అలెగ్జాండర్: కూర్పుల మధ్య తేడాలు

భారతదేశంలో ముందుకు పోలేమని చేతులెత్తేసిన సైన్యం - వ్యాఖ్య చేర్చాను
దండయాత్రల వివరాలు
పంక్తి 75:
[[దస్త్రం:Deer_hunt_mosaic_from_Pella.jpg|thumb|స్టాగ్ హంట్ మొజాయిక్ యొక్క చిహ్నం, {{circa|300&nbsp;BC}} , పెల్లా నుండి; కుడి వైపున ఉన్న బొమ్మ బహుశా అలెగ్జాండర్ అయి ఉండవచ్చు. మొజాయిక్ తేదీని బట్టి, మధ్య పాపిడి తీసి పైకి దువ్విన జుట్టును బట్టీ చెప్పవచ్చు; చిత్రంలో రెండు అంచుల గొడ్డలి పట్టుకుని ఉన్న వ్యక్తి హెఫెస్టియోన్ అలెగ్జాండర్ యొక్క నమ్మకమైన సహచరుడు అయి ఉండవచ్చు ఒకటి. <ref name="bare_url_a">{{Cite book|url=https://books.google.com/books?id=S-cTfNjEhrcC&pg=PA78|title=Alexander's Lovers|last=Chugg|first=Andrew|year=2006|isbn=9781411699601|page=78–79}}</ref>]]
సా.పూ. 326 వేసవిలో, ఒలింపియాస్ సోదరుడు, ఎపిరస్‌కు చెందిన అలెగ్జాండర్ I తో తన కుమార్తె క్లియోపాత్రా వివాహానికి ఫిలిప్‌ హాజరైనప్పుడు, అతని అంగరక్షకుల నాయకుడు కెప్టెన్ పౌసానియాస్ అతణ్ణి హత్య చేశాడు. {{Cref2|e}} పౌసానియాస్ తప్పించుకోవడానికి ప్రయత్నించగా అతనిని వెంబడించినవారు అతణ్ణి పట్టుకుని చంపారు. వీరిలో అలెగ్జాండర్ సహచరులు ఇద్దరు పెర్డిక్కాస్, లియోనాటస్ లు కూడా ఉన్నారు. అలెగ్జాండర్‌ను 20 సంవత్సరాల వయస్సులో ప్రభువులు, సైన్యమూ అక్కడికక్కడే రాజుగా ప్రకటించారు. {{Sfn|McCarty|2004|pp=30–31}} <ref>{{harvnb|Renault|2001|pp=61–62}}</ref> <ref name="Fox 1980 72">{{harvnb|Lane Fox|1980|p=72}}</ref>
 
=== బాల్కన్ దండయాత్ర ===
[[దస్త్రం:The_Macedonian_phalanx_counter-attacks_during_the_battle_of_the_carts.jpg|thumb|క్రీస్తుపూర్వం 335 లో థ్రేసియన్లకు వ్యతిరేకంగా "కార్ట్స్ యుద్ధం" వద్ద మాసిడోనియన్ ఫలాంక్స్.]]
ఆసియాకు వెళ్ళే ముందు, అలెగ్జాండర్ తన ఉత్తర సరిహద్దులను కాపాడుకోవాలనుకున్నాడు. సా.పూ. 335 వసంతకాలంలో అతను అనేక తిరుగుబాట్లను అణిచివేసాడు. యాంఫిపోలిస్‌తో మొదలుపెట్టి, తూర్పున "ఇండిపెండెంట్ థ్రేసియన్స్" దేశంలోకి వెళ్ళాడు; హేమస్ పర్వతం వద్ద, మాసిడోనియన్ సైన్యం థ్రేసియన్ దళాలపై దాడి చేసి ఓడించింది. మాసిడోనియన్లు ట్రిబాల్లి రాజ్యం లోకి ప్రవేశించి, వారి సైన్యాన్ని లిగినస్ నది <ref>{{harvnb|Arrian|1976|loc=I, 2}}</ref> ( డానుబే యొక్క ఉపనది ) సమీపంలో ఓడించారు. అలెగ్జాండర్ మూడు రోజుల పాటు ప్రయాణించి [[డాన్యూబ్|డానుబేకు]] వెళ్ళాడు. అవతలి ఒడ్డున [[Getae|గెటే]] తెగ మోహరించి ఉంది. ఆ రాత్రి నదిని దాటి, వారిపై దాడి చేసాడు. అశ్వికదళంతో చేసిన యుద్ధం తరువాత వారి సైన్యం పారిపోయీంది. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 3–4}}, {{harvnb|Renault|2001|pp=73–74}}</ref>
 
ఇల్లైరియా రాజు క్లేటస్, టౌలాంటీకి చెందిన గ్లౌకియాస్ తన అధికారానికి వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేసారన్న వార్త అలెగ్జాండరుకు చేరింది. పడమర వైపు తిరిగి ఇల్లిరియా వెళ్ళి, అలెగ్జాండర్ ఇద్దరినీ ఓడించాడు. ఇద్దరూ తమ దళాలతో పారిపోవాల్సి వచ్చింది. ఈ విజయాలతో, అతను తన ఉత్తర సరిహద్దును భద్రపరచుకున్నాడు. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 5–6}}, {{harvnb|Renault|2001|p=77}}</ref>
 
