కాండం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 81:
 
==== నిశ్చిత శాఖీభవనం ====
ఈ రకమైన శాఖీభవనంలో కొన మొగ్గ శాఖల పెరుగుదలకు కొంత కాలం దొహదం చేసిన పిదప ఒక నిశ్చితాంగంగా రూపాంతరం చెందుతుంది. అంటే ముల్లుగానో, పుష్పంగానో , నులితీగగానో రూపాంతరం చెందుతుంది. ఈ శాఖీభవనం పలుమూడు (3) రకాలుగా కనిపిస్తుంది. అవి...i). నిశ్చిత బహుశాఖీయ శాఖీభవనం, ii. నిశ్చిత ద్విశాఖీయ శాఖీభవనం, iii. నిశ్చిత ఏకశాఖీయ శాఖీభవనం.
 
<br />{{Navbox
====== i). నిశ్చిత బహుశాఖీయ శాఖీభవనం: ======
కొనమొగ్గ రూపాంతరం చెందిన తరువాత మూడు గ్రీవపు మొగ్గల నుండి శాఖోత్పత్తి జరుగుతుంది. ఉదా: నీరియం (<nowiki>[[గన్నెరు]]</nowiki>)
 
====== ii. నిశ్చిత ద్విశాఖీయ శాఖీభవనం: ======
కొనమొగ్గ రూపాంతరం చెందిన తరువాత దాని కింద గల రెండు పత్రగ్రీవాల నుండి రెండు శాఖలు ఏర్పడుతాయి. ఉదా: దతూర [[ఉమ్మెత్త|(ఉమ్మెత్త]]).
 
====== iii. నిశ్చిత ఏకశాఖీయ శాఖీభవనం: ======
కొనమొగ్గ నిశ్చితాంగంగా అంతమైన తరువాత కింద ఉన్న ఏకాంతర పత్రగ్రీవం నుండి మొగ్గ పెరుగుదలను కొనసాగిస్తుంది. దీనివలన కొన మొగ్గ రూపాంతరాలు పత్రాభిముఖంగా ఉంటాయి. ఇది రెండు రకాలు. అవి. 1. నిశ్చిత ఏకశాఖీయ కుండలాకార శాఖీభవనం, 2. నిశ్చిత ఏకశాఖీయ వృశ్చికాకార శాఖీభనం.
 
1. నిశ్చిత ఏకశాఖీయ కుండలాకార శాఖీభవనం: కొనమొగ్గ రూపాంతరం చెందిన తరువాత ఏర్పడే శాఖలన్ని క్రమంగా ఒకే వైపునే వృద్ధి చెందుతాయి. ఉదా: టెర్మినేలియా కెటప్పా ([[బాదం]]).
 
2. నిశ్చిత ఏకశాఖీయ వృశ్చికాకార శాఖీభనం: కొనమొగ్గ రూపాంతరం చెందిన తరువాత ఏర్పడే శాఖలన్ని ఏకాంతర దిశలో ఏర్పడుతాయి. ఉదా: గాసిపియం ([[పత్తి]]).{{Navbox
|name = శాఖీభవనం
|titlestyle=background:lightgreen;
"https://te.wikipedia.org/wiki/కాండం" నుండి వెలికితీశారు