"బారసాల" కూర్పుల మధ్య తేడాలు

1,921 bytes added ,  1 సంవత్సరం క్రితం
 
సాంప్రదాయ పాటలు పాడటానికి మహిళలు ఊయల చుట్టూ గుమిగూడుతారు. ఈ కార్యక్రమంలో తల్లిని గౌరవిస్తారు. బిడ్డను కుటుంబం, సమాజంలోని పెద్దలు ఆశీర్వదిస్తారు. తండ్రి శిశువు పేరును శిశువు చెవిలో మూడుసార్లు గుసగుసలాడుతూ చెబుతాడు. నేలపై లేదా పళ్ళెంలో పరచిన బియ్యం మీద కూడా ఈ పేరు వ్రాస్తారు. పిల్లల మామయ్య ఆవు పాలు, తేనె మిశ్రమంలో ముంచిన బంగారు ఉంగరాన్ని తీసుకొని శిశువు నాలుకపై ఉంచుతాడు. అప్పుడు పెద్దలు పిల్లలకి మంచి పేరు సంపాదించాలనీ, గొప్ప వ్యక్తి కావాలనీ, ఉజ్వల భవిష్యత్తును పొందాలనీ దీవిస్తారు.
 
== నామకరణం ==
హిందూ ఆచారాల ప్రకారం జన్మ నక్షత్రం ప్రకారం, నక్షత్రంలో జన్మించిన పాదం ప్రకారం ఈ క్రింది అక్షరంతో ప్రారంభమైన పేర్లను పెడతారు.
 
# అశ్విని - చూ - చే - చో - ల
# భరణి - లి - లూ - లే - లో
# కృత్తిక - ఆ - ఈ - ఊ - ఏ
# రోహిణి - ఓ - వా - వీ - వూ
# మృగశిర - వే - వో - కా - కి
# ఆరుద్ర - కూ - ఖం - జ్ఞా - చ్చా
# పునర్వసు - కే - కో - హా - హీ
# పుష్యమి - హూ - హే - హో - డా
# ఆశ్లేష - డి - డు - డె - డో
# మఖ - మా - మీ - మూ - మే
# పుబ్బ - మో - టా - టీ - టూ
# ఉత్తర - టే - టో - పా - పీ
# హస్త - పూ - ష - ణా - ఠా
# చిత్త - పే - పో - రా - రీ
# స్వాతి - రూ - రే - రో - త
# విశాఖ - తీ - తూ - తే - తో
# అనూరాధా - నొ - నీ - నూ - నే
# జ్యేష్ఠ - నో - యా - యీ - యూ
# మూల - యే - యో - బా - బి
# పూర్వాషాఢ - బూ - ధా - భా - ఢ
# ఉత్తరాషాఢ - బే - బో - జా - జీ
# శ్రవణం - జూ - జే - జో - ఖా
# ధనిష్ట - గా - గీ - గూ - గే
# శతభిషం - గో - సా - సీ - సూ
# పూర్వాభాద్ర - సే - సో - దా - దీ
# ఉత్తరాభాద్ర - దు - శ్యం - ఝూ - థా
# రేవతి - దే - దో - చా - చీ
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2915723" నుండి వెలికితీశారు