అలెగ్జాండర్ ఉత్తరాన దండయాత్రలో ఉండగా, థేబన్లు, ఎథీనియన్లు మరోసారి తిరుగుబాటు చేశారు. అలెగ్జాండర్ వెంటనే దక్షిణ దిశగా వెళ్లాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=192}} ఇతర నగరాలు మళ్ళీ సంశయించగా, థెబెస్ పోరాడాలని నిర్ణయించుకున్నాడు. థెబాన్ ప్రతిఘటన గొప్పదేమీ కాదు. అలెగ్జాండర్ ఆ నగరాన్ని ధ్వంసం చేశాడు. దాని భూభాగాన్ని ఇతర బోటియన్ నగరాలకు పంచేసాడు. థెబెస్ ముగింపు ఏథెన్స్‌ను భయపెట్టి, గ్రీస్ మొత్తాన్ని తాత్కాలికంగా శాంతింపజేసింది. {{Sfn|Roisman|Worthington|2010|p=192}} అలెగ్జాండర్ యాంటిపేటర్‌ను రాజప్రతినిధిగా ఉంచి తన ఆసియా దండయాత్రకు బయలుదేరాడు, . <ref name="Roisman 2010 1992">{{harvnb|Roisman|Worthington|2010|p=199}}</ref>
 
పురాతన రచయితల డెమోస్థనీస్ అలెగ్జాండర్ "మార్గిటెస్" అనీ,<ref>[http://www.perseus.tufts.edu/hopper/text?doc=urn:cts:greekLit:tlg0026.tlg003.perseus-grc1:160 Aeschines, Against Ctesiphon, §160]</ref> <ref name="Harpokration">[http://www.perseus.tufts.edu/hopper/text?doc=Perseus%3Atext%3A2013.01.0002%3Aletter%3Dm%3Aentry%3Dmargites Harpokration, Lexicon of the Ten Orators, § m6]</ref> <ref name="Plutach_Demosthenes">[http://www.perseus.tufts.edu/hopper/text?doc=urn:cts:greekLit:tlg0007.tlg054.perseus-grc1:23 Plutarch, Life of Demosthenes, §23]</ref> పిల్లాడనీ అన్నాడు. <ref name="Plutach_Demosthenes" /> అవివేకిని, పనికిరాని వాడినీ గ్రీకులు మార్గిటెస్ అనేవారు . <ref name="Harpokration" /> <ref>[http://www.perseus.tufts.edu/hopper/text?doc=urn:cts:greekLit:tlg2040.tlg002.perseus-grc1:8.#note1 Advice to Young Men on Greek Literature, Basil of Caesarea, § 8]</ref>
 
=== దండయాత్ర మ్యాపులు ===
<gallery mode="lines" widths="190" heights="190">
దస్త్రం:Alejandro Magno campaign 1 battles of Alexander The Great.png|అయోనియా 336 BC
దస్త్రం:Alejandro Magno campaign 2 battles of Alexander The Great.jpg|మీడియా మరియు ఈజిప్ట్ 333 BC
దస్త్రం:Alejandro Magno campaign 3 battles of Alexander The Great.jpg|పర్షియా 331 BC
దస్త్రం:Alejandro Magno campaign 4 battles of Alexander The Great.jpg|భారతదేశం క్రీ.పూ 326
</gallery>
 
== పర్షియన్ సామ్రాజ్యంపై విజయం ==
 
=== ఆసియా మైనర్ ===
[[దస్త్రం:MacedonEmpire.jpg|thumb|అలెగ్జాండర్ సామ్రాజ్యం మ్యాప్, అతని మార్గం]]
[[దస్త్రం:Alexander_cuts_the_Gordian_Knot.jpg|thumb|''అలెగ్జాండర్ కట్స్ ది గోర్డియన్ నాట్'' (1767) జీన్-సైమన్ బెర్తేలెమీ చేత]]
336 సా.పూ. నాటికే, [[మాసిడోన్‌కు చెందిన ఫిలిప్ II|ఫిలిప్ II]], పర్మేనియన్‌కు అమింటాస్, ఆండ్రోమెనెస్, అట్టాలస్ లను తోడిచ్చి, 10,000 మంది సైన్యంతో అనటోలియాకు పంపి ఉన్నాడు. [[అనటోలియా]] పశ్చిమ తీరంలోను, దీవులలోనూ నివసిస్తున్న గ్రీకులను ఆకేమినిడ్ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు ముట్టడికి సన్నాహాలు చేయడానికి వాళ్ళను పంపించాడు. <ref name="PB">{{Cite book|url=https://books.google.com/books?id=lxQ9W6F1oSYC&pg=PA817|title=From Cyrus to Alexander: A History of the Persian Empire|last=Briant|first=Pierre|date=2002|publisher=Eisenbrauns|isbn=978-1-57506-120-7|page=817|language=en}}</ref> <ref name="WH">{{Cite book|url=https://books.google.com/books?id=NR4Wn9VU8vkC&pg=PT205|title=Who's Who in the Age of Alexander the Great: Prosopography of Alexander's Empire|last=Heckel|first=Waldemar|date=2008|publisher=John Wiley & Sons|isbn=978-1-4051-5469-7|page=205|language=en}}</ref> మొదట్లో అన్నీ బాగానే సాగాయి. పశ్చిమ తీరంలో ఉన్న గ్రీకు నగరాలు అనటోలియాపై తిరుగుబాటు చేశాయి. కానీ, ఫిలిప్‌ను హత్య చేసారని, అతని తరువాత అతని చిన్న కుమారుడు అలెగ్జాండర్ రాజ్యాన్ని చేపట్టాడని వార్తలు చేరాయి. ఫిలిప్ మరణంతో మాసిడోనియన్లు నిరాశకు గురయ్యారు. మెగ్నీషియా సమీపంలో అకిమెనిడ్ల కిరాయి సైనికుడు మెమ్నోన్ ఆఫ్ రోడ్స్ ఆధ్వర్యంలో ఉన్న సైన్యం చేతిలో ఓడిపోయారు. <ref name="PB" /> <ref name="WH" />
 
