రాజా (1999 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తమిళ సినిమా పునర్నిర్మాణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎కథ: పూర్తయింది.
ట్యాగు: 2017 source edit
పంక్తి 21:
రాజా, బాలు తోడుదొంగలు. చిల్లర దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. ఒకసారి వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించడానికి ఒప్పుకుని పోలీసులకు భయపడి ఒక ఇంట్లో దాక్కుంటారు. ఆ ఇంట్లో ఉన్న అంజలి వీళ్ళని అక్కడే కొద్ది రోజులు బంధించి ఇంట్లో పనులు చేయించుకుని తర్వాత దొంగతనాలు మానేసి బుద్ధిగా బతకమని వదిలేస్తుంది. వీళ్ళు వెళ్ళేటపుడు బాలు దొంగతనంగా అంజలి డైరీ తమతో పాటు తీసుకుని వెళతారు. దాని ద్వారా ఆమె గతం గురించి తెలుసుకుంటాడు రాజా. అతని జీవన విధానంలో నెమ్మదిగా మార్పు వస్తుంది.
 
అంజలి తండ్రి లాయర్ విశ్వనాథం. ఆయన అంజలి తల్లితోతల్లిni రహస్యంగా పెళ్ళి చేసుకుని వదిలేసి ఉంటాడు. తర్వాత భాగ్యలక్ష్మి అనే ఆమెను వివాహం చేసుకుంటాడు. ఈలోపు అంజలి తల్లి మరణిస్తుంది. విశ్వనాథం భార్యకు భయపడి ఈమె బాగోగులు పెద్దగా పట్టించుకోడు. కానీ కొద్ది రోజులకు ఆమె మీద జాలితో స్నేహితుడి కూతురని అబద్ధం చెప్పి తన ఇంట్లోనే ఉంచుకుంటాడు. కానీ ఇంట్లో వాళ్ళంతా ఆమెను పనిమనిషిలా చూస్తుంటారు. ఒకసారి భాగ్యలక్ష్మి తమ్ముడు విదేశాల నుంచి వస్తాడు. అంజలి అంటే అభిమానం చూపిస్తాడు. విశ్వనాథం ఆమెను అతనికిచ్చి వివాహం చేయాలనుకుంటాడు. కానీ అతను ఒప్పుకోడు. ఇదంతా తెలుసుకున్న రాజాకు ఆమె మీద జాలితో పాటు నెమ్మదిగా అభిమానం పెరుగుతుంది.
 
బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళి తిరిగొచ్చిన భాగ్యలక్ష్మికి ఇంట్లో నెక్లెస్ పోయిందని అంజలి మీద అబాండం వేస్తుంది. ఈలోపు రాజా, బాలు వదిలేసిన సిగరెట్ల ముక్కలు చూసి ఆమెను అవమానించి ఇంటిలోనుంచి తరిమేస్తారు. విశ్వనాథం కూడా ఏమీ చేయలేక ఊరుకుంటాడు. తమ వల్లనే అంజలికి ఈ గతి పట్టిందని బాధపడ్డ రాజా ఆమెను ఒక లేడీస్ హాస్టల్ లో చేర్చి ఆమె బాగోగులు చూసుకుంటాడు. ఆమె కోసం నిజాయితీగా కష్టపడటం మొదలుపెడతాడు. ఆమెకు సంగీతంలో ఉన్న అభినివేశాన్ని గుర్తించి ఆమెకు శిక్షణ ఇప్పిస్తాడు. ఆమెకు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి ఆమెను ఓ మంచి గాయనిని చేస్తాడు. ఆమెకు బాగా అవకాశాలు వచ్చి విజయవంతమైన గాయనిగా పేరు తెచ్చుకుంటుంది.
 
ఒకానొక ఇంటర్వ్యూలో ఆమెను తండ్రి గురించి అడగ్గా చెప్పుకోవడానికి మొహమాటపడుతూ ఉండగా విశ్వనాథం ఫోన్ చేసి తానే ఆమె తండ్రిని అని ధైర్యంగా చెప్పమంటాడు. దాంతో భాగ్యలక్ష్మి మొదట విస్తుపోయినా తర్వాత అంజలిని బంగారు గుడ్లు పెట్టే బాతుగా భావించి ఆమె దగ్గరకే అందరూ వచ్చేస్తారు. రాజా, బాలును నెమ్మదిగా పక్కకు పెట్టడం మొదలుపెడతారు. అంజలికి రాజా మీద నమ్మకం పోయేలా చేస్తారు. రాజా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ మామూలు జీవితం గడుపుతుంటాడు. ఈ లోపు భాగ్యలక్ష్మి తన తమ్ముడికి అంజలినిచ్చి పెళ్ళి చేయాలని చూస్తుంది. అదే సమయంలో అంజలికి జాతీయ పురస్కారం వస్తుంది. ఆమె ఆ సన్మాన సభలో అందరికీ నిజాలు వెల్లడించి రాజానే తన భర్తగా ఎన్నుకోవడంతో కథ ముగుస్తుంది.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/రాజా_(1999_సినిమా)" నుండి వెలికితీశారు