దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి →‎చరిత్ర: clean up, replaced: ఆయన → అతను (10), typos fixed: ె → ే
పంక్తి 4:
 
== చరిత్ర ==
భారతీయ సినిమా పరిశ్రమ [[ప్రపంచం]]లోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి వినోదాన్ని, ఆటవిడుపునూ అందిస్తున్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేరుగాంచింది [[దాదాసాహెబ్ ఫాల్కే]]. ఆయనఅతను అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. [[నాసిక్]] పట్టణానికి 30కిలోమీటర్ల దూరంలోని [[త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరం|త్రియంబకేశ్వరం]]లో జన్మించాడు. [[బొంబాయి]] లోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, [[బరోడా]]లోని కళాభవన్‌లలో ఆయనఅతను విద్యాభ్యాసం చేశాడు.
 
1896లో ఆయనఅతను బొంబాయిలోని వాట్సన్ హోటల్‌లో [[ఏసుక్రీస్తు]] చరితం పై ప్రదర్శించబడిన సినిమాను చూడటం జరిగింది. ఆ ప్రభావంతో ఆయనఅతను హైందవ దేవతలను చూపుతూ సినిమాలు తియ్యాలన్న సంకల్పానికి వచ్చాడు. 1913లో ఆయనఅతను తీసిన [[రాజా హరిశ్చంద్ర (సినిమా)|రాజా హరిశ్చంద్ర]] సినిమాతో మొదలైన ఆయనఅతను సినీ జీవితం 19 సంవత్సరాలు సాగింది. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, స్క్రీన్‌ప్లే-రచయితగా ఈ కాలంలో ఆయనఅతను 95 చిత్రాలను, 26 లఘుచిత్రాలను రూపొందించాడు. తాను ఎంతో ధనం సంపాదించినా అదంతా కూడా ఆయనఅతను సినీపరిశ్రమకు తిరిగి ఖర్చుచేశాడు. సినిమా పరిశ్రమలోని వాణిజ్య పరమైన విషయాలను ఆయనఅతను పెద్దగా పట్టించుకోలేదని చెప్పొచ్చు. [[భారతదేశం]]లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఆయనఅతను ఎంతో కృషిచేశాడు.
 
భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే శతజయంతి సందర్భంగా 1969 లో దాదాసాహెబ్ ఫాల్కెఫాల్కే పురస్కారాన్ని [[భారత ప్రభుత్వం]] ఏర్పాటు చేసింది. భారతీయ చిత్ర వికాసంలో ఎనలేని కృషి చేసి, అద్భుత ప్రతిభా పాటవాలను కనబరిచే అతి కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే లభించే గౌరవం ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.
 
నటీనటులు, సంగీత దర్శకులు, ఛాయాగ్రాహకులు, నేపథ గాయకులు, పాటల రచయితలు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఒకరని కాదు చలనచిత్రాభివృద్ధికై విశిష్టంగా కృషి చేసిన ఎవరైనా ఈ అవార్డుకు అర్హులే. కానీ అంతటి విశిష్ట సేవ చేసిన వారు చాలా అరుదుగానే ఉంటారు. అందుకే చాలా అరుదైన వ్యక్తులు మాత్రమే పొందే బిరుదు ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.