ఫిలిప్ II తలపెట్టిన ఆక్రమణ ప్రాజెక్టును అలెగ్జాండర్ చేపట్టాడు. మాసెడోన్ నుండి, వివిధ గ్రీకు నగర రాజ్యాల సైన్యాన్ని, కిరాయి సైనికులను, [[త్రేస్]], పైనోయియా, ఇల్లీరియాల లోని ఫ్యూడల్ సైన్యాన్నీ సమీకరించాడు. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 11}}</ref> {{Cref2|f}} సుమారు 48,100 సైనికులు, 6,100 అశ్వికదళంతో, 38,000 మంది నావిక సైన్యంతో 120 ఓడలతో {{Sfn|Roisman|Worthington|2010|p=192}} కూడుకున్న అలెగ్జాండర్ సైన్యం సా.పూ. 334 లో హెలెస్పాంట్ దాటింది. ఆసియా మట్టిలోకి ఈటెను విసిరి, ఆసియాను దేవతల బహుమతిగా అంగీకరించానని చెప్పడం ద్వారా పర్షియన్ సామ్రాజ్యాన్ని పూర్తిగా జయించాలనే తన ఉద్దేశాన్ని చూపించాడు. దౌత్యానికి తన తండ్రి ఇచ్చిన ప్రాధాన్యతకు విరుద్ధంగా, అలెగ్జాండర్, పోరాడటానికి ఉత్సుకత చూపించాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=192}}
 
గ్రానికస్ యుద్ధంలో పర్షియన్ దళాలపై సాధించిన తొలి విజయం తరువాత, అలెగ్జాండర్ పర్షియన్ ప్రావిన్షియల్ రాజధాని, సర్దిస్ ఖజానా లొంగిపోవడాన్ని అంగీకరించాడు; తరువాత అతను అయోనియన్ తీరం వెంబడి ఉన్న నగరాలకు స్వయంప్రతిపత్తిని, ప్రజాస్వామ్యాన్నీ మంజూరు చేశాడు. అకిమెనిడ్ దళాల స్వాధీనంలో ఉన్న మిలేటస్‌కు సమీపంలో పర్షియన్ నావికా దళాలు ఉండడంతో, జాగ్రత్తతో కూడుకున్న ముట్టడి అవసరం. మరింత దక్షిణంలో, కార్నియా లోని హాలికార్నస్సస్‌ వద్ద అలెగ్జాండర్ తన మొదటి భారీ ముట్టడిని చేపట్టాడు. ప్రత్యర్థులైన కిరాయి సైనిక నాయకుడు రోడెస్ కు చెందిన మెమ్నాన్, కారియాలోని పర్షియన్ సామంత రాజు ఒరోంటోబాటెస్ లు అలెగ్జాండర్ చేతిలో ఓడిపోయి, ఓడల్లో పారిపోయారు. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 20–23}}</ref> కారియా ప్రభుత్వాన్ని హెకాటోమ్నిడ్ రాజవంశస్థుడు అడాకు అప్పగించాడు. అతను అలెగ్జాండర్‌ కు సామంతుడయ్యాడు. <ref name="Arrian 1976 loc=I, 23">{{harvnb|Arrian|1976|loc=I, 23}}</ref>
 
హాలికర్నాసస్ నుండి, అలెగ్జాండర్ పర్వత ప్రాంతమైన లైసియా లోకి, పాంఫిలియన్ మైదానంలోకీ వెళ్ళాడు. అన్ని తీర నగరాలను స్వాధీనపరచుకున్నాడు. దీంతో పర్షియన్లకు నావికా స్థావరాలు లేకుండ్ పోయాయి. పాంఫిలియా తరువాత ఇక పెద్ద ఓడరేవులేమీ లేవు. దాంతో అలెగ్జాండర్ ఇక లోతట్టు ప్రాంతం వైపు తిరిగాడు. టెర్మెస్సోస్ వద్ద, అలెగ్జాండర్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కాని ఆ పిసిడియన్ నగరాన్ని ముట్టడించలేదు. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 27–28}}</ref> పురాతన ఫ్రిజియన్ రాజధాని గోర్డియం వద్ద, అప్పటివరకు పరిష్కరించలేని గోర్డియన్ ముడిని "ఊడదీసాడు". ఈ ఘనత సాధించగలిగేది, భవిష్యత్ " ఆసియా రాజు" మాత్రమే ననే ప్రతీతి ఉండేది. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 3}}</ref> ఓ కథనం ఇలా ఉంది: ముడిని ఎలా ఊడదీసామనేది పట్టించుకోవాల్సిన సంగతి కాదని చెబుతూ అలెగ్జాండర్ కత్తితో దాన్ని నరికేసాడు. <ref>{{harvnb|Green|2007|p=351}}</ref>
 
