహాలను నివృత్తి చేసేవారు.<ref name=పైడిపాల>{{cite book|last1=పైడిపాల|title=తెలుగు సినీ గేయ కవుల చరిత్ర|date=2010|publisher=స్నేహ ప్రచురణలు|location=చెన్నై|pages=72-77|edition=ప్రథమ|accessdate=1 December 2016}}</ref>,<ref name=గోతెలుగు>{{cite journal|last1=టీవీయస్|first1=శాస్త్రి|title=సుశాస్త్రీయం: సినీ పాటల శాస్త్రి - శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు|journal=గో తెలుగు|date=1 November 2013|issue=33|url=http://www.gotelugu.com/issue33/919/telugu-columns/sri-malladi-ramakrishna-sastrybiography/|accessdate=1 December 2016}}</ref>.
 
== రచనలు ==