"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

రూపపట చిత్రణ
చి
(రూపపట చిత్రణ)
 
===రూపపట చిత్రణ===
మొఘల్ యుగంలో చిత్రకారులు మొదటినించి రూపపట చిత్రణను వాస్తవికతను ఆధారంగా చేసుకొని రూపొందించారు. నిజానికి వాస్తవిక చిత్రణ (realistic portraiture) అనేది పర్షియన్ లఘుచిత్రకళలో గాని లేదా అంతకు పూర్వం వున్న భారతీయ చిత్రకళలో గాని ఒక లక్షణంగా ఎన్నడూ లేదు. ఒక విధంగా మొఘల్ చిత్రకారులతోనే వాస్తవిక రూపపట చిత్రాలను గీయడం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ రూపపట చిత్రాలన్నీ టెంపెరా పద్దతిలో గీయబడ్డ నీటి వర్ణ చిత్రాలు. అక్బర్ పాలనా కాలం వరకూ మొఘల్ చిత్రకారులు రూపపటాలను పార్శ్వ దృష్టితో చిత్రించేవారు. ఈ పద్దతిలో వ్యక్తి ముఖం నేరుగా వీక్షకుడిని చూస్తుంటే, మిగిలిన శరీరంలో సగభాగం వీక్షకుడి వైపు తిరిగివుండేది. పాదాలు కూడా సమంగా కాకుండా ఒకదాని వెనుక వున్నట్లుగా చిత్రించేవారు. ఇటువంటి పర్షియన్ సంప్రదాయ చిత్రణ, జహంగీర్ కాలంలో ప్రక్కకు పెట్టబడింది. ముఖ్యంగా జహంగీర్ కాలంలో రూపపట చిత్రణలో సృజనాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. మూడువంతుల ప్రొఫైల్ లో చిత్రాలను రూపొందించే పద్దతి ఆచరణలోకి వచ్చింది. పాదాలు, చేతుల చిత్రణలో కూడా సృజనాత్మకత మరింతగా పెరిగింది.
 
 
==మొఘల్ చిత్రకళా వికాసం==
7,315

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2915955" నుండి వెలికితీశారు