=== ది లెవాంట్, సిరియా ===
క్రీస్తుపూర్వం 333 వసంతకాలంలో, అలెగ్జాండర్ టారస్ ను దాటి సిలీసియాలోకి ప్రవేశించాడు. అనారోగ్యం కారణంగా చాన్నాళ్ళ పాటు విరామం తీసుకుని ఆ తరువాత సిరియా వైపు వెళ్ళాడు. డారియస్ కున్న పెద్ద సైన్యం అలెగ్జాండరును అధిగమించినప్పటికీ, అతను తిరిగి సిలిసియాకు వెళ్ళాడు. అక్కడ అతను ఇస్సస్ వద్ద డారియస్ను ఓడించాడు. డారియస్, భార్యనూ ఇద్దరు కుమార్తెలనూ తల్లి సిసిగాంబిస్‌నూ, అద్భుతమైన సంపదనూ విడిచిపెట్టి యుద్ధం నుండి పారిపోయాడు. అతని సైన్యం కూలిపోయింది. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 11–12}}</ref> తాను అప్పటికే పోగొట్టుకున్న భూములను, తన కుటుంబాన్ని వదిలేసేందుకు 10,000 టాలెంట్ల సొమ్ము ఇచ్చేలా డారియస్ ఒక శాంతి ప్రతిపాదన పంపాడు. ఇచ్చాడు. అలెగ్జాండర్, తానిపుడు ఆసియా రాజు కాబట్టి, ప్రాదేశిక విభజనలు, సరిహద్దులను నిర్ణయించాల్సింది తానేనని అలెగ్జాండర్ బదులిచ్చాడు. <ref>[http://www.gutenberg.org/files/46976/46976-h/46976-h.htm The Anabasis of Alexander/Book II/Chapter XIV/Darius's Letter, and Alexander's Reply – Arrian]</ref> అలెగ్జాండర్ సిరియాను, లెవాంట్ తీరంలో ఎక్కువ భాగాన్నీ స్వాధీనం చేసుకున్నాడు. <ref name="Arrian 1976 loc=I, 23" /> తరువాతి సంవత్సరంలో, 332 &nbsp; సా.పూ, అతను టైర్‌పై దాడి చేయవలసి వచ్చింది. చాలా కష్టపడి, సుదీర్ఘమైన ముట్టడి తరువాత దాన్ని స్వాధీనపరచు కున్నాడు. <ref>{{harvnb|Arrian|1976|loc=II, 16–24}}</ref> <ref>{{harvnb|Gunther|2007|p=84}}</ref> సైనిక వయస్సు గల పురుషులను ఊచకోత కోసాడు. స్త్రీలు, పిల్లలను [[బానిసత్వం|బానిసలుగా]] అమ్మేసాడు. <ref>{{harvnb|Sabin|van Wees|Whitby|2007|p=396}}</ref>
 
=== ఈజిప్ట్ ===
[[దస్త్రం:Name_of_Alexander_the_Great_in_Hieroglyphs_circa_330_BCE.jpg|thumb|ఈజిప్టు చిత్రలిపిలో అలెగ్జాండర్ ది గ్రేట్ పేరు (కుడి నుండి ఎడమకు వ్రాయబడింది), {{circa|332&nbsp;BC}} , ఈజిప్ట్. [[లౌవ్రే మ్యూజియం]]]]
అలెగ్జాండర్ టైర్‌ను నాశనం చేసినప్పుడు, [[ఈజిప్టు|ఈజిప్ట్]] దారిలో ఉన్న చాలా పట్టణాలు త్వరత్వరగా లొంగిపోయాయి. అయితే, అలెగ్జాండర్ గాజాలో ప్రతిఘటనను ఎదుర్కొన్నాడు. ఈ దుర్గాన్ని భారీ గోడలతో గుట్టపై కట్టారు. దాన్ని గెలవాలంటే ముట్టడి అవసరం. "ఎత్తాటి దిబ్బ కారణంగా అది అసాధ్యమని అతని ఇంజనీర్లు ఎత్తి చూపినప్పుడు ...అది అలెగ్జాండర్‌ను మరింతగా ప్రోత్సహించింది". <ref>{{harvnb|Arrian|1976|loc=II, 26}}</ref> మూడు సార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాక, కోట అలెగ్జాండరు వశమైంది, కాని అలెగ్జాండర్‌కు భుజంపై తీవ్రమైన గాయమైంది. టైర్‌లో లాగానే, సైనిక వయస్సు గల పురుషులను కత్తికి బలిపెట్టారు. స్త్రీలు, పిల్లలను బానిసలుగా అమ్మేసారు. <ref>{{harvnb|Arrian|1976|loc=II, 26–27}}</ref>
 
