కోటంరాజు పున్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''కోటంరాజు పున్నయ్య''' పాత్రికేయుడు. ==బాల్యం== కోటంరాజు పున్...'
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోటంరాజు పున్నయ్య''' [[పాత్రికేయుడు]].
==బాల్యం==
కోటంరాజు పున్నయ్య 10 ఆగస్టు 1885న ప్రస్తుత ప్రకాశం జిల్లా చీరాలలో పుట్టాడు.<ref>[https://www.bhadas4media.com/kotamraju-punnaiah/ హిందూ ఎడిటర్ హూ బిల్ట్ మోడర్న్ సింధ్]</ref> కోటంరాజు నారాయణరావు-వెంకాయమ్మ తల్లిదండ్రులు. బాపట్ల, గుంటూరులలో చదువు సాగించాడు. మెట్రిక్యులేషన్ తప్పడంతో ఇంత్లో చెప్పాపెట్టకుండా ముంబై పారిపోయాడు. అక్కడ తిండి కోసం మేడ మీదకు నీళ్ళు మోసే ఉద్యోగం చేసాడు.
==ఉద్యోగం==
పరిచయం కొద్దీ కాశీనాథుని నాగేశ్వరరావు ఇతనిని అమృతాంజనం కార్యాలయంలో చేర్చుకున్నాడు. అనంతరం ప్రారంభించిన ఆంధ్రపత్రికలో చేరాడు. 1914లో మద్రాసు వెళ్ళి ఆంధ్రపత్రిక దినపత్రికలో సహాయ సంపాదకునిగా పనిచేసాడు. ఇంగ్లిష్ భాష మీద ఉన్న పట్టు వలన 1916లో హ్యూమానిటీ అనే ఆంగ్ల వారపత్రికను ప్రారంభించాడు. 1918లో సాధు వాస్వాని ఆహ్వానం మీద కరాచీ వెళ్ళి 'న్యూటైమ్స్' పత్రిక సహాయ సంపాదకునిగా పని చేసాడు. ఈ న్యూటైమ్స్ పత్రిక ఆపై 'సింధు అబ్జర్వర్' అనే మరో పత్రికలో కలిసిపోయింది. కొన్ని రోజులు సింధు అబ్జర్వర్ కు సహాయ సంపాదకునిగా పని చేసి, సంపాదకునిగా బాధ్యతలు స్వీకరించాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కోటంరాజు_పున్నయ్య" నుండి వెలికితీశారు