అన్నంభొట్టు: కూర్పుల మధ్య తేడాలు

గరికపాడు లింకు మార్చాను
తర్కసంగ్రహం
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
*తత్వబోధినీ టీకా
*మితాక్షరి
 
=== తర్కసంగ్రహము- తర్కసంగ్రహదీపిక లో కొన్ని ముఖ్య విషయములు===
వీటిలో ముఖ్య విషయములు: ప్రమాణములు, తర్కం, పరార్ధహేతు - సాధ్య తర్క విధానం.
==ప్రమాణములు==
ఇందులో ముఖ్య భాగములు
* జ్ఞానర్జన : వైదిక కర్మకాండల ద్వారా ముక్తిని పొందవచ్చునని మీమాంసికులు కొందరు తలచారు. ఇది సరికాదనీ అవి మనఃశుద్ధిని కలిగించేంతవరకే ఉపయోగపడతాయనీ, ఆ తరువాత చింతన, పరామర్సల ద్వారా సత్యాంవేషణ జరిపితే కాని మానవుడు ముక్తిని పొందజాలడని వైయ్యయికుడైన గౌతముడు బోధించాడు. జ్ఞానార్జనకి అవసరమైన శాస్త్రాలను చక్కగా అభ్యసించాలి. జ్ఞానార్జన అంటే పదార్ధాలు, వాటి సంబంధ బేధాలు, మొదలైన విషయాలను తెలుసుకొని, ఆపైన ఆలోచన, మననం, వివేచన మొదలైన విధానాలలో కృషి చేయుట.
* ప్రమాణం: జ్ఞానార్జన ఎలా సాధ్యమౌతుంది? ఆర్జించిన జ్ఞానం ఎప్పుడు ఆమోదించబడుతుంది? అనే ప్రశ్నలకి ప్రమాణాలు ఆధారం అవుతుంది. ఇవి 8 విధానములు. అవి ప్రత్యక్ష ప్రమాణము, అనుమానము, ఉపమానము, శబ్దము, అనుభవము, అర్ధాపత్తి, యోగదృష్టి, ఆప్తవాక్యము. వీటిలో హిందూ పండితులందరు ప్రత్యక్ష, అనుమాన, శబ్ద ప్రమాణాలను మాత్రమే ఒప్పుకుంటారు. ఇందులో శబ్ద ప్రమాణాన్ని : అర్ధయుక్త వాక్య ప్రమాణం, వేద ప్రమాణం, అనుభవ ప్రమాణం, అర్ధాపత్తి ప్రమాణం, యోగదృష్టి ప్రమాణం, ఆప్తవాక్య ప్రమాణం గాను విభజించారు.
 
* తర్కం: దీనిని సుజ్ఞానార్జన తత్త్వం ముఖ్యమైనది. ఆమోదయోగ్యమైన పద్దతుల్లో జ్ఞానార్జన చేసి వాటిలోని దోషాలను విచారించి, తొలగించి, సుజ్ఞానాన్ని సంపాదించాలని దీని ముఖ్య వుద్దేశ్యము.
 
* పరార్ధహేతు-సాధ్య తర్క విధానము: అనుమాన ప్రమాణమే తర్క శాస్రానికి జీవం. హేతువు నుంచి మనం సాధించగల ఫలితాన్ని సాధ్యం అంటారు. తనలో తను పరామర్సించుకొని, హేతువు నుంచి సాధ్యాన్ని తెలుసుకొంటె, అది స్వార్ధ (స్వ-అర్ధ) హేతు-సాధ్య తర్క విధానం అవుతుంది. ఇంకొకరికి తెలియపరచడానికై హేతు- సాధ్య వివరణ చేస్తే, అది పరార్ధ హేతు-సాధ్య తర్క విధానము అవుతుంది.A kind of Syllogism.
* ఈ శాస్త్రములో వాడే ముఖ్య పదాలు: కారణము, కార్యము, హేతువు, సాధ్యం, నిగమనం లేదా ఫలితం.
 
===మూలము===
*1978 భారతి మాస పత్రిక వ్యాసము-హైందవ తర్క శాస్త్ర పరిచయము- వ్యాసకర్త:కందుల నాగభూషణంగారు.
 
 
[[వర్గం:సంస్కృత రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/అన్నంభొట్టు" నుండి వెలికితీశారు