అలెగ్జాండర్ తరువాత సా.పూ. 332 లో ఈజిప్టుపైకి వెళ్ళాడు. అక్కడ అతన్ని ముక్తిప్రదాతగా కీర్తించారు. <ref>{{harvnb|Ring|Salkin|Berney|Schellinger|1994|pp=49, 320}}</ref> లిబియా ఎడారిలోని ఒరాకిల్ ఆఫ్ సివా ఒయాసిస్ వద్ద ఉండే అమున్ దేవత కుమారుడిగా అతన్ని ప్రకటించారు. {{Sfn|Bosworth|1988|pp=71–74}} ఆ తరువాత, జియస్-అమ్మోన్‌ను తన నిజమైన తండ్రి అని చెప్పేవాడు. అతని మరణం తరువాత, నాణేలపై అతని దైవత్వానికి చిహ్నంగా అతని బొమ్మకు అమ్మోన్‌ కొమ్ములతో అలంకరించేవారు. <ref>{{harvnb|Dahmen|2007|pp=10–11}}</ref> ఈజిప్టులో ఉన్న సమయంలో, అతను [[అలెగ్జాండ్రియా]] నగరాన్ని స్థాపించాడు. ఇది, అతని మరణం తరువాత టోలెమిక్ రాజ్యానికి సుసంపన్న రాజధాని అవుతుంది. <ref>{{harvnb|Arrian|1976|loc=III, 1}}</ref>
 
=== అస్సీరియా, బాబిలోనియా ===
సా.పూ. 331 లో ఈజిప్టును వదలి అలెగ్జాండర్, తూర్పు వైపు [[మెసొపొటేమియా నాగరికత|మెసొపొటేమియా]] (ఇప్పుడు ఉత్తర [[ఇరాక్]] ) లోకి వెళ్ళాడు. గౌగమెలా యుద్ధంలో డారియస్‌ను ఓడించాడు. <ref>{{harvnb|Arrian|1976|loc=III 7–15}}; also in a [https://www.livius.org/aj-al/alexander/alexander_t40.html contemporary Babylonian account of the battle of Gaugamela]</ref> డారియస్ మళ్ళీ యుద్ధభూమి నుండి పారిపోయాడు. అలెగ్జాండర్ అతన్ని అర్బెలా వరకు వెంబడించాడు. గౌగమెలా ఇద్దరి మధ్య జరిగిన యుద్ధాల్లో చివరిదీ, నిర్ణయాత్మకమైనదీను. డారియస్ పర్వతాల మీదుగా ఎక్బాటానా (ఆధునిక హమదాన్ ) కు పారిపోగా, అలెగ్జాండర్ [[బాబిలోన్|బాబిలోన్ ను]] స్వాధీనం చేసుకున్నాడు.
 
=== పర్షియా ===
[[దస్త్రం:2persian_gate_wall.JPG|thumb|పర్షియన్ గేట్. ఈ రహదారి 1990 లలో నిర్మించారు.]]
బాబిలోన్ నుండి, అలెగ్జాండర్ అకిమెనిడ్ రాజధానులలో ఒకటైన సూసా వెళ్లి దాని ఖజానాను స్వాధీనం చేసుకున్నాడు. అతను తన సైన్యంలో ఎక్కువ భాగాన్ని పర్షియన్ [[రాయల్ రోడ్డు|రాయల్ రోడ్]] ద్వారా పర్షియన్ రాజధాని పెర్సెపోలిస్‌కు పంపించాడు. అలెగ్జాండర్ ఎంపిక చేసిన దళాలను తీసుకుని, తానే స్వయంగా సూటి మార్గంలో నగరానికి వెళ్ళాడు. పర్షియన్ గేట్స్ (ఆధునిక [[జాగ్రోస్ పర్వతాలు|జాగ్రోస్ పర్వతాలలో]] ) పాస్ ను ముట్టడించాడు. అక్కడ కాపలాగా ఉన్న అరియోబార్జనేస్ నేతృత్వం లోని పర్షియన్ సైన్యాన్నిఓడించి, తరువాత దాని పర్షియన్ సైనికులు దాని ఖజానాను దోచుకునే లోపే హడావుడిగా పెర్సెపోలిస్‌కు వెళ్ళాడు. <ref>{{harvnb|Arrian|1976|loc=III, 18}}</ref>
 
పెర్సెపోలిస్‌లోకి ప్రవేశించాక, అలెగ్జాండర్ తన దళాలను చాలా రోజుల పాటు నగరాన్ని దోచుకోవడానికి అనుమతించాడు. <ref>{{harvnb|Foreman|2004|page=152}}</ref> అలెగ్జాండర్ ఐదు నెలలు పెర్సెపోలిస్‌లో ఉన్నాడు. {{Sfn|Morkot|1996|p=121}} అతడు అక్కడ ఉండగా, జెర్క్సెస్ I యొక్క తూర్పు రాజభవనంలో మంటలు చెలరేగి, నగరమంతా వ్యాపించాయి. తాగిన మత్తులో జరిగిన ప్రమాదం కావచ్చు. లేదా రెండవ పర్షియన్ యుద్ధంలో జెర్క్సేస్ ఏథెన్స్ లోని అక్రోపోలిస్‌ను తగలబెట్టిన దానికి ప్రతీకారంగా తగలబెట్టి ఉండవచ్చు; {{Sfn|Hammond|1983|pp=72–73}} అలెగ్జాండర్ సహచరుడు, హెటెరా థాయిస్, రెచ్చగొట్టి, మంటలను అంటింపజేసాడని ప్లూటార్క్, డయోడోరస్ లు అన్నారు. నగరం కాలిపోవడాన్ని చూస్తూ, అలెగ్జాండర్ తన నిర్ణయానికి చింతించాడు. <ref name="Yenne2010">{{Cite book|url=https://books.google.com/books?id=kngnd0GlUc4C&pg=PA99|title=Alexander the Great: Lessons from History's Undefeated General|last=Yenne|first=Bill|date=2010|publisher=Palgrave Macmillan|isbn=978-0-230-61915-9|location=New York City|page=99|ref=harv}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/books?id=v550aeZcGowC&pg=PA213|title=Alexander the Great|last=Freeman|first=Philip|date=2011|publisher=Simon & Schuster Paperbacks|isbn=978-1-4391-9328-0|location=New York City|page=213|ref=harv}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/books?id=6wl0xMQCW40C&pg=PA109|title=Alexander the Great and His Empire: A Short Introduction|last=Briant|first=Pierre|date=2010|publisher=Princeton University Press|isbn=978-0-691-15445-9|location=Princeton, NJ|page=109|ref=harv|orig-year=1974}}</ref> మంటలను ఆర్పమని తన మనుష్యులను ఆదేశించాడని ప్లూటార్క్ పేర్కొన్నాడు. <ref name="Yenne2010" /> కాని అప్పటికే మంటలు నగరంలోని చాలా ప్రాంతాలకు వ్యాపించాయి. <ref name="Yenne2010" /> మరుసటి ఉదయం వరకు అలెగ్జాండర్ తన నిర్ణయం పట్ల చింతించలేదని కర్టియస్ పేర్కొన్నాడు. <ref name="Yenne2010" /> ప్లూటార్క్ ఒక వృత్తాంతాన్ని వివరించాడు - అలెగ్జాండర్ కూలిపోయిన జెర్క్సేస్ విగ్రహం వద్ద ఆగి, ఏదో బతికి ఉన్న వ్యక్తితో మాట్లాడినట్లుగా మాట్లాడతాడు:
 
=== పర్షియా సామ్రాజ్య పతనం, ఆపై తూర్పుకు ===
[[దస్త్రం:KINGS_of_MACEDON_Alexander_III_the_Great_336-323_BC.jpg|thumb|అలెగ్జాండర్ సమకాలిక చిత్రణ: ఈ నాణెం ఢీకొట్టింది [[Balakros]] లేదా అతని వారసుడు [[మేనస్]], రెండు మాజీ ''[[somatophylakes]]'' వారు పదవిని ఉన్నప్పుడు అలెగ్జాండర్, (అంగరక్షకులు) [[సాత్రపాలు|సామంత]] యొక్క [[సిలీసియా]] సిర్కా 333-327 అలెగ్జాండర్ జీవితకాలంలో BC. రివర్స్ కూర్చున్న జ్యూస్ అటోఫోరోస్‌ను చూపిస్తుంది. <ref>{{Cite book|url=https://www.cngcoins.com/Coin.aspx?CoinID=368240|title=CNG: Kings of Macedon. Alexander III 'the Great'. 336–323 BC. AR Tetradrachm (25mm, 17.15 g, 1h). Tarsos mint. Struck under Balakros or Menes, circa 333–327 BC.}}</ref>]]
అలెగ్జాండర్ డారియస్‌ను వెంబడించాడు. మొదట మీడియాలోకి, తరువాత పార్థియా లోకీ అతణ్ణి తరిమాడు. {{Sfn|Arrian|1976|loc=III, 19–20}} పర్షియన్ రాజు విధి ఇకపై అతడి చేతుల్లో లేదు. బాక్టీరియాలో డారియస్‌కు సామంతుడు, బంధువూ అయిన బెస్సస్ అతణ్ణి బంధించాడు. {{Sfn|Arrian|1976|loc=III, 21}} అలెగ్జాండరు వచ్చేలోపే, బెస్సస్ డారియస్‌ను పొడిచి చంపేసి, తనను తాను అర్టాజెర్క్సెస్ V పేరుతో డారియస్‌కు వారసుడిగా ప్రకటించుకున్నాడు. ఆపై మధ్య ఆసియా లోకి పారిపోయి, అలెగ్జాండరుపై గెరిల్లా యుద్ధాలకు దిగాడు. {{Sfn|Arrian|1976|loc=III, 21, 25}} అలెగ్జాండర్ డారియస్ భౌతిక కాయానికి అతడి అకిమెనిడ్ పూర్వీకుల పక్కనే రాచమర్యాదలతో ఖననం చేసాడు. {{Sfn|Arrian|1976|loc=III, 22}} చనిపోతున్నప్పుడు, డారియస్ తనను అకిమెనిడ్ సింహాసనానికి వారసుడిగా పేర్కొన్నాడని అలెగ్జాండర్ చెప్పాడు. {{Sfn|Gergel|2004|p=81}} డారియస్‌తో పాటే అకిమెనిడ్ సామ్రాజ్యం కూడా పతనమై పోయినట్లు భావిస్తారు. <ref>{{వెబ్ మూలము}}</ref>
 
అలెగ్జాండర్ బెస్సస్‌ను దోపిడీదారుడిగా భావించి అతనిని ఓడించడానికి బయలుదేరాడు. బెస్సస్‌కు వ్యతిరేకంగా మొదలైన ఈ ప్రచారం మధ్య ఆసియాలో గొప్ప పర్యటనగా మారింది. అలెగ్జాండర్ వరసబెట్టి కొత్త నగరాలను స్థాపించుకుంటూ పోయాడు. అన్నిటికీ ఒకటే పేరు - అలెగ్జాండ్రియా! ఆఫ్ఘనిస్తాన్లోని ఆధునిక కాందహార్, ఆధునిక [[తజికిస్తాన్|తజికిస్థాన్‌లో]] ఉన్న అలెగ్జాండ్రియా ఎషాటే ("సుదూరాన") లు కూడా అలెగ్జాండరు స్థాపించిన అలెగ్జాండ్రియాలే. ఈ దండయాత్రలో అలెగ్జాండర్, మీడియా, పార్థియా, అరియా (పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్), డ్రాంగియానా, అరాకోసియా (దక్షిణ, మధ్య ఆఫ్ఘనిస్తాన్), బాక్టీరియా (ఉత్తర, మధ్య ఆఫ్ఘనిస్తాన్) సిథియా ల గుండా వెళ్ళాడు. {{Sfn|Arrian|1976|loc=III, 23–25, 27–30; IV, 1–7}}
 
క్రీస్తుపూర్వం 329 లో, సోగ్డియానా సామంత రాజ్యంలో ఉండే స్పిటామెనెస్ (అక్కడ ఇతడి స్థాయి ఏమిటో తెలియరాలేదు) బెస్సస్‌కు ద్రోహం చేసి, అలెగ్జాండర్ యొక్క విశ్వసనీయ సహచరులలో ఒకరైన టోలెమీకి అతణ్ణి పట్టి ఇచ్చాడు. బెస్సస్‌ను వధించారు. {{Sfn|Arrian|1976|loc=III, 30}} అయితే, కొన్నాళ్ళ తరువాత, అలెగ్జాండర్ ఉన్నప్పుడు, జాక్సార్టెస్ నది వద్ద ఒక దేశద్రిమ్మరుల సైన్యంతో పోరాడుతూండగా, స్పిటామెనెస్ సోగ్డియానాలో తిరుగుబాటు లేవదీసాడు. జాక్సార్టెస్ యుద్ధంలో అలెగ్జాండర్ సిథియన్లను ఓడించాక, వెంటనే స్పైటామెనిస్‌పై దాడి చేసాడు., గబాయి యుద్ధంలో అతనిని ఓడించాడు. ఓటమి తరువాత, స్పిటామెనెస్‌ను అతడి సొంత మనుషులే చంపేసారు. ఆ తరువత వాళ్ళు అలెగ్జాండరుతో సంధి చేసుకున్నారు. {{Sfn|Arrian|1976|loc=IV, 5–6, 16–17}}
 
=== సమస్యలు, కుట్రలు ===
[[దస్త్రం:The_killing_of_Cleitus_by_Andre_Castaigne_(1898-1899)_reduced.jpg|thumb|''క్లెయిటస్ హత్య'', ఆండ్రే కాస్టైగ్నే (1898-1899)]]
ఈ సమయంలో, అలెగ్జాండర్ తన ఆస్థానంలో కొన్ని పర్షియన్ ఆహార్యాన్ని, ఆచారాలనూ అవలంబించాడు. ముఖ్యంగా ''ప్రోస్కైనెసిస్'' ఆచారం - చేతిని ముద్దాడడామ్ము, లేదా నేలపై సాష్టాంగపడటం. ఇవి పర్షియన్లు సాంఘికంగా ఉన్నత హోదాల్లో ఉండేవారి పట్ల ఈ మర్యాద చూపించేవారు. గ్రీకులు ఈ ఆచారాన్ని దేవతల పట్ల మాత్రమే పాటిస్తారు. అది తనకూ చెయ్యమంటున్నాడంటే అలెగ్జాండర్ తనను తాను దివంగా భావిస్తున్నాడని వారు అనుకున్నారు. ప్రజలకు అది నచ్చలేదు. దీంతో అతడు దేశప్రజల్లో సానుభూతి కోల్పోయాడు. చివరికి అతడు దానిని విడిచిపెట్టాడు. {{Sfn|Morkot|1996|p=111}}
 
అతణ్ణి చంపేందుకు చేసిన కుట్ర ఒకటి బయట పడింది. ఆ విషయమై అలెగ్జాండర్‌ను అప్రమత్తం చేయడంలో విఫలమైనందుకు అతని అధికారులలో ఒకరైన ఫిలోటస్‌ను ఉరితీశారు. కొడుకు చంపడం వలన తండ్రిని కూడా చంపాల్సి వచ్చింది. కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు చేస్తాడేమోనని భావించి, దాన్ని నివారించడానికి, ఎక్బాటానా వద్ద ఖజానాకు కాపలాగా ఉన్న పార్మేనియన్‌ను కూడా అలెగ్జాండర్ హత్య చేయించాడు. గ్రానికస్ వద్ద తన ప్రాణాలను కాపాడిన వ్యక్తి, క్లెయిటస్ ది బ్లాక్‌ను మరాకాండా ( [[ఉజ్బెకిస్తాన్|ఉజ్బెకిస్తాన్‌లో]] ఆధునిక సమర్కాండ్) వద్ద చంపేసాడు. అలెగ్జాండర్ అత్యంత అపఖ్యాతి పాలైన ఘటన ఇది. తాగుడు మైకంలో జరిగిన వాగ్వాదంలో అలెగ్జాండర్‌ అనేక తప్పిదాలకు పాల్పడ్డాడనీ, ముఖ్యంగా మాసిడోనియన్ పద్దతులను పక్కనబెట్టి, అవినీతిమయమైన ప్రాచ్య జీవనశైలికి అలవాటు పడ్డాడనీ క్లెయిటస్ అనడంతో అలెగ్జాండర్ అతణ్ణి చంపేసాడు. {{Sfn|Gergel|2004|p=99}}
 
తర్వాత, మధ్య ఆసియా దండయాత్రలో అతడిపై జరిగిన మరో కుట్ర బయట పడింది. ఇది అతడి స్వంత పరిచారకులే చేసారు. అతని అధికారిక చరిత్రకారుడు, ఒలింథస్కు చెందిన కాలిస్థెనీస్ ఈ కుట్రలో పాత్రధారి. ''అనాబాసిస్ ఆఫ్ అలెగ్జాండర్‌లో,'' కాలిస్టెనెస్‌ను ఇతర సేవకులనూ రాక్ మీద ఎక్కించి హింసించారని, వాళ్ళు వెంటనే మరణించి ఉండవచ్చనీ అరియన్ పేర్కొన్నాడు. <ref>[https://archive.org/stream/cu31924026460752/cu31924026460752_djvu.txt The Anabasis of Arrian]</ref> కాలిస్టెనెస్ వాస్తవానికి ఈ ప్లాట్‌లో పాల్గొన్నాడా అనేది అస్పష్టంగానే ఉంది, ఎందుకంటే అతనిపై ఈ ఆరోపణలు రాకముందే అతను ప్రోస్కైనిసిస్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని వ్యతిరేకించడంతో అతడు అలెగ్జాండరు ఆదరణ కోల్పోయాడు. <ref>{{harvnb|Heckel|Tritle|2009|pp=47–48}}</ref>
 
=== అలెగ్జాండర్ లేని మాసిడోన్ ===
అలెగ్జాండర్ ఆసియాకు బయలుదేరినప్పుడు, అనుభవజ్ఞుడైన సైనిక, రాజకీయ నాయకుడు, ఫిలిప్ II "నమ్మకస్తుల్లో" ఒకడైన తన సేనాధిపతి యాంటిపేటర్‌కు మాసిడోన్ బాధ్యతలను అప్పజెప్పాడు. <ref name="Roisman 2010 1992" /> అలెగ్జాండర్ థెబెస్‌ను తొలగించడంతో అలెగ్జాండరు లేనప్పుడు గ్రీస్ ప్రశాంతంగా ఉండిపోయింది. <ref name="Roisman 2010 1992" /> 331 లో స్పార్టన్ రాజు అగిస్ III చేసిన తిరుగుబాటు దీనికి ఒక మినహాయింపు. యాంటిపేటర్ ఇతణ్ణిఒ మెగాలోపాలిస్ యుద్ధంలో ఓడించి, చంపాడు. <ref name="Roisman 2010 1992" /> యాంటిపేటర్ స్పార్టాన్లకు ఇవ్వాల్సిన శిక్ష గురించి లీగ్ ఆఫ్ కొరింత్‌కు చెప్పాడు, వాళ్ళు అలెగ్జాండర్‌ను అడగ్గా అతడు క్షిక్షమించి వదిలెయ్యమన్నాడు. <ref>{{harvnb|Roisman|Worthington|2010|p=201}}</ref> యాంటిపేటర్‌కు, ఒలింపియాస్ మధ్య కూడా ఘర్షణ ఉంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు అలెగ్జాండరుకు ఫిర్యాదులు చేశారు. <ref>{{harvnb|Roisman|Worthington|2010|p=202}}</ref>
 
సాధారణంగా, ఆసియాలో అలెగ్జాండర్ దండయాత్ర సందర్భంగా గ్రీసులో శాంతి, సౌభాగ్యాలు విలసిల్లాయి. <ref>{{harvnb|Roisman|Worthington|2010|p=203}}</ref> అలెగ్జాండర్ తన విజయాల్లో లభించిన చాలా సంపదను గ్రీసుకు పంపాడు. ఇది ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచి, అతని సామ్రాజ్యమంతటా వాణిజ్యాన్ని పెంచింది. <ref>{{harvnb|Roisman|Worthington|2010|p=205}}</ref> అయితే, కొత్త దళాల కోసం అలెగ్జాండర్ నిరంతరం చేసే డిమాండ్ల వలన, అతని సామ్రాజ్యం అంతటా మాసిడోనియన్ల వలసలూ, మాసిడోన్ బలాన్ని తగ్గించాయి. అలెగ్జాండర్ తరువాత, సంవత్సరాలలో మాసెడోన్‌ బాగా బలహీనపడి పోయింది. చివరికి మూడవ మాసిడోనియన్ యుద్ధం లో(క్రీ.పూ. 171-168) రోమ్ దీన్ని అణచివేసింది.{{Sfn|Roisman|Worthington|2010|p=186}}
 
== భారత దేశంపై దండయాత్ర ==
"https://te.wikipedia.org/wiki/అలెగ్జాండర్" నుండి వెలికితీశారు